కరెంట్‌ అఫైర్స్‌ - అచ్చు అయిన రావూరి భరద్వాజ తొలి నవల ఏది?

కరెంట్‌ అఫైర్స్‌ - అచ్చు అయిన రావూరి భరద్వాజ తొలి నవల ఏది?

రావూరి భరద్వాజ
- ప్రముఖ రచయిత రావూరి భరద్వాజా ది. 18.10.2013 న మరణించారు.
- భరద్వాజ 1927 జూలై 5న కృష్ణాజిల్లా నందిగామ తాలూకా మోగలూరు గ్రామంలో జన్మించారు.
- అచ్చు అయిన ఆయన తొలి తెలుగు కథ విమల
- విమల కథ 1946లో ప్రజామిత్రలో ప్రచురితం అయినది.
- 1950లో రాగిణి అనే పుస్తకాన్ని రచించారు.
- రావూరి దాదాపు 43 కథలు పిల్లలకోసం, 17 నవలలు, 11 సాహిత్య గ్రంధాలు 33 సైన్స్‌ కథలు రాశారు.
- 1968, 1983 సంవత్సరాలలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1987లో సోవియట్‌లాండ్‌ నెహ్రూ అవార్డు, అదే సంవత్సరంలో భారతీయ భాషా పరిషత్‌ అవార్డు లభించాయి.
- భరద్వాజ రచనలలో ప్రాచర్యుం పొందినది 'జీవన సమరం'
- సినీ పరిశ్రమ ఇతివృత్తంగా భరద్వాజ రాసిన నవల 'పాకుడు రాళ్లు'
- 2012వ సంవత్సరానికి గానూ ఙ్ఞాన్‌పీఠ్‌ అవార్డు పాకుడు రాళ్లు నవలకు లభించింది.
- మంజరి అనే పాత్ర కథానాయికగా ఎదిగేందుకు పడిన కష్టాలను పాకుడురాళ్లు నవలలో వర్ణించారు.
- ఆనకట్టనిర్మాణానికై రామకృష్ణ అనే పాత్ర జీవితాన్ని కాదంబరి అనే నవలలో ఈయన వర్ణించారు.

మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

1 Comments

  1. మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేయండి
    http://blogvedika.blogspot.in/

    ReplyDelete
Previous Post Next Post