Best Science Website - www.scientificstudents.com

ఈ రోజు మీకు ఒక మంచి వెబ్‌సైట్‌ను ప‌రిచ‌యం చేయాల‌నుకుంటున్నాను.
అదే సైంటిఫిక్ స్టూడెంట్స్ వెబ్‌సైట్‌
http://scientificstudents.com/

                ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా. వ‌శివేద‌ల అనే చిన్న గ్రామానికి చెందిన శ్రీ శ్రీ‌నివాస్ గారు ఈ వెబ్‌సైట్‌ను రూపొందించి నిర్వ‌హిస్తున్నారు. విద్యార్ధుల‌లో సైంటిఫిక్ టెంప‌ర్‌ను అభివృద్ధి చేయాల‌న్న ప్ర‌ధాన ల‌క్ష్యంతో ఏర్పాటైన ఈ వెబ్‌సైట్‌, అనుబంధ సంస్థ‌లు ఎన్నో వినూత్న రూపాల‌లో, వినూత్న విధానాల‌లో విద్యార్ధుల‌కు చేరువ అవుతూ విద్యార్ధుల‌లో శాస్త్రీయ దృక్ప‌ధాన్ని క‌లుగ‌చేస్తున్న‌ది.
                 సైంటిఫిక్స్ స్టూడెంట్స్ - శ్రీ‌నివాస్‌గా ప‌రిచ‌య‌స్తులైన వీరు దేశ‌వ్యాప్తంగా జ‌రిగిన వేల సైన్స్ ఫెయిర్‌ల‌ను సంద‌ర్శించి అక్క‌డ క‌నిపించే వినూత్న‌మైన సైన్స్ మోడ‌ల్స్‌ను, ఆయా మోడ‌ల్స్ను రూపొందించిన విద్యార్ధుల వ్యాఖ్యానాల‌ను కెమెరాలో బంధించి వెబ్‌సైట్‌లో ఉంచుతున్నారు. కాశ్మీరు నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కూ సైన్స్ ఫెయిర్ ఎక్క‌డ జ‌రిగినా శ్రీ‌నివాస్‌గారు అక్క‌డ క‌నిపిస్తారు. ఓపిక‌గా అన్ని ప్రద‌ర్శ‌న‌లు వీక్షిస్తారు. ఉత్త‌మ‌మైన ప్ర‌తి ప్ర‌ద‌ర్శ‌న‌ను వీడియో చిత్రిక‌రించి వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
                 అబ్దుల్ క‌లామ్ ఇత‌ర ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త‌ల స్పూర్తితో రూపుదిద్దుకున్న ఈ వెబ్‌సైట్‌లో ఎన్నో విభాగాలు తీర్చిదిద్ద‌బ‌డ్డాయి. విభాగాల వారీగా ప‌రిశీలిస్తే ప్రాముఖ్య‌మైన‌వి. . .
1. My Scientific Motivation
2. Science Demonstrations
3. Project making workshops
4. Science fair projects
5. Young Scientist Programme

                   మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏమంటే ఈయ‌న ఒక సంచార ప్ర‌యోగ‌శాల‌ను ఏర్పాటు చేసుకుని, ఆహ్వానించిన ఉపాధ్యాయుల పాఠ‌శాల‌ల‌కు వెళుతూ అక్క‌డి పిల్ల‌ల‌కు శాస్త్రీయంగా ఎలా ఆలోచించాలి? చ‌క్క‌ని ప్ర‌యోగాల నిల‌యంగా పాఠ‌శాల‌ను ఎలా రూపుదిద్దాలి?  తేలిక‌పాటి వ‌స్తువుల‌తోనే ప్ర‌యోగాల‌ను ఎలా చేయాలి చ‌క్క‌గా వివ‌రిస్తూ విద్యార్ధుల‌కు చ‌క్క‌ని ప్ర‌యోగాల‌ను ప్ర‌ద‌ర్శించి చూప‌డంతో పాటుగా సైన్స్ ఉపాధ్యాయుల‌కు మార్గ‌ద‌ర్శ‌క‌త్వాన్ని అందిస్తున్నారు. మీరూ స‌మీప ప్రాంతంలో ఉంటే ఆయ‌న‌ను సంప్ర‌దించి, మీ పాఠ‌శాల‌కు వారిని ఆహ్వానించండి.
                   సైన్స్ ఫెయిర్‌ల‌లో ఎటువంటి ప్ర‌ద‌ర్శ‌న‌లు ఉంచాలి, సైన్స్ ప్రాజెక్టుల‌ను ఎలా నిర్వ‌హించాలి?  ప్రాజెక్టుల‌ను ఎలా రూపొందించాలి వంటి విష‌యాల‌తో పాటు ఎన్నో వినూత్న ఆలోచ‌న‌ల‌కు వేదిక అయిన‌
సైంటిఫిక్ స్టూడెంట్స్ వెబ్‌సైట్‌ను మీరూ ఒక‌సారి వీక్షించండి.
www.scientificstudents.com/
శ్రీ‌నివాస్ గారి ఫోన్ నెంబ‌రు  961 806 1947
ఈమెయిల్ చిరునామా schoolseminars@gmail.com
ఫేస్ బుక్ పేజి https://www.facebook.com/scientificstudents.sgs

BEST WEBSITES . . .

Post a Comment

Previous Post Next Post