స‌ర‌దాగా . . . ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన TNIT ప‌రీక్ష‌కు స్పంద‌నగా . .

భ‌విష్యత్తులో . . .
జి ఓ నెం - 33 విడుద‌ల . . . అన్ని పాఠ‌శాల‌ల్లో మంచినీటి సౌక‌ర్యం క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికై పాఠ‌శాల‌ల్లో ఎటువంటి మంచినీటి సౌక‌ర్యాలు ఉండాలో తెలుసుకోవ‌డానికి పాఠ‌శాలల్లో ప‌నిచేస్తున్న ఉపాధ్యాయులు అంద‌రికీ ప‌రీక్ష‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. బుధ‌వారం నాడు అమ‌రావ‌తిలో జ‌రిగిన స‌మావేశంలో ఈ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. క్రింది సిల‌బ‌స్ ఆధారంగా ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తామ‌ని విద్యాశాఖాధికారులు వెల్ల‌డించారు.
1. జి.కె. క‌రెంట్ అఫైర్స్ (మంచినీటి గురించి) 50.మార్కులు
2. కెమిస్ట్రీ రిలేటెడ్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఎబౌట్ వాట‌ర్ 50 మార్కులు
3. భార‌త‌దేశంలో న‌దులు, నీటిపారుద‌ల వ్య‌వ‌స్థ 50 మార్క‌లు.
ప్ర‌శ్న‌ల స‌ర‌ళి ఇలా ఉండ‌వ‌చ్చ‌ని విద్యాశాఖాధికారులు సూచించారు.
1. మీ పాఠ‌శాల‌లో మీతో క‌లుపుకుని మీ స‌హ ఉపాధ్యాయులు ఎంద‌రున్నారు?
2. ఎంత‌మంది ఉపాధ్యాయులు మంచినీటిని బాటిల్‌తో తెచ్చుకుంటున్నారు?
3. పిల్ల‌లు తాగే నీరు, ఉపాధ్యాయులు తాగే నీరు ఒక‌టేనా?
4. పిల్ల‌లు తాగే నీరు క‌లుషితం కావ‌డం మీరెప్పుడైనా గ‌మ‌నించారా? ఆ స‌మ‌యంలో మీరూ ఆ నీటిని వారితోపాటు తాగ‌డానికి ప్ర‌య‌త్నిస్తారా?
5. పిల్ల‌ల‌ను కూడా బాటిల్‌తో ఇంటివ‌ద్ద నుండి నీటిని తెచ్చుకోమ‌ని ప్ర‌ధానోపాధ్యాయులు ఎప్పుడైనా వెల్ల‌డించారా?

ఆ త‌రువాత రోజు పత్రిక‌ల‌లో హెడ్‌లైన్స్‌
నిగ్గుతేలిన నిజాలు . . .
- పాఠ‌శాల‌ల్లో 80 శాతం మంది ఉపాధ్యాయుల‌కు మంచినీటికి సంబంధించిన ఫార్ములా తెలియ‌డం లేదు
- పాఠ‌శాల‌ల్లో 81 శాతం మంది ఉపాధ్యాయుల‌కు మంచినీటికి సంబంధించిన క‌నీస ప‌రిఙ్ఞానం లేద‌ని తేలింది.
- పాఠ‌శాలల్లో 85 శాతం మంది ఉపాధ్యాయులు బాటిల్‌తో నీరు తెచ్చుకుంటున్న‌ట్లు వెల్ల‌డైన‌ది.
పాఠ‌శాల‌ల్లో విద్యార్ధుల‌కు మంచినీటి సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌కుండా (ఎవ‌రు క‌ల్పించాలి మిత్రమా?) ఉపాధ్యాయులు అంద‌రూ వాట‌ర్ బాటిల్‌తో నీరు తెచ్చ‌కుంటున్న‌ట్లు, విద్యార్ధుల బాధ‌లు మాకు ప‌ట్ట‌వ‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ఇటీవ‌ల నిర్వ‌హించిన మంచినీటి ప‌థ‌కం ప‌రీక్ష‌లో వెల్ల‌డైన‌ది. ఈ ప‌థ‌కంలో భాగంగా ప్ర‌తి పాఠ‌శాల‌లో మంచినీటి సౌక‌ర్యాన్ని క‌ల్పించడానికి ప్ర‌భుత్వం నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో ఈ నిజాలు తెలియ‌శాయి. అందుకే ప్ర‌స్తుతం పాఠ‌శాల‌ల్లో మంచినీటి సౌక‌ర్యాల క‌ల్ప‌న విష‌యాన్ని పక్క‌న పెట్టి ముందుగా ఉపాధ్యాయుల‌కు అవగాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించింది. జిల్లా కేంద్రాల‌లో సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసి ప‌ది రోజుల పాటు శిక్ష‌ణ ఇవ్వాల‌ని, వారు మురికి గుంట‌లోని నీరు సైతం మేము తాగ‌గ‌లం అంటూ నిన‌దించేదాకా ట్రైనింగ్ నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.


స‌ర‌దాగా . . .

నా అంతరంగం (లోప‌లికి తొంగి చూడ‌కండి). . .

Post a Comment

Previous Post Next Post