నవచైతన్య కాంపిటీషన్స్ - తెలంగాణ డియస్సీ స్పెషల్

నవచైతన్య కాంపిటీషన్స్ - తెలంగాణ డియస్సీ స్పెషల్

తెలంగాణ డియస్సీ స్పెషల్
మిత్రమా,
            ఇంటర్ తర్వాత డిఎడ్, డిగ్రీ తరువాత బిఎడ్ పూర్తి చేసుకున్న అభ్యర్ధులు వేల కళ్లతో డియస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తుంటారు. పాఠశాల విద్యలో కీలకం అయిన ఈ ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకాలు క్రమంగా అనకపోయినా మిగిలిన నియామకాలకంటే తరచుగానే నోటిఫికేషన్స్ విడుదల అవుతున్నాయి. పోస్టుల సంఖ్య కూడా భారీగా ఉండటంతో అభ్యర్ధులు డియస్సీ కోసం లాంగ్ టర్మ్ గా ప్రిపేర్ కావడం జరుగుతుంది.

            తెలంగాణ రాష్ట్రంలో డియస్సీ నోటిఫికేషన్ విడుదల అయినది. ఇప్పటికే అభ్యర్ధులు ప్రిపరేషన్ ప్రారంభించేశారు. సహజంగా డియస్సీకు సిద్ధం అయ్యే అభ్యర్ధులలో 90 శాతం మంది సీరియస్ గా వారి ప్రిపరేషన్ ను కొనసాగిస్తుంటారు. డియస్సీలో ఉద్యోగం సాధించడానికి ఇదే చివరి అవకాశంగా భావిస్తూ వారి ప్రిపరేషన్ ను కొనసాగిస్తారు. ఈ పోటీని తట్టుకుని డియస్సీలో విజయం సాధించాలంటే అభ్యర్ధులు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఏం చదవాలి, ఏం చదువుతున్నాం, ఇంకా ఏం మిగిలి ఉంది అన్న అంశాలను ప్రతిక్షణం దృష్టిలో ఉంచుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఏదో సామెతలో ‘గుడ్డెద్దు చేలోపడ్డట్టు’ అన్నట్లు ఏదో చదువుతున్నాంలే. ఈ రోజు కంటెంట్ పట్టుకుంటే రేపు తెలుగు రోజూ ఏదో ఒక పుస్తకం చదువుతున్నాం అనడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.

డియస్సీకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులు చేయాల్సింది ఇదే . . .

* ముందుగా మొత్తం సిలబస్ ను అవగాహన చేసుకోవాలి.
* సిలబస్ ను ప్రిపేర్ కావడానికి తగిన పుస్తకాలను సేకరించుకోవాలి.
* సిలబస్ ను 45 రోజులలో పూర్తిగా చదవడానికి అనువైన ప్రణాళికను రూపొందించుకోవాలి.
* అతి గానో, అంత అవసరమా అంటూ తేలికగా చూస్తూనో వదిలేయక క్రింది విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.
    -     తేదీ    -      సబ్జక్టు     -     చదవాల్సిన ఉప అంశం    -
* ఇలా మొత్తం 45 రోజులకు తగిన ప్రణాళికను వేసుకుని ఆపై చదవడానికి ఉపక్రమించాలి.
* ఈ పనిలో మీరు విఫలం అయితే మీ ప్రిపరేషన్ విఫలం అయినట్లే.

త్వరలో మీ కోసం నవచైతన్య కాంపిటీషన్స్ 45 రోజుల ప్రణాళికను ప్రారంభించబోతున్నది

* ప్రతి రోజు, ఆ రోజు చదవాల్సిన సిలబస్ ను ఉదయాన్నే పరిశీలించి, ఆయా పుస్తకాలను సాయంత్రం వరకూ క్షుణ్ణంగా చదవడానికి ప్రయత్నించాలి.
* సాయంత్రం ఆయా సిలబస్ కు సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు పరీక్ష తరహాలో ప్రాక్టీస్ చేస్తూ, ఏ బిట్స్ తప్పుగా గుర్తించామో తెలుసుకుని, ఆయా ఏరియాలను రాత్రికి మరోసారి రివిజన్ చేయాలి. 
* ఈ విధానాన్ని శ్రమ అనుకోకుండా పూర్తి చేసినవారు మాత్రమే విజయం సాధిస్తారు.
* ప్రణాళిక లేనివారికి ప్రిపరేషన్ సరిగా సాగదన్న విషయాన్ని మాత్రం మరువకండి.

తెలంగాణ డియస్సీ కోసం ఏ పుస్తకాలు చదవాలి?

