టెట్ - సైకాలజీ - స్మృతి


స్మృతి
> నెర్చుకున్న వి్షయాలను తిరిగి గుర్తుకు తెచ్చుకొగల సామర్ధ్యమె స్మృతి
> ఉడ్వర్థ్, స్కొల్బర్గ్ భావనల ప్రకారం అభ్యసించిన దాన్ని తిరిగి చెయగల సామర్ధ్యమమె స్మృతి
> స్మృతి ప్రక్రియ మీద ఎబ్బింగ్ హాస్ 1885 లొ  ప్రయొగాలు చెసెను.
> హాస్ గ్రంధం ఆం మెమొరీ
> ఈయన అర్ద రహిత అక్షరాలు అనె అంశం మీద ప్రయొగాలు చెసెను.
స్మృతి ప్రక్రియలో దశలు:
1. అనుభవాలు/ఉద్దీపనలు మెదడుపై ముద్రితం కావడం 
2. ఇవి నాడీ వ్యవస్థ లో మార్పులు తీసుకురావడం 
3. ప్రవర్తనలో మార్పు రావడం 
స్మృతి ప్రక్రియ లొని అంశాలు:
1. అభ్యసనం
2. ధారణం 
3. పునస్మరణ 
4. గుర్తింపు 
5. పునరభ్యసనం 
స్మృతి - రకాలు:
బట్టీ స్మృతి, తార్కిక స్మృతి: 
> ఒక అంశాన్ని అర్థం చేసుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా వల్లెవేయడం బట్టీ స్మృతి.
> విషయాన్ని అర్థవంతంగా నేర్చుకోవడం తార్కిక స్మృతి.
> తార్కిక స్మృతి ప్రభావవంతమైందే అయినా, కొన్నిసార్లు బట్టీ స్మృతి కూడా ఉపయోగకరంగానే ఉంటుంది
> అయితే బట్టీ స్మృతి ద్వారా నేర్చుకొన్న విషయాలను తార్కికంగా అవగాహన చేసుకొన్నప్పుడే అవి ఉపయోగంలోకి వస్తాయి.
ఉదా: ఎక్కాలు, శ్లోకాలు బట్టీపట్టడం. 
స్వల్పకాలిక స్మృతి- దీర్ఘకాలిక స్మృతి: 
> 20-30 సెకన్లు మాత్రమే గుర్తుండేది స్వల్పకాలిక స్మృతి.
> దీర్ఘకాలం గుర్తుండేది దీర్ఘకాలిక స్మృతి
ఉదా: సినిమాకు వెళ్ళినపుడు సీటు నెంబరు గుర్తు ఉంచుకొవడం స్వల్ప కాలక స్మృతి.
మన ఫొను నెంబరు గుర్తు ఉంచుకొవడం దీర్ఘకాలిక స్మృతి.
నిష్క్రియాత్మక స్మృతి, సక్రియాత్మక స్మృతి
> ప్రయోగ పూర్వకంగా చేసి గుర్తుంచుకోవడం సక్రియాత్మక స్మృతి. 
> సిద్ధాంతాలను, సూత్రాలను ప్రత్యక్షంగా చేయలేని అంశాలను గుర్తుంచుకోవడం నిష్క్రియాత్మక స్మృతి.
విస్మృతి:
> స్మృతికి వ్యతిరేకం విస్మృతి. 
విస్మృతి ఒక వరం, ఒక శాపం. 
> మనం చేసిన ఘోరమైన పొరపాట్లు అనుక్షణం గుర్తుకువస్తే మనకు ఇష్టంలేని వ్యక్తుల ఆలోచనలు నిరంతరం గుర్తులోకి వస్తే మనం పొందిన అనుమానాలు, అవహేళనలూ నిరంతరం గుర్తుకు వస్తే మనకు ఇష్టంలేని సినిమాలోని సంఘటన మళ్ళీమళ్ళీ గుర్తొస్తే ఫలితం జీవితం బాధాకరంగా ఉంటుంది. కనుక విస్మృతి కూడా ఒక్కోసారి వరంగా పరిణమిస్తోంది.
