డైలీ కరెంట్ అపైర్స్ టెస్ట్ - 2

1. ఇటీవల కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, చంపారన్ లో వందేళ్ల క్రిందట చేపట్టిన సత్యాగ్రహానికి సంబంధించి, గతంలో డి.జి.టెండూల్కర్ రచించిన రచనలను పునరావిష్కరించారు. అయితే ఆయా పుస్తకాలను, అవి ప్రచురితమైన సంవత్సరాలను జతచేయండి.
ఎ. గాంధీ ఇన్ చంపారన్ 1. 1976
బి. గాంధీ జీవిత చరిత్ర 2. 1957
సి. రోమైన్ రోలాండ్ & గాంధీస్ కరస్పాండెన్స్ 3. 1951
ఎ బి సి
1. 1 2 3
2. 2 1 3
3. 2 3 1
4. 3 1 2
2. ఇటీవల మరణించిన కిశోరి అమోంకర్ గురించిన సరైన వాక్యాలను ఎంచుకోండి.
ఎ. ఈవిడ ప్రముఖ హిందుస్తానీ సంగీత విధ్వాంసురాలు
బి. 1997 లో పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.
సి. 2002 లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.
సరైన సమాధానం ఎంచుకోండి.
1. ఎ, బి సరైనవి 2. ఎ, సి సరైనవి
3. బి, సి సరైనవి 4. ఎ, బి, సి మూడు సరైనవే
3. ఇటీవల విశాఖ తీరంలో మ్యూజియంగా తీర్చిదిద్దడానికి నిర్ణయించిన టీయూ-142 గురించిన సరైన వాక్యం కానిది ఎంచుకోండి.
1.ఇది ప్రపంచంలోనే అతిపెద్దదైన యుద్ధ విమానము
2.గంటకు 925 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు
3.ఇది 6,500 కిలోమీటర్ల దూరంలో శత్రు నౌకలను, సబ్ మెరైన్లను గుర్తిస్తుంది.
4.ఈ విమానం బరువు 90 వేల కిలోలు కాగా, 1.85 లక్షల కిలోలను తీసుకెళ్తుంది.
4. ఇద్దరు పిల్లలు కన్నా ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులని పేర్కొనే జనాభా విధానం ముసాయిదాను 2017, ఏప్రియల్ 9 న ప్రకటించిన ప్రభుత్వం
1.అస్సోం ప్రభుత్వం 2.ఒడిశా ప్రభుత్వం
3.జార్ఖండ్ ప్రభుత్వం 4.కేరళ ప్రభుత్వం
5. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘లక్కీ గ్రాహక్ యోజన’ క్రింద 2017 ఏప్రియల్ 14 న కోటి రూపాయల నగదును గెలుచుకున్నవారు
1.హార్ధిక్ కుమార్ 2.భరత్ సింగ్
3.శ్రద్ధా మోహన్ మెంగ్ షెట్టీ 4.షేక్ రఫీ
గ్రూప్ – 2 ప్రశ్నాపత్రాల శ్రేణి నిర్వహించబడుతున్నది. 3900 బిట్స్ తో కూడిన ఈ ప్రశ్నాపత్రాల శ్రేణి వివరాల కోసం Group-2 Mains Practice Tests Series అని
తెలంగాణ టెట్ (పేపర్ – 1) 16 ప్రశ్నాపత్రాల శ్రేణి నిర్వహించబడుతున్నది. 1900 బిట్స్ తో కూడిన ఈ ప్రశ్నాపత్రాల శ్రేణి వివరాల కోసం Telangana TET
Paper-1 అని
9441687174 నెంబరుకు సందేశం పంపండి.
సమాధానాలు రేపటి ఉదయం నవచైతన్య కాంపిటీషన్స్ వెబ్ సైట్ లో ప్రచురించబడతాయి.
వీక్షించండి.
నవచైతన్య కాంపిటీషన్స్
jobs.navachaitanya.net

Post a Comment

Previous Post Next Post