* చాలా మంది అభ్యర్ధులు ఈ ప్రశ్నకు సమాధానం దొరకక ప్రిపరేషన్ వాయిదాలు వేస్తూ పోతారు.
* కేవలం అకాడమీ పాఠ్యపుస్తకాలు మాత్రమే ప్రామాణికం అన్న విషయం మరువరాదు. అదే సందర్భంలో కేవలం అకాడమీ పాఠ్యపుస్తకాలను మాత్రమే చదవడం వల్ల ప్రస్తుత ప్రశ్నా విధానంలో సమాధానాలను గుర్తించడం కష్టం.
* సబ్జక్టుల వారీగా పరిశీలిస్తే
  • జనరల్ నాలెడ్జ్ కోసం మార్కెట్ లో దొరికే ఏవైనా ప్రామాణిక పుస్తకాలు, ఫేమస్ ప్రచురణ సంస్థల పుస్తకాలను తీసుకుంటే సరిపోతంది.
  • కరెంట్ అఫైర్స్ కోసం ఇప్పటి నుంచే ప్రతిరోజూ దినపత్రికను చదవడం, దినపత్రికలోని అంశాలతో నోట్సు సిద్ధం చేసుకోవడంతో పాటు, వివిధ దినపత్రికలు, వారం వారం అందిస్తున్న కరెంట్ అఫైర్స్ స్పెషల్స్, ఏదైనా ఒక ప్రామాణిక పక్షపత్రిక లేదా మాస పత్రికను ప్రిపేర్ అయితే సరిపోతుంది.
  • కరెంట్ అఫైర్స్ ను కేవలం కరెంట్ అఫైర్స్ గా చూడక, ఆయా అంశాలకు సంబంధించిన గత అంశాలు కూడా చదవడం వల్ల జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ పూర్తవుతుంది.
  • విద్యా దృక్పధాలు కోసం ప్రామాణిక పుస్తకాలేవి లేవు. కనుక మార్కెట్ లో దొరికే ప్రముఖ ప్రచురణ సంస్థల పుస్తకాలను సేకరించుకుని చదవడం ఉత్తమం.
  • జనరల్ తెలుగు కోసం 6 నుంచి 10వ తరగతి వరకూ గల పాఠ్యపుస్తకాలు సరిపోతాయి. ఏదైనా ప్రామాణిక పుస్తకాన్ని సేకరించుకుని వ్యాకరణ సంబంధిత అంశాలపై పట్టు సాధించవచ్చు.
  • జనరల్ ఇంగ్లీష్ లో గ్రామర్ పై ప్రత్యేక శ్రద్ద వహించాలి. అంతేకాకుండా సరళమైన వాక్యాలను సంక్లిష్ట రూపాలలో విభిన్న గ్రామర్ నియమాలను ఉపయోగించి ఎలా రాయాలో ప్రాక్టీస్ చేయాలి. ప్రస్తుతం అంతా కాన్వర్జేషన్ రూపంలో, డాటా అనాలసిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతున్నందున, ఆ తరహా ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే ఆంగ్లంపై పట్టు సాధించే అవకాశం ఉంటుంది.
  • గణితము కోసం 6 నుంచి 10వ తరగతి వరకూ గల పాఠ్యపుస్తకాలు సరిపోతాయి. సిలబస్ లో ఇచ్చారని, ఇవ్వలేదని మనకు మనమే అర్ధం చెప్పుకోకుండా, ఏ అంశం వదలక సిద్ధం కావాలి. కొన్ని పదాలు సిలబస్ లో కనిపించకపోయినా, ఆయా అంశాలపై కూడా బిట్స్ వచ్చిన సందర్భాలు కలవు. కనుక పాఠ్యపుస్తకంలోని ఉదాహరణలు, అభ్యాసంలోని ప్రతి లెక్క అధ్యయనం చేయాలి. అవకాశం దొరికితే షార్ట్ కట్ పద్ధతులు గుర్తించి ప్రాక్టీస్ చేయడం ద్వారా సమయపాలనకు ఇది సహకరిస్తుంది.
  • భౌతిక రసాయన శాస్త్రాలు మరియు జీవ శాస్త్రం కోసం 6 నుంచి 10 వ తరగతి వరకూ పాఠ్యపుస్తకాలు సరిపోతాయి. అయితే అనువర్తన తరహా ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నందున ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. పాత ప్రశ్నలను గమనించి, టేబుల్ ఆధారిత ప్రశ్నలు, కార్యాకారణ సంబంధ ప్రశ్నలు, శాస్త్రవేత్తల ప్రయోగాలకు సంబంధించిన ప్రశ్నలు ఇలా ప్రత్యేక విభాగాలను నోట్సుపై ఒక ప్రక్కగా రాసుకుంటూ అధ్యయనం చేయాలి. 
  • సోషల్ స్టడీస్ విభాగానికి కూడా 6 నుంచి 10 తరగతుల పుస్తకాలు సరిపోతాయి. అయితే వీటిలో కొన్ని అంశాలు లోతుగా ఇవ్వబడలేదు. కానీ అభ్యర్ధులు మాత్రం ఆయా అంశాలకు సంబందించి ప్రామాణిక పుస్తకాలను సేకరించుకుని లోతుగా అధ్యయనం చేయడం ఉత్తమం. ఉదాహరణకు భారత రాజ్యాంగం గురించి, భారత ఆర్ధిక వ్యవస్థను గురించి పాఠ్యాంశాలు ప్రాధమిక భావనలకు పరిమితం అయి ఉండవచ్చు. కానీ ఆయా అంశాలకు సంబంధించి అభ్యర్ధులు లోతుగా అధ్యయనం చేయాలి. ప్రస్తుత వర్తమాన అంశాలను ఆధారంగా చేసుకునే ఈ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నందున లోతుగా అధ్యయనం చేయాలి.
  • ప్రస్తుతం ప్రతి పోటీ పరీక్షలోనూ రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రశ్నలు అడుగుతున్నందున తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర పరిణామాలు వంటి అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం కలదు. వీటిని కరెంట్ అఫైర్స్, జనరల్ తెలుగు లోనూ, సోషల్ స్టడీస్ వంటి విభాగాలలో అడిగే అవకాశం కలదు.
* అభ్యర్ధులు ఏ సబ్జక్టు అయినా క్రింది పుస్తకాలను సేకరించుకోవాలి.
  • పాఠ్య పుస్తకాలు
  • అవకాశం ఉంటే ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకము
  • తప్పకుండా ఎక్కువ బిట్స్ ఉన్న మార్కెట్లో దొరికే పుస్తకాలలో ఏవైనా రెండు.
* పాఠ్యపుస్తకాలను చదవడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. ఆ తరువాత అవసరం అయితే రెఫరెన్స్ కోసం ప్రామాణిక పుస్తకం చదవాలి. సాయంత్రం సమయంలో ఆయా పాఠ్యాంశానికి సంబంధించిన బిట్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేసి ఎక్కడెక్కడ లోపాలు వచ్చాయో గుర్తించుకొని మరోసారి రివిజన్ చేయాలి.
* మార్కెట్ లో దొరికే పుస్తకాలను కొనుగోలు చేసే సమయంలో ఎక్కువ రోజుల నుంచి ఈ పబ్లికేషన్ వ్యవస్థలో ఉన్న పుస్తకాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడప్పుడు వచ్చిపోయే పబ్లికేషన్స్ పుస్తకాలలో తప్పులు దొర్లే అవకాశాలు ఎక్కువ
* ఎక్కువ ప్రాక్టీస్ ప్రశ్నలు, అదీ ప్రస్తుత తరహా ప్రశ్నల తీరు కలవి ఉన్న పుస్తకాలను ప్రముఖంగా ఎంచుకోవాలి.
* ఇప్పటికే కొనుగోలు చేసిన మిత్రుల సూచనలను బట్టి పుస్తకాలను ఎంచుకోవచ్చు.
* స్టడీ మెటీరియల్స్ కోసం ఇంటర్ నెట్ లో వెతకవద్దు. పూర్తి స్టడీ మెటీరియల్స్ ను వెబ్ సైట్ లో ఉంచే వ్యవస్థ, ప్రామాణిక సమాచారాన్ని మీకోసం అందించే వ్యవస్థలేవీ ఇంటర్ నెట్ లో ప్రస్తుతం లేవు. కనుక ఏదో వెతికే ప్రయత్నం మొదలుపెడితే ఒక గంటో రెండు గంటలో వెతికిన తరువాత మీరు కోరిన మెటీరియల్ సరిగా నెట్ లో లేదని తెలుస్తుంది.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోండి

