పద్మ అవార్డులు 2014

పద్మ అవార్డులు 2014కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాలను జనవరి 25న ప్రకటించింది. వివిధ రంగాల్లో సేవలు చేసిన 127 మందికి ఈ అవార్డులను అందించనున్నారు. ఈ పురస్కారాల్లో రెండు పద్మవిభూషణ్, 24 పద్మ భూషణ్, 101 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. భారతరత్న తర్వాత అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌కు ఎంపికైన వారు.. డాక్టర్ రఘునాథ్ ఎ.మషేల్కర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్-మహారాష్ట్ర), బి.కె.ఎస్. అయ్యంగార్ (యోగా-మహారాష్ట్ర). ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికీ పద్మభూషణ్, ఏడుగురికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. వివరాలు: పద్మభూషణ్- దివంగత అనుమోలు రామకృష్ణ (సైన్స్, ఇంజనీరింగ్), పుల్లెల గోపీచంద్ (క్రీడలు- బ్యాడ్మింటన్). పద్మశ్రీ- మొహ్మద్ అలీ బేగ్ (ఆర్ట్-థియేటర్), డాక్టర్ రామారావు అనుమోలు (సోషల్ వర్క్) డాక్టర్ మలపాక యజ్ఞేశ్వర సత్యనారాయణ ప్రసాద్ (సైన్స్, ఇంజనీరింగ్), డాక్టర్ గోవిందన్ సుందరరాజన్ (సైన్స్, ఇంజనీరింగ్) , రవికుమార్ నర్ర (ట్రేడ్ ఇండస్ట్రీ), డాక్టర్ సరబేశ్వర్ సహార్య (వైద్యం, సర్జరీ), ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ (సాహిత్యం, విద్య). పద్మభూషణ్ అవార్డు లభించిన ఇతర ప్రముఖుల్లో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్, దివంగత న్యాయమూర్తి జె.ఎస్.వర్మ, ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, మహారాష్ట్రకు చెందిన శాస్త్రీయ గాయని బేగం పర్వీన్ సుల్తానా, సాహితీవేత్త రస్కిన్ బాండ్, తమిళ రచయిత వైరముత్తు తదితరులున్నారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్, సీనియర్ నటుడు పరేశ్‌రావల్, క్రికెటర్ యువరాజ్ సింగ్, సినీ రంగానికి చెందిన సంతోష్ శివన్, సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ .. తదితరులను పద్మశ్రీ వరించింది. ప్రవాసాంధ్రుడు డాక్టర్ వంశీ మూట (మెడిసిన్- బయోమెడికల్ రీసెర్చ్)కు ఎన్‌ఆర్‌ఐ విభాగంలో పద్మశ్రీ లభించింది.

from Sakshi 

Post a Comment

Previous Post Next Post