9th Class - Physical Science CCE Model Paper - S.A.-1 (EM) BY Sri Gampa Venkata Ramaprasadh Garu

9th Class Physical Science SA-1 Model Paper

Prepared by Sri Gampa Venkata Ramprasadh

శ్రీ గంపా వెంక‌ట రామ‌ప్ర‌సాద్‌గారు రూపొందించిన‌

9వ త‌ర‌గ‌తి భౌతిక ర‌సాయ‌న శాస్త్రాలు - సంగ్ర‌హ‌ణాత్మ‌క మూల్యాంక‌నం - 1 English Medium

 న‌మూనా ప్ర‌శ్నాప‌త్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి.


నూత‌నంగా ప్ర‌వేశ పెట్టిన నిరంత‌ర స‌మ‌గ్ర మూల్యాంకనం (సిసిఈ) విధానంలో, సంగ్ర‌హ‌ణాత్మ‌క మూల్యాంక‌నం ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది. సిసిఈ విధానాన్ని అనుస‌రించి నిర్మాణాత్మ‌క మూల్యాంక‌న‌ము మ‌రియు సంగ్ర‌హ‌ణాత్మ‌క మూల్యాంక‌నంలో విద్యార్ధిలో స‌మ‌గ్ర అవ‌గాహ‌న‌ను ప‌రిశీలించాల్సి ఉంటుంది. నిర్మాణాత్మ‌క మూల్యాంకనం అనేది పూర్తిగా ఉపాధ్యాయ నిర్మిత ప‌రీక్ష‌. దీనిలో ముఖ్యంగా నాలుగు సాధ‌నాల ద్వారా విద్యార్ధిని ప‌రీక్షించ‌డం జ‌రుగుతుంది.
1. విద్యార్ధి ప్ర‌తిస్పంద‌న‌లు - ప్ర‌యోగ‌శాల రికార్డులు
2. రాత అంశాలు
3. ప్రాజెక్టు ప‌నులు
4. ల‌ఘు ప‌రీక్ష‌
కానీ సంగ్ర‌హ‌ణాత్మ‌క మూల్యాంక‌నంలో మాత్రం పూర్తిగా ప్ర‌శ్నా ఆధారిత ప్ర‌శ్నాప‌త్రంను సాధ‌నంగా ఉప‌యోగించుకుని, విద్యార్ధి విద్యాభివృద్ధిని మ‌దింపు చేయాల్సి ఉంటుంది. కనుక‌నే సంగ్ర‌హ‌ణాత్మ‌క మూల్యాంక‌నంలో ప్ర‌శ్న‌ల స‌ర‌ళి కొంచెం క‌ఠినంగా ఉంటుంది. విద్యార్ధి సంపూర్ణ అవ‌గాహ‌ను ప‌రీక్షించే ల‌క్ష్యంగా రూపుదిద్దుకుంటుంది. క‌నుక ప్ర‌తి విద్యార్ధి పాఠ్యాంశాల‌ను సంపూర్ణంగా అవ‌గాహ‌న పెంపొందించుకున్న‌పుడు మాత్ర‌మే సంగ్ర‌హ‌ణాత్మ‌క మూల్యాంక‌నంలో మంచి మార్కులు సాధించే అవ‌కాశం ఉంటుంది.
అందుకే న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ ఇక్క‌డ నిష్ణాతులైన ఉపాధ్యాయుల‌చేత రూపొందించిన‌ ప్ర‌శ్నాప‌త్రాల‌ను అందుబాటులో ఉంచుతున్న‌ది. వీటిని నిశితంగా ప‌రిశీలించి, పాఠ్యాంశాల‌ను ఆరీతిలో చ‌ద‌వడం ద్వారా విద్యార్ధి తేలిక‌గా సంగ్ర‌హ‌ణాత్మ‌క మూల్యాంక‌నాన్ని ఎదుర్కొనే అవ‌కాశం క‌లుగుతుంది.

Click here to download 9th Class Physical Science SA-1 Model paper (English Medium) prepared by Sri Gampa Venkata Ramprasadh garu 

9th Class Physical Science MODEL PAPERS

Post a Comment

Previous Post Next Post