TELUGU VIDEO LESSONS - జనరల్‌ తెలుగు - ఛందస్సు వీడియో లెసన్స్‌

ఛందస్సు - పరిచయం

ఈ పాఠంలో చందస్సు పరిచయం చేయబడింది. గురు లఘువులను గుర్తించడం, గణ విభజన చేసే పద్ధతి ఇందులో వివరించాము. చివరలో అభ్యాసం కూడా ఇచ్చాము. పాఠంలో విషయాలను చక్కగా ఆకళింపు చేసుకుని, చివర ఇచ్చిన అభ్యాసాన్ని సాధించండి. అటువంటి మరిన్ని సమస్యలను మీ పాఠాలనుండి గ్రహించి సాధించండి.


గణవిభజన - ఛందస్సు 2


ఛందస్సులో ఇది రెండవ పాఠం. ఇందులో గణవిభజన చేసే పద్ధతి మరొకటి నేర్పించారు. ఇది విద్యార్థులకు ఉపయోగకరం.


మొదటి పాఠంలో ’ యమాతారాజభానస’ పద్ధతిలో నేర్పగా ఇందులో -

ఆదిమధ్యావసానేషు యరతా యాంతి లాఘవమ్ |
భజసా గౌరవం యాంతి నమౌ సర్వలగౌ స్మృతౌ   ||

అనే పద్ధతిలో నేర్పించారు.


ఛందస్సు 3 వృత్తాలు

తెలుగు ఛందస్సులో గణవిభజన ఇంతకు ముందు పాఠాల్లో నేర్చుకున్నారు. ఈ పాఠంలో నాలుగు ప్రథాన వృత్తాలు
  1. ఉత్పల మాల
  2. చంపకమాల
  3. శార్దూలం
  4. మత్తేభం 
అనే వాటిని నేర్చుకుంటారు. 


ఉప జాతులు (సీసం-ఆట వెలది - తేటగీతి)

ఈ వీడియో పాఠంలో ఉప జాతులు అంటే -
సీసం-ఆట వెలది - తేటగీతి
అనే వాని లక్షణాలు, ఉదాహరణలు నేర్పినాము.




Post a Comment

Previous Post Next Post