Vikaspedia వికాస్‌పీడియా వెబ్‌సైటును గురించి

కేంద్ర ప్రభుత్వ సంస్థ సి-డాక్‌ వారి ఆన్‌లైన్‌ వెబ్‌ పోర్టల్‌ వికాస్‌పీడియా వారి ఒక్కరోజు అవగాహనా సదస్సు ది. 05.05.2014 మంగళవారం జరిగింది. ఈ సదస్సు నిర్వహణకు వెబ్‌పోర్టల్‌, BASIX కంపెనీ ప్రతినిధులైన శ్రీ వినోద్‌గారు, శ్రీ విజయ్‌ కుమార్‌గారు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ఈ సదస్సు ప్రారంభం అయినది. విశిష్ట అతిధులుగా డిప్యూటీ డిఎంహెచ్‌ఓ శ్రీ దుర్గారావుగారు హాజరయ్యారు. వారితో పాటు కార్యక్రమ నిర్వాహకులు SW స్వచ్ఛంద సంస్థ శ్రీ రమేష్‌బాబు గారు, ఇంకా ఎన్‌జీఓ నిర్వాహకులు పలువురు అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వికాస్‌ పీడియా గురించి వివరించారు.






వికాస్‌ పీడియా గురించి . . .
ఇండియా డెవలప్ మెంట్ గేట్ వే నుండి రూపొందిన ఈ పోర్టల్ జాతీయ స్థాయిలో అభివృధ్ధి చేయబడుతోంది. ఇది సామాజిక అభివృద్ది, సామర్ధ్య రంగాలలో సమాచారాన్ని, విజ్ఞానాన్ని, సేవలను అందిస్తోంది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార, సాంకేతిక పరిజ్ఞాన శాఖ (డైటీ) భారత ప్రభుత్వం వారి ఆరంభ యత్నం, ప్రగతి సంగణన వికాస కేంద్రం (సి-డాక్, హైదరాబాద్) ద్వారా నిర్వహించబడుచున్నది.  ఈ పోర్టల్‌ ముఖ్యంగా ఆరు రంగాలకు సంబందించిన సమస్త సమాచారాన్ని అందించడానికీ, ఆన్‌లైన్‌లో విఙ్ఞానసర్వస్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నది. ఈ వెబ్‌పోర్టల్‌ లో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం, శక్తి వనరులు, ఇ-పాలన వంటి విషయాలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచే ప్రయత్నం జరుగుతున్నది.
ఈ వెబ్‌పోర్టల్‌ మరో ముఖ్య లక్షణం ఇది కేవలం ఆంగ్ల భాషలోనేకాక, మొత్తం 10 భాషలలో తన సేవలను అందిస్తున్నది. వాటిలో తెలుగు భాష కూడా ఒక్కటి. త్వరలోనే దీన్ని 22 భాషలలోకి విస్తరించనున్నట్లు శ్రీ వినోద్‌గారు తెలియచేశారు. ఈ వెబ్‌ పోర్టల్‌లో ఎవ్వరైనా వాలంటీర్లుగా చేరి మనకు తెలిసిన సమాచారాన్ని కూడా ఇందులో ఉంచవచ్చు. మనకు అవసరం అయిన సమస్త సమాచారాన్ని అందించాడానికి ఏర్పాటు చేసిన ఈ వేదికకు కనీసం నెలలో ఒక రోజైనా కేటాయించి మనకు తెలిసిన సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయడం ద్వారా నలుగురికి ఉపయోగపడవచ్చు.
లాగిన్‌ కావడానికి సూచనలతో కూడిన వీడియోను రూపొందించి మీతో షేర్‌ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఏదైనా సందేహాలుంటే మెయిల్‌ ద్వారా నన్ను సంప్రదించవచ్చు.
వాలంటీర్‌లలో అత్యుత్తమ రచనలు చేసినవారికి, ఎక్కువ సమయాన్ని కేటాయించిన వారికి ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులను కూడా అందిస్తుంది ఈ పోర్టల్‌
అవగాహనా సదస్సును గురించి . . .
వికాస్‌పీడియా వెబ్‌పోర్టల్‌ను గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువ చేయడానికి జిల్లాస్థాయి అవగాహనా సదస్సును ఈ సంస్థ క్రమంగా నిర్వహిస్తుంటుంది. ఆ శ్రేణిలో భాగంగానే ది. 