* డియస్సీ కు సంబంధించిన వివరాల కోసం కేవలం వార్తా ఛానల్స్, దినపత్రికలను మాత్రమే చూడండి. ఈ మధ్య ఫేక్ వెబ్ సైట్ లు చాలా వరకూ పుట్టుకొచ్చి డియస్సీ నోటిఫికేషన్ పేరుతో చాలా రకాలుగా మిమ్మల్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే వీటిలో ప్రామాణికత ఎంత వరకూ అన్నది ఎవరికి తెలియదు. ఊహాగానాలు, వదంతులు నమ్ముతూ ఒక రోజు ముందుకు నాలుగు రోజులు వెనుకకు అన్నట్లుగా ప్రిపరేషన్ కొనసాగిస్తే మీరు వెనుకబడడం, మిమ్మల్ని పది మంది దాటుకు పోవడం మినహా మీకు ఎటువంటి ప్రయోజనం నెరవేరదు.

డియస్సీ విషయమై మరేదైనా సలహాలు సూచనలు కావాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు.
పాఠశాల సమయాలలో కాకుండా ఇతర సమయాలలో ఫోన్ లో సంప్రదించగలరు.
మీ
చైతన్య కుమార్ సత్యవాడ
చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా, ఫోన్ 9441687174



డియస్సీ స్పెషల్స్ . . .

Post a Comment

Previous Post Next Post