సైకాలజీ - మూర్తిమత్వం - పరిచయం - నిర్వచనాలు


మూర్తిమత్వం - పరిచయం:
> తెలుగులో మూర్తిమత్వం అనే పదానికి సమానార్థాన్ని ఇచ్చే ఆంగ్ల పదం పెర్సనాలిటీ.
> ఈ పదం పురాతన ఫ్రెంచ్ పదం ‘పర్సొనలైట్’, లాటిన్ పదం ‘పర్సొనాలిస్’ అనే పదాల నుండి ఏర్పడింది.
> వ్యక్తి అనే అర్థాన్ని సూచించే ఇంగ్లీష్ పదం పెర్సొన్ ప్రాచీన ఫ్రెంచ్ పదం.
> లాటిన్ భాషలొ పెర్సొన అంటే నాటకాలలో పాత్రధారులు వేసుకునే తొడుగు.
> ప్రతి మనిషీ వివిధ సందర్భాల్లో నాటకంలోని పాత్రధారుల్లా వివిధ రకాల పాత్రలను పోషించడంవల్ల ‘వ్యక్తి ప్రవర్తనల మొత్తానికి’ మూర్తిమత్వం అనే పదం ఏర్పడి ఉంటుంది. అయితే 18వ శతాబ్దంలోనే పెర్సొనలిత్య్ అంటే ‘వ్యక్తి లక్షణాలు’ అనే అర్థం స్థిరపడిపోయింది.
మూర్తిమత్వం- నిర్వచనాలు
> ‘దీర్ఘకాల వాస్తవ పరిశీలనల ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన, క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం’- వాట్సన్.
> ‘వ్యక్తి తన జీవిత కాలంలో అధిక సమయాల్లో వ్యక్తంచేసే తనదైన శైలిలోని ప్రత్యేక ప్రవర్తన తీరును వ్యవస్థీకరించి, నిర్ధారణ చేసేందుకు సహకరించే వ్యక్తిలోని శారీరక, మనస్తత్వ అంశాల, వ్యవస్థల సమూహమే మూర్తిమత్వం’- కింబాల్ యంగ్.
> ‘వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం’ అంటారు- ఐసెంక్.
> ‘మనిషి పరిసరాలలో సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించే ప్రత్యేకమైన, అనువైన, విస్తృతమైన శారీరక, మానసిక రీతులనే మూర్తిమత్వం అంటారు.’- ఆల్‌పోర్ట్.
> ‘మూర్తిమత్వం ఒక సంపూర్ణమైన సమగ్రమైన వ్యవస్థ’- లెవిన్.
> ‘వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటును విశదపరిచే పరిపూర్ణమైన ప్రవర్తనా రీతులనే మూర్తిమత్వం అంటారు.’ - డేషియల్
పైన అన్ని నిర్వచనాలలో ఆల్‌పోర్ట్ నిర్వచనాన్ని సమగ్రమైనదిగా భావిస్తారు. మూర్తిమత్వం వ్యక్తిలోని ఏదో ఒక లక్షణానికి సంబంధించింది కాదు. ఇది అన్ని లక్షణాల సమగ్ర స్వరూపం. అందువల్ల దీనిని అంచనావేయగలమే కానీ- మాపనం చేయలేము. ప్రతి ఒక్కరి మూర్తిమత్వం వంశపారంపర్యం, పరిసరాలు రెండింటిపై ఆధారపడి ఉంటుంది. అభ్యసన, అనుభవాలవల్ల మూర్తిమత్వం రూపొందుతుంది. స్వీయ చేతనత్వం మూర్తిమత్వంలోని ముఖ్య లక్షణం.
> మూర్తిమత్వం సర్వలక్షణ సమ్మేళనం, మనోవిజ్ఞానశాస్త్రంలో మూర్తిమత్వం కంటే ఆసక్తికరమైన అంశం మరొకటి ఉండదు.
మీరు టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా? ఇంట్లొనె ఉంటూ కొచింగ్ సెంటర్ లొ మాదిరిగా ప్రణాలికా బద్దంగా చదవాలనుకుంటున్నారా?
మీకొసం నవ చైతన్య కాంపిటీషన్స్ అందిస్తొంది టెట్ డివిజినల్ టెస్ట్ లు. కేవలం రూ.150 కే పొందండి సిలబస్ ను విభజించి ఒక్కొ సుబ్జెక్ట్ పై రూపొందించిన 10 డివిజినల్ టెస్ట్ లు + మొత్తం సిలబస్ పై రూపొందించిన 3 గ్రాండ్ టెస్ట్ లు. సిలబస్ ను రివిజన్ చెసి టెస్ట్ రాసి మీ ప్రిపరేషన్ ను పరీక్షించుకొండి. ఈ మెయిల్ ద్వారా అయితె టెస్ట్ లు కెవలం రూ.100 మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి.
Phone: 9441687174

మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

Post a Comment

Previous Post Next Post