ఆండ్రాయిడ్‌-కామ్‌కార్డ్‌-విజిటింగ్‌ కార్డును ఫోటో తీయగానే అందులోని వివరాలన్నీ నేరుగా కాంటాక్ట్‌లో సేవ్‌ కావాలా?

ఆండ్రాయిడ్‌-కామ్‌కార్డ్‌-విజిటింగ్‌ కార్డును ఫోటో తీయగానే అందులోని వివరాలన్నీ నేరుగా కాంటాక్ట్‌లో సేవ్‌ కావాలా?
ఈ రోజు మరొక మంచి అప్లికేషన్‌ గురించి మాట్లాడుకుందాం. అదే camcard అప్లికేషన్‌. దీన్ని గూగుల్‌ ప్లేస్టోర్‌నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక, దీని ఓపెన్‌ చేసి మీ ఈమెయిల్‌ ఐడి లేదా మొబైల్‌ నంబర్‌తో సైన్‌అప్‌ కావచ్చు.
ఆ తరువాత కాప్చర్‌కార్డ్‌ పై క్లిక్‌ చేసి విజిటింగ్‌ కార్డును ఫోటో తీయండి. చిత్రంగా మీరు తీసిన ఫోటోను అప్లికేషన్‌ చక్కగా అందంగా మార్చి అందులోని సమాచారాన్ని చదివి, ఫోన్‌ నెంబర్‌లు, ఈమెయిల్‌ ఐడిలు, సంస్థ, వ్యక్తుల పేర్లు చిరునామాను చదివి, కాంటాక్ట్ గా మార్చి చూపుతుంది. ఇక్కడ ఏవైనా చిన్న చిన్న సవరణలు ఉంటే చేసుకోవచ్చు. లేదనుకుంటే సేవ్‌ చేయడంద్వారా విజిటింగ్‌ కార్డులోని నెంబర్‌ను కాంటాక్ట్‌లోకి పంపుకోవచ్చు.

Post a Comment

Previous Post Next Post