విస్మృతి - కారణాలు
అనుపయోగం వల్ల స్మృతి క్షయం: 
> నిత్యం ఉపయోగించే అంశాలను గుర్తుంచుకుంటాం. ఉపయోగించని అంశాలను మరిచిపోతాం.
ఉదా: ఆరవ తరగతిలో నేర్చుకొన్న జీవుల వర్గీకరణను అటుతర్వాత చాలా తక్కువమందే గుర్తుంచుకుంటారు. అయితే కొన్ని అంశాలు అనుపయోగంగా ఉన్నా వాటిని మరిచిపోలేము.
ఉదా: చిన్నతనంలో నేర్చుకొన్న ఈత, సైకిల్ తొక్కడాలు మొదలైనవి.
అవరోధం:
> ఇతర అంశాలు జోక్యం చేసుకోవడంవల్ల విస్మృతి కలగడం. 
> ఇది రెండు రకాలుగా ఉంటుంది.
1. పురోగమన అవరోధం: 
> గతంలో నేర్చుకొన్న అంశాలు ప్రస్తుతం నేర్చుకున్న అంశాలను గుర్తుకు తెచ్చుకోవడానికి అవరోధం కలిగించడం.
2. తిరోగమన అవరోధం:
> ప్రస్తుతం నేర్చుకొన్న విషయాలు గతంలో నేర్చుకొన్న అంశాలను గుర్తుకు తెచ్చుకోవడానికి అవరోధం కలిగించడం.
దమనం:
> ఇది ప్రయత్నపూర్వకమైన విస్మృతి.
> ఇష్టంలేని, విచారకరమైన విషయాలను ప్రయత్నపూర్వకంగా ‘అచేతనం’లోకి నెట్టివేయడం ద్వారా ఇది జరుగుతుంది. 
> మనోవిశే్లషణ వాదులు స్వేచ్ఛా సంసర్గ ప్రక్రియ ద్వారా దమనం ద్వారా అచేతనలోకి నెట్టబడిన అంశాలను వెలికితీస్తారు. స్వేచ్ఛా సంసర్గంలో వ్యక్తి స్వేచ్ఛగా, పరిమితులు లేకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది.
అపసామాన్య మనోవిస్మృతి: 
> దీనినే అమ్నేసియా అంటారు. 
> ఇది మానసిక, శారీరక అఘాతాలవల్ల సంభవించవచ్చు. 
> ప్యూడ్ అనే అపసామాన్య మనోస్మృతిలో వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా మరిచిపోతాడు.
విస్మృతి- ఎబ్బింగ్ హౌస్ ప్రయోగం:
ఎబ్బింగ్ హౌస్ విస్మృతిపై పరిశోధనలు చేసి, విస్మృతిని వక్రరేఖ ద్వారా సూచించారు. ఈయన ప్రయోగాలవల్ల...
1. మొదటి 50 శాతం నిమిషాలలో 50 శాతం అంశాలను
2. ఒక రోజు తర్వాత 66 శాతం అంశాలను
3. ఆరు రోజుల తర్వాత 75 శాతం అంశాలను
4. 31 రోజుల తర్వాత 80 శాతం అంశాలను మరిచిపోతామని తేలింది. అయితే ఈయన పరిశోధన అర్ధరహిత పదాలకు సంబంధించిందని గుర్తుంచుకోవాలి. అర్థవంతమైన అంశాలకు ఈ మరపు వర్తించదు.
స్మృతిని పెంపొందించే అంశాలు:
> ప్రేరణ: ప్రేరణవల్ల ధారణ పెరుగుతుంది.
> అభిరుచి, అవధానం: అవధానం ఉన్న అంశాలనే జ్ఞానేంద్రియాలను స్మృతిలోకి స్వీకరిస్తాం. అలా స్వీకరించిన అంశాలపై ఆసక్తి ఉంటే వాటిని స్మృతిలో పదిలపరుచుకుంటాం.
