సైకాలజీ - మూర్తిమత్వాన్ని అంచనా వెయడం ఎలా?


మూర్తిమత్వాన్ని అంచనా వెయడం ఎలా?

మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి మూడు రకాల పద్ధతులున్నాయి.
    1) వ్యక్తి ప్రధాన పద్ధతులు
    2) విషయగత పద్ధతులు
    3) ప్రక్షేపక పద్ధతులు
వ్యక్తి ప్రధాన పద్ధతులు:
1. వ్యక్తి చరిత్ర:
 >దీనిని క్లినికల్ పద్ధతి అని కూదా పిలుస్తారు.
> సమస్యాత్మక ప్రవర్తన కలిగిన వ్యక్తుల అనువంశిక, శారీరక, సాంఘిక, సామాజికపరమైన విషయాలను సేకరించి, విశే్లషిస్తారు.
2. పరిపృచ్ఛ:
> ముఖాముఖి సంభాషణ ద్వారా చేసే సమాచార సేకరణ.
> ఇది రెండు రకాలు.
     1. ప్రణాళికాబద్ధమైన పరిపృచ్ఛ: దీనిలో ప్రశ్నలను ముందుగానే రూపొందించుకుంటారు. దీనికే వివృత పరిపృచ్ఛ అని పేరు.
     2. ప్రణాళికా రహితమైన పరిపృచ్ఛ(లేదా)అసంరచిత పరిపృచ్ఛ: దీనిలో ముందుగా ప్రశ్నలను రూపొందించుకోరు.
        సందర్భోచితంగా ప్రశ్నలను అడుగుతారు.
3. స్వీయ చరిత్ర:
> స్వీయ అంటే సొంతమైన.
> ఒక వ్యక్తి తనను గురించి తాను రాసుకునేదే స్వీయచరిత్ర.
> ఒక వ్యక్తికి సంబంధించిన విషయాలను తెలపడానికి అందరికంటే సరైన వ్యక్తి ఆ వ్యక్తే కాబట్టి దీనిని ప్రాథమిక సమాచారంగా స్వీకరించవచ్చు.
4. ప్రశ్నావళి:
> ఇది కూడా ఇంటర్వ్యూ లాంటిదే.
> ఇంటర్వ్యూలో ప్రశ్నలు వౌఖికంగా అడిగితే, ఇందులో లిఖిత పూర్వకమైన ప్రశ్నలుంటాయి. ఇందులో కూడా రెండు రకాలుంటాయి.
     1. నిర్ధారిత ప్రశ్నావళి: ఇందులో సమాధానాలు రాసే వ్యక్తి సూచించిన అవును/కాదు/ చెప్పలేము మొదలైన ఐచ్ఛికాలలో
        దేనినో ఒక దానిని ఎంచుకోవాలి. ఇది ఈనాటి ఎస్‌ఎంఎస్ పోల్ లాంటిది. ప్రయోజ్యునికి సమాధానాలు, సొంత అభిప్రాయాలను      
        సుదీర్ఘంగా, స్వేచ్ఛగారాయడానికివీలుండదు. ఎక్కువగా రాసే ఇబ్బందికూడా ఉండదు. అందువల్లనిర్వహణ సామర్థ్యం ఎక్కువ.
     2. స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి: దీనిలో అడిగిన ప్రశ్నలకు స్వేచ్ఛగా సమాధానాలను రాసే వీలుంటుంది.
విషయగత పద్ధతులు:
> ఒక వ్యక్తిని గురించి అదే వ్యక్తి కాకుండా ఇతర వ్యక్తులు తెలిపే అంశాలతో కూడుకొని ఉన్నవి. ఇతరులు గమనించి, నమోదుచేసే అంశాల ఆధారంగా చేసే అంచనాలు.
1. మూర్తిమత్వ శోధికలు:
> ది బెల్స్ అడ్జెస్ట్‌మెంట్ ఇనె్వంటరీ: దీనిలో గృహ సర్దుబాటు, ఆరోగ్యం, సాంఘిక సర్దుబాటు, భావోద్వేగ సర్దుబాటు, వృత్తిసర్దుబాటు లాంటి అంశాలుంటాయి.
> మినె్నసోటా మల్టిఫేసిక్ పర్సనాలిటీ ఇనె్వంటరీ: ఇందులో 550 అంశాలుంటాయి. వ్యక్తి తనకు వర్తించే విధంగా సత్యం/ అసత్యం/ చెప్పలేను అనే ఐచ్ఛికాలు ఉంటాయి.
2. నిర్ధారణ మాపనులు: ఒక వ్యక్తి ఇతరుల గురించి నిర్ధారణ చేసే అంచనా సాధనాలు ఇవి. ఇందులో మూర్తిమత్వానికి సంబంధించిన లక్షణాలను తెలిపే వాక్యాలు- వాక్యం ఎదురుగా అత్యుత్తమం/ ఉత్తమం లాంటి ప్రవచనాలు ఉంటాయి. వాటిలో సరిపోయే దానిని ఎన్నుకోవాలి.
నిర్ధారణ మాపనులు- పరిమితులు:
నిర్ధరణ మాపనులలో ముఖ్యంగా మూడు రకాల దోషాలుంటాయి. అవి:
