బడిబస కార్యక్రమంలో భాగంగా విద్యార్ధినీ విద్యార్ధుల ఇళ్లను సందర్శించిన మా పాఠశాల బృందం

నిన్న మా పాఠశాలలో మూడవ విడత బడిలో బస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. సూర్యనారాయణ గారితో కలసి మా ఉపాధ్యాయ బృందం రాత్రి 7  గంటలనుంచి పదవ తరగతి విద్యార్ధినీ విద్యార్ధుల ఇళ్లకు వెళ్లి వారి చదువుతున్న తీరును పరిశీలించడం జరిగింది. విద్యార్ధినీ విద్యార్ధుల తల్లిదండ్రులకు, పిల్లల చదువులను గురించిన సూచనలు ఇవ్వడం జరిగింది. మా ప్రధానోపాధ్యాయులు పరీక్షలకు కేవలం 28  రోజులు మాత్రమే ఉన్నందున పిల్లలు చదువుకునేలా చూడాలని, పౌష్టికాహారాన్ని అందించాలని, టివి వంటివి దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా డి, ఈ గ్రేడు పిల్లల ఇళ్లను ప్రధానోపాధ్యాయునితో పాటు అందరు ఉపాధ్యాయులు బృందం కలవగా, ఆపై మిగిలిన విద్యార్ధుల ఇళ్లను ఉపాద్యాయులందరూ బృందాలుగా ఏర్పడి వెళ్లడం జరిగింది. 
తమ పిల్లలపై శ్రద్ద తీసుకుంటున్నందుకు తల్లిదండ్రులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. తమ పిల్లలను ఉదయాన్నే లేపి చదివిస్తామని, వారి ఉన్నత విజయమే తమకూ కావాలని ఆకాంక్షించారు.








నా అంతరంగం (లోప‌లికి తొంగి చూడ‌కండి). . .

Post a Comment

Previous Post Next Post