కరెంట్‌అఫైర్స్‌-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన పథకాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన పథకాలు
రాజీవ్ యువకిరణాలు
rajiv-yu talangana patrika telangana culture telangana politics telangana cinema
వచ్చే మూడేళ్ళలో 15 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి, రాజీవ్‌గాంధీ జయంతి సద్భావనా దినోత్సవం సందర్భంగా రాజీవ్ యువకిరణాలు పథకాన్ని ఆగస్టు 20, 2011న విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రాజీవ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారు. ఈ పథకంలో గ్రామీణ, పట్టణ, మురికివాడలు, విద్యా సంస్థల్లో ఉద్యోగావకాశాల కల్పనకు నాలుగు సబ్‌మిషన్‌లను ఏర్పాటు చేశారు. ఎపిపిఎస్సీ, డిఎస్సీ మరియు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డులు, ఉద్యోగ నియామకాలకు నోడల్ ఏజన్సీలుగా పనిచేస్తాయి.

రూపాయికే కిలో బియ్యం
raccha talangana patrika telangana culture telangana politics telangana cinema
రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కిరణ్‌కుమార్‌రెడ్డి రూపాయికే కిలో బియ్యం పథకాన్ని హైదరాబాద్ లోని ఖైరతా బాద్ గణేష్ చౌక్ వద్ద నవంబర్ 1న లాంఛనంగా ప్రారంభించారు.

- కిలో బియ్యాన్ని కె.అనురాధ అనే మహిళకు ముఖ్యమంత్రి పంపిణీ చేశారు.
- ఉన్న 2.25 కోట్ల కుటుంబాలకు ఈ పథకం అమలవుతుంది. తొలి విడతగా రచ్చ బండలో మంజూరు చేసిన 24 లక్షల కూపన్లు పొందిన కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేసారు.
- భద్రతలో భాగంగా ఆకలితో ఎవరూ నిద్రపోరాదనే ఉద్దేశ్యంతో ఈ పథకం అమలు చేయబడుతుంది.
- పథకం కింద రాష్ర్టంలో 7.5 కోట్ల మంది లబ్ధి పొందుతారు. ఏటా రాష్ర్ట ప్రభుత్వం దీనిపై 2,600 కోట్ల రూపాయలను ఖర్చుపెడుతుంది.

ఇందిర జలప్రభ
ఎస్టీలకు చెందిన 10 లక్షల ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఇందిర జల ప్రభ పథకాన్ని ముఖ్యమంత్రి అక్టోబరు 2, 2011న ప్రకాశం జిల్లా, యర్ర గొండపాలెం మండలం జంగాల పల్లి గ్రామంలో ప్రారంభించారు.

పథకం ద్వారా 6 లక్షల కుటుంబాలను పేదరిక రేఖకు ఎగువకు తీసుకురావడానికి ఉద్దేశించారు.
కోట్ల రూపాయల వ్యయంలో ఎస్.సి, ఎస్టీలకు చెందిన 10 లక్షల ఎకరాలను అభివృద్ధి చేయడం ఇందిర జలప్రభ లక్ష్యం.

మినహా అన్ని జిల్లాల్లో ఈ పథకాన్ని అమలుచేయనున్నారు. 95 మండలాలలోని 16,472 గ్రామ పంచాయితీలలో ఈ పథకం అమలు చేయబడుతుంది.

స్వయం సహాయక
గ్రూపులకు వడ్డీలేని రుణం

1, 2012 నుండి స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని ఋణాలను మంజూరు చేయడం ప్రారంభించారు. ఈ పథకం కింద మొత్తం 1,400 కోట్ల రూపాయలను ఖర్చుచేయనున్నారు.

సంవత్సరాలలో వివిధ బ్యాంకుల ద్వారా రూ.10 వేల కోట్లు స్వయం సహాయక సంఘాలకు అందించనున్నారు.

కోట్లతో 1,097 స్త్రీ శక్తి భవనాలను నిర్మించనున్నారు.
పథకం కింద మొత్తం 1.3 కోట్ల మహిళలు లబ్ధి పొందుతారు.

రైతులకు వడ్డీ లేని రుణాలు
రూపాయల వరకు పంట రుణం తీసుకొని సకాలంలో చెల్లించే రైతులకు ‘జీరో వడ్డీ’ పథకం వర్తిస్తుందని ప్రకాశం జిల్లా జంగాల పల్లి గ్రామంలో అక్టోబర్ 2, 2011న ముఖ్యమంత్రి ప్రకటించారు.
రబీ పంటకాలం నుండి ఈ పథకం అమలు చేయబడుతుంది.
పథకం క్రింద 95 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు.
నుండి 3 లక్షల వరకు రుణాలపై పావలా వడ్డీని మాత్రమే వసూలు చేస్తారు.
పథకం కోసం రూ.1000 కోట్లు సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది.

మీ సేవ
పౌరులకు ప్రభుత్వ సేవలు సులభంగా, వేగంగా అందించడానికి, ప్రభుత్వ కార్యాలయాలలో, కార్యకలాపాలలో పారదర్శకతను పెంపొందించడానికి ఉద్దేశించిన ‘మీ సేవ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ.ఎన్.కిరణ్ కుమార్‌రెడ్డి నవంబర్ 4, 2011న తిరుపతిలో ప్రారంభించారు.
పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా చిత్తూరు, కృష్ణా మరియు ఖమ్మం జిల్లాలో ప్రారంభించారు.
పౌరులకు అవసరమైన 12 రకాల సేవలను ‘మీ సేవ’ కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుంది.
కేంద్రాల ద్వారా వివిధ రకాల ధృవపత్రాలను పొందవచ్చు.

రచ్చబండ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ.ఎన్.కిరణ్ కుమార్‌రెడ్డి రచ్చ బండ కార్యక్రమాన్ని 2011 జనవరి 24న శ్రీకాకుళం జిల్లా రాజాంలో ప్రారంభించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం జనవరి 24 నుండి ఫిబ్రవరి 12 వరకు జరిగింది.
రెండవ విడత రచ్చబండ కార్యక్రమాన్ని నవంబర్ 2, 2011న తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో ముఖ్యమంత్రి శ్రీ కిరణ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు.
ఈ రచ్చబండ కార్యక్రమం నవంబర్ 2 నుండి నవంబర్ 24 వరకు 23 జిల్లాల్లో 250 మండలాల్లో నిర్వహించారు.
రెండవ విడత రచ్చబండ కార్యక్రమంలో రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది.

స్త్రీ నిధి
గ్రామీణ ప్రాంత మహిళ లను ఆర్థికంగా వృద్ధిలోకి తేవడానికి మరియు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా వారికి ఆర్థికంగా సహాయం చేయడానికి ప్రభుత్వం స్త్రీ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది.
అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోవడానికి ఈ నిధి నుండి రుణాలను అందిస్తారు.
ఈ పధకం కింద రూ॥ 1500 వేలు ఈ వరకు రుణాలను అందిస్తారు. రుణాలను 24 వాయిదాలలో తిరిగి చెల్లించాలి.
స్త్రీ నిధి పథకం క్రింద ప్రారంభ మూలధనం క్రింద రూ.1000 కోట్లను ప్రభుత్వం అందించింది.
1.3 కోట్ల మంది మహిళలు ఈ పథకం కింద లబ్ధి పొందుతారు.

Post a Comment

Previous Post Next Post