05.05.2015 మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా సదస్సును ఏలూరులో నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన డిప్యూటీ డిఎంహెచ్‌ఓ గారు ఆరోగ్యం విభాగంలో అనేక వ్యాధులకు సంబధించిన సమాచారం అందుబాటులో ఉంచారని, వివిధ వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నివారణ మార్గాలు ఏమంటి? ఏ ఏ వ్యాధులకు ఎలాంటి చికిత్సలు, ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలియచేశారని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ పథకాలకు సంబంధించిన సకల సమాచారాన్ని వెబ్‌పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారని, ఆరోగ్యమేకాక విద్య, ఈ-పాలన, శక్తి వనరులు ఇతర రంగాలలో కూడా మంచి సమాచారాన్ని అందుబాటులో ఉంచారని తెలియచేశారు. అనంతరం ఎన్‌జీఓలు మాట్లాడుతూ తామూ గ్రామీణ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో వికాసానికి తోడ్పడుతున్నామని, ఇలాంటి వెబ్‌పోర్టల్‌ద్వారా తమకు చేరే సమాచారాన్ని ఆయా వెనుకబడిన ప్రాంతాలలో ప్రజలకు చేరవేసే బాధ్యతను మేమూ తీసుకుంటామని తెలియచేశారు.
ఈ సందర్భంగా మాట్లాడే అవకాశం నాకూ లభించడం ఆనందదాయకం. 'నిజానికి నేను డియస్సీ 'విద్యాదృక్పధాలు' పాఠ్యపుస్తకాలు దొరకని రోజులలో విద్యార్ధులకోసమని ప్రభుత్వం ప్రకటించిన సిలబస్‌కు అనుగుణంగా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో భాగంగా నాకు ఎక్కడా దొరకని బాలల హక్కులను గురించిన సమాచారం కోసం వెతుకుతుండగా వికాస్‌పీడియా వెబ్‌సైట్‌ కనిపించింది. ఇది అంతకు ముందు ఐఎన్‌డిజి గా పిలువబడేది. ఆ వెబ్‌సైట్‌కూడా నాకు పరిచయమే. వికాస్‌ పీడియా వెబ్‌పోర్టల్‌ చూసిన అనంతరం ఆశ్చర్యం కలిగింది. అంత సమచారం, అదీ తెలుగులో అందించే వెబ్‌పోర్టల్‌లో అదే అతి పెద్దది అనే భావన నాకు కలిగింది. వెంటనే ఆ వెబ్‌ పోర్టల్‌లో విషయ రచన భాగస్వామ్యునిగా నమోదు చేసుకున్నాను. ఆపై పలు అంశాలకు సంబంధించి, నాకు తెలిసిన సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయడం మొదలుపెట్టాను. ఆ సమయంలోనే నేను సోలార్‌ పవర్‌ సర్వీసెస్‌ పేరుతో రూపొందించిన బ్లాగునుండి సమాచారాన్ని శ్రీ విజయ్‌ గారు వికాస్‌పీడియాలో అప్‌లోడ్‌ చేసినట్లు తెలియచేశారు. నిరుద్యోగ అభ్యర్ధులకోసం నేను ఖాళీ సమయాన్ని వెచ్చించి వివిధ పోటీ పరీక్షలకు అవసరం అయ్యే స్టడీమెటీరియల్‌్స, ప్రాక్టీస్‌ పేపర్స్, ఆడియో, వీడియో లెసన్‌లను రూపొందించి అందిస్తున్నాను. వికాస్‌పీడియా వారు గత జనవరి ౨౬ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని 'ఆన్‌లైన్‌లో వ్యాసరచన' పోటీలను నిర్వహించారు. నిర్వహించాల్సిన రోజు నేను పాఠశాలకు సెలవు పెట్టాల్సి రావడంతో నిర్వహణ అనుకున్న సమయానికి విద్యార్ధలకు చేరువ చేయలేకపోయాను. కానీ మరుసటి రోజు పోటీలను నిర్వహించి ఈమెయిల్‌ద్వారా పంపించాము. తరువాత మా విద్యార్ధి కె.కిరణ్‌కుమార్‌ జిల్లాస్థాయిలో ప్రధమస్థానంలో నిలిచాడని శ్రీ వినోద్‌గారు ఫోన్‌ద్వారా తెలియపరిచారు. సంతోషం వ్యక్తపరుస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు కృతఙ్ఞతలు తెలియచేస్తూ ముగించాను.
అనంతరం విజయ్‌ కుమార్‌గారు మాట్లాడుతూ ఙ్ఞానం అనేది ఆపలేనిది అని ప్రతిరోజూ ఙ్ఞానం వచ్చి చేరుతూ ఉంటుందని, సాంకేతికంగా పలు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయని, వాటిని గురించి తెలుసుకోలేకపోతే వెనుకబడినట్లేనని అందుకే ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించుకుంటూ. నూతన సాంకేతిక పద్దతులను అవగాహన చేసుకుంటూ ముందుకు సాగాలని తెలియచేశారు






