సరదాగా . . .
సిసిఈ విధానాన్నిని బాగా వంట పట్టించుకున్న టీచరమ్మలు ఇంట్లో అడిగే ప్రశ్నలు సామర్ధ్యాలవారీగా . . .
విషయావగాహన :
1. పల్లీ పచ్చడి కి కొబ్బరి పచ్చడి కి తేడా ని మీరు గమనించారా? ఈ రెండిటిలో ఇడ్లి కి కాంబినేషన్ గ ఏది బావుంటుంది?
2. డబ్బాలో ఉంచిన పాలకోవాబిళ్ళలు కనిపించుటలేదు. మీరు తినేసి ఉంటె వాటి రుచిని విశ్లేషించండి ?
3. ఈ నెల నా ఎటిఎం కార్డు తో మీరు డ్రా చేసిన అమౌంట్ ఎలా ఖర్చు పెట్టారో పట్టిక లో చూపించండి .
చదివి అర్ధం చేసుకుని వ్యాఖ్యానించడం :
1. ఈ రోజు పేపర్లో బంగారం రేటు తగ్గినట్లు చదివారు కదా.ఈ నెలలో అయినా నాకు చంద్రహారాలు కొంటున్నారా లేదా? దీనిపై వెంటనే స్పందించండి .
2. రోజూ ఒలింపిక్స్ రివ్యూ చదువుతున్నారు కదా. ఇన్ని సంవత్సరాలుగా మీరు విసురుతున్న పళ్ళాలు గ్లాసులు అలవోకగా పట్టుకుంటున్న నేను ఆడగల గేమ్ ఏదైనా గమనించారా? గమనిస్తే వివరించండి .
సమాచార నైపుణ్యములు
1. మీ ఆఫీస్ లో ఆ లేడీ క్లర్క్ కి ఇంకా పెళ్లయిందా లేదా ?
2. రోజు గోకవరం బస్సు కోసమే వెయిట్ చేస్తారట ఆ బస్సు లో లేడీ కండక్టర్ గానీ ఉంటుందా ?
సమకాలీన అంశాలపై ప్రతిస్పందన :
1. మీ చెల్లెలు ఎఎవరోబంధువుల పెళ్ళికి వచ్చి వారం రోజులు మనింట్లోనే ఉంటుందిట .ఆ పిల్ల రాక్షస మూక ని నేను కాయలేను .దీనిపై మీ స్పందన ఏంటి ?
2. కొత్త వాషింగ్ మిషన్ అర్జెంటు గా కొనక పోతే మాసిన బట్టలే తొడుక్కోండి .ఇది ఛాయస్ లేని ప్రశ్న .తప్పక స్పందించి తీరాలి .
పట నైపుణ్యములు :
1. మొన్న కొన్న ఉప్పాడ చీర మీద డిజైన్ ఆంధ్రప్రదేశ్ వలే ఉన్నదా లేక ఇండియా వలే ఉన్నదా ?
2. మన రాష్ట్రము లో ఏఏ ప్రాంతాలు నేత మరియు పట్టు చీరలకి ప్రసిద్ధి ? ఆంధ్రప్రదేశ్ పటములో ఆ ప్రాంతాలను గుర్తించండి.
ప్రశంస :
1. పక్కింటావిడ గుతోంకాయ కూర పరమ దరిద్రం గా వండుతుంది .దానిని ప్రశంసించడానికి ప్రయత్నించండి .
2. బంగారం షాప్ ఓనర్ మన మీద చూపేది నిజమైన సేవాభావమేనా ?
ఇతరులకు సూచన:
- ప్రశ్నలు అడుగుతున్న సమయంలో కనీసం యాభై అడుగుల దూరాన్ని పాటించడం మంచిది .
- ప్రశ్నలు వెర్రిగా అనపించి ఎదుటివ్యక్తి కరవడానికి వస్తే, తప్పించుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
- ప్రశ్నలను విన్న వ్యక్తికి బి.పి. వస్తే వెంటనే తగ్గించడానికి బిపి మాత్రను సిద్ధంగా ఉంచుకోవాలి.
సరదాగా . . .
రూపొందించిన వారు . . . శ్రీమతి వాణీప్రభ, స్కూల్ అసిస్టెంట్ (సాంఘికశాస్త్రం), గొర్రిపూడి, తూర్పు గోదావరి జిల్లా

నా అంతరంగం (లోపలికి తొంగి చూడకండి)
Tags
MYS