GENERAL KNOWLEDGE IN TELUGU: నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్

నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్

-జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ చట్టం - 2005 (ఎన్‌సీపీసీఆర్) జనవరి 2006లో అమల్లోకి వచ్చింది.
-దేశంలో బాలల హక్కుల రక్షణ కమిషన్‌ను 2007 మార్చిలో ఏర్పాటు చేశారు
-ఈ కమిషన్ దేశంలో బాలల హక్కులకు సంబంధించిన చట్టాలు, నిబంధనలు సమర్థవంతంగా అమలు జరిగేలా చూస్తుంది
-బాలల హక్కులను రక్షించడం, వాటిని ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావటం ఈ కమిషన్ ప్రధాన ఉద్దేశం
-భారత రాజ్యాంగం, బాలల హక్కులకు ఐక్యరాజ్యసమితి తీర్మానాలను అనుసరించి దేశంలో రూపొందించే ప్రతి చట్టంలో బాలల హక్కుల కోణాన్ని ఈ కమిషన్ పరిశీలిస్తుంది

-ఈ చట్టాన్ని అనుసరించి రాష్ర్టాల్లో కూడా బాలల హక్కుల కమిషన్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది
-దేశంలో ఇప్పటివరకు అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల బాలల హక్కుల కమిషన్‌లను ఏర్పాటు చేశాయి. నాగాలాండ్ ఈ చట్టాన్ని స్వీకరించింది.
-2010, ఏప్రిల్‌లో అమల్లోకి వచ్చిన నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని సమర్థంగా అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్లకు బాధ్యతలను అప్పగించారు
-2012, నవంబర్ 14న అమల్లోకి వచ్చిన బాలల పై లైంగిక వేధింపుల నిరోధక చట్టం- 2012 (పీవోసీఎస్‌వో) అమల్లో కూడా ఈ కమిషన్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.
Source:
All round GK - Whats app group

General Knowledge in telugu . . .

Post a Comment

Previous Post Next Post