సిసిఈ విధానంలో . . . లోపాలున్నాయా?

సిసిఈ విధానంలో . . .
ఆద‌ర్శ‌వంత‌మైన 40 మంది విద్యార్ధులు గ‌ల ఒక సెక్ష‌న్‌కు
- ప్రాజెక్టు పుస్త‌కాలు దిద్ద‌డానికి స‌గ‌టున పుస్త‌కానికి 1 నిమిషం (ఆద‌ర్శంగా దిద్దాల‌ని చెబుతున్నారు క‌దా) ప‌డుతుంద‌ని భావించినా,  ఒక్క ప్రాజెక్టుకు ప‌ట్టే స‌మ‌యం 40 నిమిషాలు. త‌ప్పుగా రాసిన విద్యార్ధుల‌కు స‌రైన మార్గ‌ద‌ర్శ‌క‌త్వం అందించ‌డానికి, మ‌రోసారి దిద్ద‌డానికి మ‌రొక 30 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. అంటే ఒక్కొక్క ప్రాజెక్టుకు 70 నిమిషాల స‌గ‌టు స‌మ‌యం అవ‌స‌రం.
- పాఠానికి ఒక‌టి వంతున ప్రాజెక్టుల‌ను కేటాయించిన‌, సంవ‌త్స‌రంలో క‌నీసం 10 ప్రాజెక్టులు నిర్వ‌హించాల్సి ఉంటుంది. అన‌ధికారికంగా నాలుగు ఫార్మాటివ్‌ల‌కు నాలుగు ప్రాజెక్టులు స‌రిపోతాయ‌ని పై అధికారులు చెప్పినా దేవుడు వ‌ర‌మిచ్చినా పూజారి వ‌ర‌మివ్వ‌డ‌న్న చందాన‌, క్రింది స్థాయి అధికారులు ఈ అధ్యాయంలో చ‌క్క‌ని ప్రాజెక్టు చేయించొచ్చు క‌దా చేయించ‌లేదే . . .ఏదో మొక్కుబ‌డిగా ఫార్మ‌టివ్‌కు ఇవ్వ‌డ‌మేకాదు. విద్యార్ధుల‌లో ప్రాజెక్టులు నిర్వ‌హించే నైపుణ్యాల‌ను పెంపొందించాలంటూ ఇస్తున్న ఉచిత స‌ల‌హాల‌ను త‌ట్టుకోవ‌డానికి, వారికి కోప‌మొస్తే మాడి మ‌సై పోతామ‌నే భ‌యంతోనో అధ్యాయానికి ఒక‌టి నిర్వ‌హించాల్సిన ప‌రిస్థితినే చాలామంది ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు.
- అలా సంవ‌త్స‌రంలో 10 ప్రాజెక్టుల‌కు కేటాయించాల్సిన స‌మ‌యం 700 నిమిషాలు. అంటే సుమారు 11.6 గంట‌లు.
- ఇక ప్ర‌యోగం నిర్వ‌హింప‌చేయ‌డం త‌ప్ప‌కుండా కావాలి. క‌నుక దీని స‌మ‌యాన్ని నేను లెక్కించాల‌నుకోవ‌డం లేదు. అయితే వారు చెప్పిన విధంగా ప్ర‌యోగ‌శాల రికార్డును నిర్వ‌హింప చేసే సంద‌ర్భంలో, విద్యార్ధులు రాసిన ఒక్కొక్క ప్ర‌యోగాన్ని దిద్ద‌డానికి 1 నిమిషం వంతున‌, 40 మంది విద్యార్ధుల‌కు 40 నిమిషాలు, అద‌నంగా మ‌రొక 30 నిమిషాలు అంటే మొత్తంగా 70 నిమిషాల స‌మ‌యం అవ‌స‌రం
- పాఠ్య‌పుస్త‌కాల‌లో స‌గ‌టున ఇచ్చిన 10 ప్ర‌యోగాల నిర్వ‌హ‌ణ‌కు 700 నిమిషాల స‌మ‌యం అంటే సుమారు 11.6 గంట‌లు అవ‌స‌రం.
- ఇక పుస్త‌కాల‌లో విద్యార్ధులు సొంత‌మాట‌ల‌లో రాసిన స‌మాధానాల‌ను వీక్షించి, వ్య‌క్తిగ‌తంగా ఒక్కొక్క విద్యార్ధికి అందులో ఉన్న లోపాల‌ను గుర్తింప‌చేసి తిరిగి స‌రైన స‌మాధానాలు రాయించ‌డానికి స‌గ‌టున ఒక్కొక్క విద్యార్ధికి క‌నీసం 2 నిమిషాల స‌మ‌యం అవ‌స‌రం. అంటే న‌ల‌భై మందికి 80 నిమిషాలు, మ‌రో 20 నిమిషాల అద‌న‌పు స‌మ‌యం క‌లుపుకుంటే ఒక్కొక్క పాఠ్యాంశానికి 100 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది.
- పాఠ్య‌పుస్త‌కాల‌లో స‌గ‌టున ఉన్న 10 పాఠ్యాంశాల‌కు 1000 నిమిషాల స‌మ‌యం అవ‌స‌రం.అంటే సుమారు 16.6 గంట‌ల స‌మ‌యం.
- ఇక స్లిప్‌టెస్ట్ అనేది గ‌త విధానంలో నిర్వ‌హించిన ప‌రీక్షా విధాన‌మే క‌నుక లెక్క‌లోకి తీసుకోవ‌డం లేదు.
