ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్.. 494 పోలీస్ కానిస్టేబుల్స్ (కమ్యూనికేషన్స్) రాత ప‌రీక్ష‌ సిల‌బ‌స్ విశ్లేష‌ణ‌.

Andhra Pradesh State Level Police Recruitment Board - Communication Police Constable - Syllabus Analysis 

ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్.. 494 పోలీస్ కానిస్టేబుల్స్ (కమ్యూనికేషన్స్) రాత ప‌రీక్ష‌ సిల‌బ‌స్ విశ్లేష‌ణ‌. 

-  రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో రెండు వందల మార్కులకు టెక్నికల్ పేపర్ ఉంటుంది.
- మూడు గంటల వ్యవధిలో నిర్వహించే ఈ పరీక్షలో 200 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.
- ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక జరుగుతుంది.

- ఈ పరీక్షలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో, కంప్యూటర్ బేసిక్స్, టెలిఫోన్ సిస్టమ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

- ఎలక్ట్రికల్ విభాగం నుంచి కండక్టర్స్ అనువర్తనాలు, ఇన్సులేటర్స్, సెమీకండక్టర్స్, కన్‌స్ట్రక్షన్ ఆఫ్ కార్బన్, కిర్కాఫ్ లా, ఓమ్స్ లా, వీటీవీఎం, యూనివర్సల్ మీటర్,  ఓమ్ మీటర్, అమ్మీటర్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఏసీ ఇండ్యూస్డ్ వోల్టేజ్, కరెంట్, ఫారడేస్ ప్రిన్సిపల్, లెన్సెస్ లా ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్, ఏసీ జనరేటర్స్, ఫ్లెమింగ్ నియమం, యావరేజ్ ఆర్‌ఎంఎస్ వ్యాల్యూస్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

- ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో విభాగానికి సంబంధించి ఇండక్టెన్స్ ఇన్ ట్యూన్డ్ సర్క్యూట్ అప్లికేషన్స్, కాయిల్ కాన్సెప్ట్ ఆఫ్ రీయాక్టెన్స్, పవర్ ఫ్యాక్టర్, ఇండక్టెన్స్ అండ్ కో ఎఫిషియెంట్ ఆఫ్ కప్లింగ్, సిరీస్, పారలల్ కనెక్షన్ ఆఫ్ కెపాసిటర్ ఇన్ ఏసీ సర్క్యూట్స్, వివిధ రకాల కెపాసిటర్లు వాటి అనువర్తనాలు, బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ రెజోనెన్స్ సర్క్యూట్, పారలల్ ఎల్‌సీ సర్క్యూట్, యాంటీ రెజోనెన్స్ సర్క్యూట్, పీఎన్‌పీ అండ్ ఎన్‌పీఎన్ ట్రాన్‌సిస్టర్స్ అండ్ డైనమిక్ కర్వ్స్, ఎఫ్‌ఈటీ ట్రాన్‌సిస్టర్స్, ఆఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫయర్ సర్క్యూట్, బ్రిడ్జ్ రెక్టిఫయర్స్, ఫిల్టర్ల ఉపయోగాలు, బ్యాండ్ విడ్త్, డిటెక్టర్స్, ఆంఫ్లిఫికేషన్స్, పుష్‌ఫుల్ వోల్టేజ్ ఆంఫ్లిఫయర్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

- కంప్యూటర్స్ బేసిక్స్‌కు సంబంధించి ఎంఎస్ ఆఫీస్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్, మదర్ బోర్డ్, ఇతర ఉపకరణాలు, ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్, నెట్‌వర్కింగ్ అండ్ లాన్ తదితరాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.

- టెలిఫోన్ సిస్టమ్‌కు సంబంధించి బేసిక్స్ ఆఫ్ పీఎస్‌టీఎన్ టెలిఫోన్ నెట్‌వర్క్, టెలిఫోన్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఈపీఏబీఎక్స్, ఎఫ్‌ఏఎక్స్, ఇంటర్నెట్ టెలిఫోనీ, జీఎస్‌ఎం, సీడీఎంఏ ఫోన్ సిస్టమ్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.

ఈ ప‌రీక్ష‌కు ప్రిపేర్ అయ్యే అభ్య‌ర్ధుల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల‌న ప్ర‌త్యేకంగా ఏ ప్ర‌చుర‌ణ సంస్థ‌లు దీనికోస‌మై మెటీరియ‌ల్‌ను రూపొందించ‌క పోవ‌చ్చు.
- అభ్య‌ర్ధులు అందుబాటులో ఉండే పుస్త‌కాల‌నుంచి గ‌రిష్టంగా సిల‌బ‌స్‌ను క‌వ‌ర్ చేస్తూ ప్రిపేర్ కావ‌ల‌సి ఉంటుంది.
- అభ్య‌ర్ధులు ముఖ్యంగా క్రింది పుస్త‌కాల‌ను సేక‌రించుకుని ప్ర‌ణాళికాబ‌ద్ద‌మైన ప్రిప‌రేష‌న్ సాగించ‌డం ద్వారా రాణించే అవ‌కాశం ఉంది.
1. ఐటిఐ, పాలిటెక్నిక్ చ‌దువుతున్న విద్యార్ధుల‌నుంచి ఎలక్ట్రానిక్స్ స‌బ్జ‌క్టుకు సంబంధించిన పాఠ్య‌పుస్త‌కాల‌ను సేక‌రించుకోవాలి.
2. కంప్యూట‌ర్ ఎరా వారు రూపొందించిన కంప్యూట‌ర్ క‌ల్ప‌వృక్షం,
3. పిసి ట్ర‌బుల్ షూటింగ్‌
4. కంప్యూట‌ర్ హార్డ్‌వేర్ - హార్డ‌వేర్ ప‌రిక‌రాలు, వాటికి అనుబంధంగా ఉప‌యోగించే టెక్నాల‌జీల‌కు సంబంధించిన స‌మాచారం ఈ పుస్తకం అందిస్తుంది.
5. కంప్యూట‌ర్ డిక్ష‌న‌రీ - కంప్యూట‌ర్ సాంకేతిక సంబంధిత ప‌దాల‌ను గురించిన వివ‌ర‌ణ‌ల కోసం ఈ పుస్త‌కం ఉప‌యుక్తం
6. సెల్‌ఫోన్ చిట్కాలు
పై పుస్త‌కాల‌లో 2 నుంచి 6 వ‌ర‌కూ గ‌ల పుస్త‌కాలు కంప్యూట‌ర్ ఎరా వారినుంచి (విజేత కాంపిటీష‌న్స్) నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు.
ఈ పుస్త‌కాలు ప్ర‌ముఖ బుక్‌స్టాల్స్‌లో ల‌భించును. లేదా 040-27429494, 040-27406336, 9963293399 నంబ‌ర్ల‌లో విజేత కాంపిటీష‌న్స్ ప‌బ్లికేష‌న్ వారిని సంప్ర‌దించి పోస్టు ద్వారా కొనుగోలు చేయ‌వ‌చ్చు.

మీ
స‌ల‌హాలు, సూచ‌న‌లు సందేహాల‌ను పంపండి
చైత‌న్య కుమార్ స‌త్య‌వాడ‌,
ఫోన్ 9441687174
ఈమెయిల్
 menavachaitanyam@gmail.com

Post a Comment

Previous Post Next Post