LATEST JOBS . . . India Post Payment Bank - 1737 Posts Recruitment Tests - Syllabus Analysis

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు - 1737 ఉద్యోగాల భ‌ర్తీ - ఎలా ప్రిపేర్ కావాలి?
- మొత్తం మూడుర‌కాల పోస్టుల భ‌ర్తీ ఈ నోటిఫికేష‌న్ ద్వారా జ‌రుగ‌నున్న‌ది.
- మొత్తం 650 ఖాళీలు ఉన్న‌ స్కేల్‌-1 పోస్టుల భ‌ర్తీ ఆన్‌లైన్ రాత ప‌రీక్ష మ‌రియు మౌఖిక ప‌రీక్ష‌ల ద్వారా జ‌రుగ‌నున్న‌ది.
- 652 ఖాళీలు గ‌ల స్కేల్‌-2, 480 ఖాళీలు గ‌ల స్కేల్‌-3 ఆఫీస‌ర్ల భ‌ర్తీ కోసం గ్రూప్ డిస్క‌ష‌న్ మ‌రియు ఇంట‌ర్వ్యూలు జ‌రుగ‌నున్నాయి.
ప్ర‌ధానంగా స్కేల్‌-1 ప‌రీక్ష‌కు పోటీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉన్న‌ది.
- స్కేల్ - 1 రాత ప‌రీక్ష రెండు అంచెలుగా జ‌రుగ‌నున్న‌ది.
1. ప్రాధ‌మిక‌ ప‌రీక్ష‌
2. ప్ర‌ధాన ప‌రీక్ష‌
ప్రాధ‌మిక ప‌రీక్ష‌
- ప్రిలిమిన‌రీ ప‌రీక్ష 100 మార్కుల ఆన్‌లైన్ ప‌రీక్ష‌.
- మొత్తం 100 ప్ర‌శ్న‌ల‌కు ఒక గంట‌లో అభ్య‌ర్ధులు స‌మాధానాల‌ను గుర్తించ‌వ‌ల‌సి ఉంటుంది.
- దీనిలో
1. రీజ‌నింగ్ విభాగం నుంచి 35 ప్ర‌శ్న‌లు
2. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 ప్ర‌శ్న‌లు
3. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్ర‌శ్న‌లు అడుగ‌నున్నారు.
మెయిన్ ప‌రీక్ష‌
- మొత్తం ఐదు విభాగాల‌తో కూడిన ఈ ప‌రీక్ష‌లో మొత్తం 200 ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను 140 నిమిషాల‌లో గుర్తించాల్సి ఉంటుంది.
- దీనిలో
1. రీజ‌నింగ్ విభాగం నుంచి 50 ప్ర‌శ్న‌లు
2. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 50 ప్ర‌శ్న‌లు
3. జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ విభాగం నుండి 40 ప్ర‌శ్న‌లు
4. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 40 ప్ర‌శ్న‌లు
5. కంప్యూట‌ర్ నాలెడ్జ్ నుండి 20 ప్ర‌శ్న‌లు అడ‌గ‌నున్నారు.
సిల‌బ‌స్ విశ్లేష‌ణ‌
1. రీజ‌నింగ్ విభాగం
- అక్ష‌ర‌, సంఖ్యా శ్రేణులు, కోడింగ్ డీ కోడింగ్‌, మాథ‌మెటిక‌ల్ ఆప‌రేష‌న్స్‌, ర‌క్త‌సంబంధాలు, సిట్టింగ్ అరేంజ్‌మెంట్‌, దిక్కులు, స‌మ‌య‌స్పూర్తి ఆధారిత ప్ర‌శ్న‌లు ఇత‌ర ప్ర‌శ్న‌లు ప్ర‌ధానంగా అడిగే అవ‌కాశం క‌ల‌దు.
2. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం
స‌హ‌జంగా అరిథ్‌మెటిక్స్‌గా వ్య‌వ‌హ‌రించే ఈ విభాగం నుంచి ప్రాధ‌మిక సంఖ్యా భావ‌న‌లు, సూక్ష్మీక‌ర‌ణ‌లు, భిన్నాలు, శాత‌ములు, నిష్ప‌త్తి అనుపాతం, స‌గ‌టు, లాభ‌న‌ష్టాలు, వ‌డ్డీలెక్క‌లు, కాలం దూరం, కాలం ప‌ని, ప్ర‌యాణ వేగాలు, రైళ్లు, పడ‌వ‌లు ప్ర‌వాహాలు, పైపులు తొట్టెలు క్షేత్ర‌గ‌ణిత ప్రాధ‌మిక అంశాల‌పై ప్ర‌శ్న‌లు అడిగే అవ‌కాశం ఉంటుంది.
3. జ‌న‌ర‌ల్ ఇంగ్లీష్ విభాగం
ఆంగ్ల‌భాష వ్యాక‌ర‌ణంలోని ప్రాధ‌మిక విభాగాల‌నుంచి, సిన‌నిమ్స్‌, ఆంట‌నిమ్స్‌, దోషాల‌ను గుర్తించుట‌, స్పెలింగ్‌లు దోషాలు, వెర్బ్‌, పార్ట్ ఆఫ్ స్పీచ్ , రీడింగ్ కాంప్ర‌హెన్ష‌న్ వంటి విభాగాల నుంచి ప్ర‌శ్న‌లు అడిగే అవ‌కాశం ఉంది.
4. జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ విభాగం
బ్యాంకింగ్ రంగ‌ము, వాణిజ్య రంగ‌ము, ఆర్ధిక సంబందిత అంశాల ప్ర‌ధాన నేప‌థ్యంతో ఈ విభాగంతో ప్ర‌శ్న‌లు అడిగే అవ‌కాశం క‌ల‌దు. వీటితో పాటు సాధార‌ణ జ‌న‌ర‌ల్ నాలడ్జ్ సంబంధిత అంశాలు అడిగే అవ‌కాశం కూడా క‌ల‌దు.
5. కంప్యూట‌ర్ నాలెడ్జ్ విభాగం
కంప్యూట‌ర్ ప్రాధ‌మిక భావ‌న‌లు, కంప్యూట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌, ప‌రిణామ క్ర‌మం, ఎం ఎస్ ఆఫీస్‌లోని ప్రాధ‌మిక భావ‌న‌లు, కంప్యూట‌ర్ రంగంలో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు, స‌మ‌స్య‌లు ప్రాధాన్య‌త‌తో ప్ర‌శ్న‌లు అడిగే అవ‌కాశం ఉంది.

ప్ర‌ణాళికా బ‌ద్ద‌మైన ప్రిప‌రేష‌న్‌, క‌ష్టించే చ‌దివేత‌త్వం అభ్య‌ర్ధుల‌ను ముందువ‌రుస‌లో నిల‌బెట్టి విజ‌యానికి చేరువ చేస్తుంద‌ని దృష్టిలో ఉంచుకుని చ‌ద‌వ‌డం ద్వారా చ‌క్క‌ని ఉద్యోగాన్ని సాధించ‌వ‌చ్చు.


మ‌రిన్ని వివ‌రాల‌కోసం,
చ‌క్క‌ని స్ట‌డీ మెటీరియ‌ల్స్ కోసం వీక్షించండి
న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ వెబ్‌సైట్‌
www.navachaitanya.info


How to Prepare For other Competitive exams . . .

Post a Comment

Previous Post Next Post