వైయుక్తిక బేధాలు - ప్రజ్ఞ


వైయుక్తిక బేధాలు - ప్రజ్ఞ
> దైనందిన కార్యక్రమాలను సమర్ధవంతంగా చెయగల సామర్ధ్యమె ప్రజ్ఞ
ప్రజ్ఞ - నిర్వచనాలు:
* ‘‘వ్యక్తి తన చుట్టూ సంక్లిష్ట పరిసరాలలో సర్దుబాటు చేసుకోవడాన్ని వివరించే సామర్థ్యం.’’- స్పెన్సర్
* ‘‘ఇది మనలో ఉండే గ్రహణశక్తి’’- గాల్టన్
* ‘‘గత అనుభవాల సహాయంలో సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకునే సామర్థ్యం’’- మెక్‌డోగల్
* ‘‘అమూర్తంగా ఆలోచించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ’’ - టెర్మన్
* ‘‘అభ్యసించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ’’- డేర్‌బాన్
* ‘‘ప్రయోజనాత్మకంగా పనిచేయగలిగి, సహజంగా ఆలోచించగలిగి, పరిసరాలతో సమర్థవంతంగా వ్యవహరించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ’’- వెస్లర్. ఇది ప్రజ్ఞకు సంబంధించిన సమగ్రమైన నిర్వచనం.
ప్రజ్ఞ లక్షణాలు:
 1. ఇది వ్యక్తి సహజ అంతర్గత శక్తి
 2. ప్రజ్ఞలో వ్యక్తిగత భేదాలుంటాయి
 3. ఇది సమస్య సాధనకు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది
 4. దీనిని అనువంశికత ఎక్కువగా ప్రభావితం చేస్తుంది
 5. నూతన పరిస్థితులను సర్దుబాటు చేసుకునేందుకు ఉపకరిస్తుంది
 6. కౌమార దశవరకు ప్రజ్ఞ వృద్ధి జరిగి, ఆగిపోతుంది
 7. దీనిని మాపనం చేయవచ్చు
 8. జాతి, మత, లింగ భేదాలు దీనికి ఉండవు.
ప్రజ్ఞ, ఇతర అంశాలతో సంబంధం
> జ్ఞానం, సృజనాత్మకత, సమైక్య ఆలోచనలు ప్రజ్ఞగా అనిపించినా, వాటి మధ్య భేదం ఉంది.
> ప్రజ్ఞద్వారా జ్ఞానాన్ని సాధించగలం కానీ జ్ఞానం ద్వారా ప్రజ్ఞను పొందలేము.
> సృజనాత్మకత ఉండే అందరిలో ప్రజ్ఞ ఉంటుందని కానీ ప్రజ్ఞ ఉన్న అందరిలో సృజనాత్మకత ఉందని చెప్పలేము.
> సమైక్య ఆలోచన ఎక్కువగా ఉన్న వారిలో ప్రజ్ఞ ఎక్కువని, విభిన్న ఆలోచన ఉన్న వారికి సృజనాత్మకత ఎక్కువని ‘గిల్‌ఫర్డ్’ పేర్కొన్నాడు.
ప్రజ్ఞ- సిద్ధాంతాలు
ప్రజ్ఞ గురించి వివిధ సిద్ధాంతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
1. ఏక కారక సిద్ధాంతం:
> దీనికే సంప్రదాయక ప్రజ్ఞ సిద్ధాంతమని పేరు.
> బీనె తొలుతగా దీనిని వృద్ధిచేయగా స్టెర్న్, టెర్మన్, ఎబ్బింగ్‌హౌస్‌లు దీనిని బలపరిచారు.
> ఏదో ఒక అంశమే ప్రజ్ఞను ప్రభావితం చేస్తుందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది.
> ఏదో ఒక రంగంలోని ప్రజ్ఞావంతులు మిగతా ఇతర రంగాలలోనూ ప్రజ్ఞావంతులుగా ఉంటారని ఈ సిద్ధాంతం తెలుపుతుంది.
> అయితే ఇది సంభవంకానందున ఈ సిద్ధాంతం ప్రాచుర్యాన్ని కోల్పోయింది.
ఉదాహరణకు గణితం లొ ప్రతిభ చూపే రాము తెలుగు లొనూ ప్రతిభ చూపగలడు

మీరు టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా? ఇంట్లొనె ఉంటూ కొచింగ్ సెంటర్ లొ మాదిరిగా ప్రణాలికా బద్దంగా చదవాలనుకుంటున్నారా?
మీకొసం నవ చైతన్య కాంపిటీషన్స్ అందిస్తొంది టెట్ డివిజినల్ టెస్ట్ లు. కేవలం రూ.150 కే పొందండి సిలబస్ ను విభజించి ఒక్కొ సుబ్జెక్ట్ పై రూపొందించిన 10 డివిజినల్ టెస్ట్ లు + మొత్తం సిలబస్ పై రూపొందించిన 3 గ్రాండ్ టెస్ట్ లు. సిలబస్ ను రివిజన్ చెసి టెస్ట్ రాసి మీ ప్రిపరేషన్ ను పరీక్షించుకొండి. ఈ మెయిల్ ద్వారా అయితె టెస్ట్ లు కెవలం రూ.100 మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి.
Phone: 9441687174


మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

Post a Comment

Previous Post Next Post