1. కేంద్రీయ ప్రవృత్తి దోషం: మాపనం చేసే వ్యక్తి ఎక్కువగా రేటింగ్ స్కేల్‌లోని, మధ్యలో ఉన్న అంశానికి చేయడం జరుగుతుంది. దీనినే కేంద్రీయ ప్రవృత్తి దోషం అంటారు.
2.ఔదార్య దోషం: కొంతమంది అన్ని లక్షణాలకు కూడా అధిక స్థాయిలో గుణాలను ఇస్తారు. అందువల్ల స్కోరింగ్‌లో దోషాలు వస్తాయి. దీనిని ‘ఔదార్య దోషం’ అంటారు.
3.పరివేష ప్రభావం: వ్యక్తిపై అంతకుముందే ఏర్పడి ఉన్న అభిప్రాయాలు కూడా ప్రస్తుత రేటింగ్‌ను ప్రభావితం చేస్తాయి. అలాంటి దోషాన్ని ‘పరివేష ప్రభావం’ అంటారు.
3. శోధన సూచికలు: ఉండవలసిన అంశాలలో ఏయే అంశాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ‘శోధన సూచికలు’ అంటారు.
4. జీవిత చరిత్ర: ఎవరి జీవితాన్ని గురించివారే రాస్తే అది స్వీయచరిత్ర లేదా ఆత్మకథ. అలాకాకుండా ఒకరి జీవితాన్ని గురించి మరొకరు రాసే కథను జీవితచరిత్ర అంటారు.
5. సన్నివేశ పరీక్ష: కొన్ని సన్నివేశాలను కల్పించి, ఆ సన్నివేశాలలో వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో పరిశీలించి, మూర్తిమత్వాన్ని అంచనావేయడం.
6. సంఘటన రచన పద్ధతి: వ్యక్తి జీవితంలోని అనేక సంఘటనలను పరిశీలించి, వాటిని నమోదుచేయడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనావేయడం జరుగుతుంది. వ్యక్తిలో అసాధారణ ప్రవర్తన ఉంటే అందుకు సంబంధించిన కారణాలను తెలుసుకోవడం జరుగుతుంది.
7. సాంఘిక మితి: దీనిని మొదటగా జాకబ్ ఎల్. మొరెనో ఉపయోగించాడు. ఇది ఒక సమూహంలోని ఆకర్షణ, వికర్షణలను, సాంఘిక సంబంధాలను చూపే పద్ధతి. ఇందులో ప్రతి సభ్యుడు మరో సభ్యునికి అనుకూల, వ్యతిరేక వర్ణనలను చేస్తాడు. ఈ ఫలితాలను సోషియోగ్రామ్ ద్వారా వెల్లడిస్తారు.
సభ్యుల మధ్య అనుకూల, వ్యతిరేకతలను సాంఘిక మాత్రిక ద్వారా చూపుతారు. సమూహంలో ఎక్కువమంది ఇష్టపడే వ్యక్తిని ‘తార’ అంటారు. ఎక్కువ మంది వ్యతిరేకతను లేదా తక్కువ అనుకూలతను చూపే వ్యక్తిని ‘ఏకాకి’ అంటారు.
ప్రక్షేపక పద్ధతులు:
> ఇతర పద్ధతులు చేతనలోని అంశాలను పరిశీలించడానికి ఉపయోగపడేవైతే, ప్రక్షేపక పద్ధతులు అచేతనలోని అంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ పద్ధతులలో అస్పష్టమైన ఉద్దీపనలను ఉపయోగిస్తారు. ఉద్దీపన ఎంత అస్పష్టంగా ఉంటే అచేతనంలోని అంశాలు అంత స్పష్టంగా రాబట్టబడే అవకాశం ఉంటుంది.
మీరు టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా? ఇంట్లొనె ఉంటూ కొచింగ్ సెంటర్ లొ మాదిరిగా ప్రణాలికా బద్దంగా చదవాలనుకుంటున్నారా?
మీకొసం నవ చైతన్య కాంపిటీషన్స్ అందిస్తొంది టెట్ డివిజినల్ టెస్ట్ లు. కేవలం రూ.150 కే పొందండి సిలబస్ ను విభజించి ఒక్కొ సుబ్జెక్ట్ పై రూపొందించిన 10 డివిజినల్ టెస్ట్ లు + మొత్తం సిలబస్ పై రూపొందించిన 3 గ్రాండ్ టెస్ట్ లు. సిలబస్ ను రివిజన్ చెసి టెస్ట్ రాసి మీ ప్రిపరేషన్ ను పరీక్షించుకొండి. ఈ మెయిల్ ద్వారా అయితె టెస్ట్ లు కెవలం రూ.100 మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి.
Phone: 9441687174

మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

Post a Comment

Previous Post Next Post