కరెంట్స్ అఫైర్స్ తెలుగులో (current affairs in telugu)
ఈనాడుకు అంతర్జాతీయ పురస్కారం
- స్వచ్ఛభారత్‌కోసం ఈనాడు దినపత్రిక యాజమాన్యం చేపట్టిన కార్యక్రమానికి అంతర్జాతీయ పురస్కారం లభించింది.
- ప్రపపంచ వార్తా పత్రికల, వార్తా ప్రచురణ కర్తల సంఘం (వాన్-ఇఫ్రా)నుంచి బంగారు పతకం సాధించింది.
- 2016 సంవత్సర సామాజిక సేవా విభాగంలో ఈ గుర్తింపు లభించింది.
- ప్రపంచంలోని 120 దేశాల నుంచి వెలువడుతున్న 18000 ప్రచురణ కర్తలకు, 15000 ఆన్‌లైన్ సైట్లకు, మూడువేలకు పైగా కంపెనీలకు వాన్-ఇఫ్రా ప్రాతినిధ్యం వహిస్తున్నది.
ముడతలు పోగొట్టే కృత్రిమ చర్మం
- చర్మంపై ముడతలను తాత్కాలికంగా మాయం చేసి, యవ్వన కాంతులను తీసుకొచ్చే సరికొత్త కృత్రిమ చర్మాన్ని ఆవిష్కరించారు.
-అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన డేనియెల్ ఆండెరసన్, భారత మూలాలున్న అల్ఫేష్ పటేల్, నితిన్ రామదురై తదితర శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన సాగించింది.
- సిలికాన్ ఆధార అణువులతో వీరు సరికొత్త పదార్ధాన్ని తయారుచేశారు. దీన్ని లేపనంగా ఉపయోగించడం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుందని, కళ్లకింద వలయాలపై రాస్తే వాటి ఆకృతి మారుతుందని వివరించారు.
Tags
CA