అనంతరం జరిగిన సెషన్‌లో శ్రీ వినోద్‌గారు వికాస్‌పీడియా వెబ్‌పోర్టల్‌ ఏ విధంగా ఆవిష్క్కతం అయినదీ, దాని ప్రధాన లక్ష్యాలు ఏమిటి? BASIX అనే సంస్థ సమాచార విప్లవం తీసుకురావడానికి ఏవిధంగా పాటుపడుతున్నదో తెలియచేశారు. వికాస్‌పీడియా వెబ్‌సైట్‌లో వాలంటీర్లుగా నమోదు చేసుకోవడానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరంగా తెలియచేశారు. ఈ సందర్భంలో శ్రీ విజయ్‌ కుమార్‌ గారు సాంకేతిక సహాయాన్ని అందించి మరింత వివరంగా వింటున్నవారికి చేరువకావడానికి సహకరించారు. అనంతరం జరిగిన సెషన్‌లో శ్రీ వినోద్‌గారు మేము, నాతోపాటు సదస్సుకు హాజరైన వారికి వచ్చిన సందేహాలను గ్రూప్‌ డిష్కషన్‌ నిర్వహించి వివరంగా సమాధానాలను ఇచ్చారు. కనీస పరిఙ్ఞానం లేని వారుకూడా ఆ ఉపన్యాసం అనంతరం తమంతట తాముగా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోగల స్థాయికి చేరుకున్నారు.
చివరగా 'స్వచ్ఛభారత్‌' అంశంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన వ్యాస రచన పోటీలో జిల్లాస్థాయి విజేత కె. కిరణ్‌కుమార్‌కు మంచి బహుమతి, సి-డాక్‌ వారినుంచి విలువైన సర్టిఫికెట్‌ను, మంచి డిక్షనరీను బహుమతిగా అందించారు శ్రీ వినోద్‌గారు. ఈ పోటీలను నిర్వహించినందుకూ, వికాస్‌పీడియాకు బెస్ట్ వాలంటీర్‌గా పనిచేస్తున్నందుకు, నవచైతన్య కాంపిటీషన్స్‌ ద్వారా నిరుద్యోగులకు మేలు చేస్తున్నందుకు బెస్ట్ వాలంటీర్‌, ప్రోగ్రామ్‌ ఆర్గనైజర్‌గా ఒక బహుమతిని, సర్టిఫికెట్‌ను నాకు కూడా అందచేశారు. వారికి ధన్యవాదములు తెలియచేసి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాము.





ఈ సందర్భంగా లభించిన చిన్న నగదు బహుమతిని వికాస్‌పీడియా వారి పేరుతో శాస్ర్తవేత్తల చిత్రపటాలను సేకరించి ఫ్లెక్సీ బ్యానర్‌లుగా రూపొందించి మా తరగతిలో ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాను.
ఇంత ఓపికగా ఈ వ్యాసాన్ని చదివిన మీ అందరికీ కృతఙ్ఞతలు
మీ
చైతన్య కుమార్‌ సత్యవాడ
చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా
ఫోన్‌ 9441687174
ఈమెయిల్‌ menavachaitanyam@gmail.com


Post a Comment

Previous Post Next Post