సెంటు సీసా మూత తెరిచినపుడు గది అంతా సువాసన ఎలా వ్యాపిస్తుంది?

సెంటు సీసా మూత తెరిచినపుడు గది అంతా సువాసన ఎలా వ్యాపిస్తుంది?
- ఇది వాయు పదార్ధాలకు ఉండే 'వ్యాపనం' అనే లక్షణ ఫలితం
- సాధారణంగా వాయు పదార్దాలు వేగంగా చలించే లక్షణాన్ని కలిగి ఉంటాయి.
- వాయు కణాలు ఒకచోటు నుంచి మరోచోటుకు విస్తరించడాన్ని వ్యాపనం అంటారు.
- సెంటు సీసా మూత తెరిచినపుడు అందులోని ద్రవరూపంలోని సెంటు భాష్ప(వాయు) స్థితికి చేరుకుంటుంది.
- వాయువుకు ఉండే వ్యాపన లక్షణం ఫలితంగా సెంటు కణాలు గది అంతటా వ్యాపనం చెందుతాయి.
- అంటే సెంటు కణాలు గదిలోని అన్ని స్థానాలకు చేరుకుంటాయి.
- కనుక సెంటు సీసా మూత తెరిచినపుడు గది అంతటా సువాసన వ్యాపిస్తుంది
మూలంః నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com)
    

Post a Comment

Previous Post Next Post