> తక్కువ భావోద్రేకం: ఎక్కువ సంతోషంగా గానీ, ఎక్కువ దుఃఖంతో గానీ ఇతర భావోద్వేగాలలో మరీ హెచ్చు తగ్గుతున్నప్పుడు గానీ స్మతి తగ్గుతుంది.
> భావాల సంవర్గం: ఒక దానిలో సంబంధం ఉన్న మరో అంశాన్ని ఒక దానికొకటి జోడించడంవల్ల ఒక విషయం ఎక్కువ కాలం గుర్తుంటుంది. పదాలను పరిచయం చేసేటప్పుడు వాటి వ్యతిరేక పదాలను, సమానార్థకాలను కలిపి బోధిస్తే స్మృతి ఎక్కువగా ఉంటుంది.
> అతి అభ్యసనం: పదే పదే అభ్యసిస్తే అర్థవంతమైన వాటిని కూడా స్మృతిలో ఉంచుకోగలుగుతాం. అంశాలను ఎక్కువకాలం స్మృతిలో ఉంచుతుంది.
> వల్లెవేయడం: వల్లెవేయడం వల్ల స్మృతి పెంపొందకున్నా, వల్లెవేసిన అంశాలు ఎక్కువ కాలం స్మృతిలో ఉంటాయి.
> కొండ గుర్తులు: ఇంద్రధనుస్సును గుర్తుంచుకొనేందుకు నిఱదిక్జ్గూ ను చందస్సులోని గణాలను గుర్తుంచుకోవడానికి ‘యమాతారాజభానస’ను గుర్తుంచుకుంటాం. ఇలా ఒక విషయాన్ని మన ధారణకు అనుకూలంగా మార్చుకుని సంక్షిప్తీకరించుకోవడంవల్ల స్మృతి ఎక్కువ కాలం ఉంటుంది.
డేజావు:
> డేజావు అనేది ఫ్రెంచ్ పదం. 
> దీని అర్థం ‘‘మిథ్యా పరిచయ భావన’’ 
> ఒక అంశాన్ని లేదా విషయాన్ని ఇంతకుముందు చూడకున్నా, వినకున్నా, చూసినట్లుగా విన్నట్లుగా ఉండడమే ‘డేజావూ’
జైగార్నిక్ ప్రభావం:
జైగార్నిక్ జర్మనీ దెశానికి చెందిన మహిళ. 
ఈవిడ భావన ప్రకారం పూర్తిచేసిన పనులకంటే మధ్యలో ఆపివేసిన పనులే ఎక్కువ కాలం గుర్తుంటాయి. దీనినే ‘జైగార్నిక్ ప్రభావం’ 


మీరు టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా? ఇంట్లొనె ఉంటూ కొచింగ్ సెంటర్ లొ మాదిరిగా ప్రణాలికా బద్దంగా చదవాలనుకుంటున్నారా?
మీకొసం నవ చైతన్య కాంపిటీషన్స్ అందిస్తొంది టెట్ డివిజినల్ టెస్ట్ లు. కేవలం రూ.150 కే పొందండి సిలబస్ ను విభజించి ఒక్కొ సుబ్జెక్ట్ పై రూపొందించిన 10 డివిజినల్ టెస్ట్ లు + మొత్తం సిలబస్ పై రూపొందించిన 3 గ్రాండ్ టెస్ట్ లు. సిలబస్ ను రివిజన్ చెసి టెస్ట్ రాసి మీ ప్రిపరేషన్ ను పరీక్షించుకొండి. ఈ మెయిల్ ద్వారా అయితె టెస్ట్ లు కెవలం రూ.100 మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి.
Phone: 9441687174


మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

Post a Comment

Previous Post Next Post