పై విధంగా చూస్తే మొత్తంగా గ‌త మూల్యాంకనా విధానాల‌కు అద‌నంగా, సిసిఈ విధానంలో నూత‌న మూల్యాంక‌న‌కు ఖ‌ర్చు చేస్తున్న స‌మ‌యం 11.6 + 11.6 + 16.6 = 39.8. సుమారు 40 గంట‌లు.
అంటే 40 గంట‌ల స‌మ‌యాన్ని కేవ‌లం సిసిఈ పేరుతో నిర్వ‌హిస్తున్న నిర్మాణాత్మ‌క మూల్యాంక‌నాల‌కే ఖ‌ర్చు చేసేస్తున్నాము.
ఈ మూల్యాంకనం అంతా విద్యార్ధుల స‌మ‌క్షంలో జ‌ర‌గాలి కాబ‌ట్టి బోధ‌నా పిరియ‌డ్‌ల‌ను ప‌క్క‌న బెట్టి మ‌నం ఈ ప‌నులు చేయాలా?
చూద్దాం . .
సంవ‌త్స‌రంలో క‌నీసం 140 బోధ‌నా పిరియ‌డ్‌లు + 20 ప్ర‌యోగ‌శాల పిరియ‌డ్‌లు అంటే మొత్తం 160 పిరియ‌డ్‌లు కేటాయంచ‌బ‌డుతున్నాయి.
ఒక్కొక్క పిరియ‌డ్ 45 నిమిషాల వంతున లెక్క వేస్తే మొత్తం 120 గంట‌ల స‌మ‌యం మనం విద్యార్ధుల‌తో గ‌డ‌పాల్సి ఉంటుంది. లేదా మొత్తం 220 ప‌నిదినాల‌లో స‌మ్మేటివ్ ప‌రీక్ష‌లు జ‌రిగే సుమారు 21 రోజుల‌ను తీసివేయ‌గా మిగిలిన సుమారు 200 రోజుల‌లో 150 గంట‌ల‌పాటు బోధ‌న చేసే అవ‌కాశం ఉంది.
చూశారా మిత్ర‌మా 150 గంట‌ల స‌మ‌యంలో
మ‌నం 110 గంట‌లు మాత్ర‌మే బోధ‌న‌కు కేటాయిస్తున్నాం. దీనిలోనే బేస్‌మెంట్‌లంటూ, పిప్ప‌ర్‌మెంట్‌లంటూ జిల్లా స్థాయి అధికారుల ప‌రీక్ష‌లు, రెడీనెస్ ప్రోగ్రామ్ అదిమానేసి ఇది చెప్పండంటూ జ‌రిగే అద‌న‌పు కార్య‌క్ర‌మాలు ఉండ‌నే ఉన్నాయి. వీట‌న్నిటి ఫ‌లితంగా నిన్నటి వ‌ర‌కూ పాఠాలు చెబుదామంటూ పాఠ‌శాల‌కు ప‌రిమితం అవుతూ, బోధ‌నే త‌న ఏకైక కార్య‌క్ర‌మ‌మంటూ, ధ‌న‌వంతులు ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు పోగా, మిగిలిన పేద‌వారిలో చ‌దివేవారు న‌వోద‌య ప‌రీక్ష‌, గురుకుల ప‌రీక్ష‌, ఇత‌ర పోటీ ప‌రీక్ష‌ల ద్వారా ప్ర‌త్యేక పాఠ‌శాల‌ల‌కు పోగా మిగిలిన పేద‌, స‌గ‌టు విద్యార్ధుల‌లో ఏదో ఒక ర‌త్నం ఉండ‌క‌పోతుందా అనుకుంటూ వెదుకులాడుతూ, విద్యార్ధి సాధించిన విజ‌యాన్నే త‌న విజ‌యంగా భావించిన స‌గ‌టు ఉపాధ్యాయుడు కూడా నేడు పాఠ‌శాల‌కు, బోధ‌న‌కు అయిష్టంగానైనా దూరం కాక త‌ప్ప‌ని ప‌రిస్థితి దాపురించింది.

ఇప్ప‌టికీ క‌ళ్ళు తెర‌వ‌కుండా అంతా బాగానే ఉందంటూ మ‌భ్య‌పె(ప‌)డుతున్నపై అధికారులు
మీరు చేసిన కార్య‌క్ర‌మం మ‌హాద్భుతంమంటూ భ‌జ‌న చేసే భ‌జ‌న బృందాల మాట‌ల‌ను వింటూ, పాఠ‌శాల స్థాయిలో ఆలోచించ‌లేని అధికారులూ
ఈ వ్య‌వ‌స్థ నాశ‌న‌మే మా ల‌క్ష్య‌మంటూ పాలిస్తున్న పాల‌కుల‌కు
మ‌రీ ముఖ్యంగా ఈ వ్య‌వ‌స్థ‌లో బ‌లి అవుతూ
త‌న వ్య‌వ‌స్థ‌కే నాశ‌న‌మ‌య్యే రోజు వ‌స్తోంద‌ని తెలుసుకోలేని అమాయ‌క ఉపాధ్యాయులు, ఏదైతే నాకెందుకులే నేను ఏదో విధంగా బ‌తికేయ‌గ‌ల‌ను, ఇది కాక‌పోతే మ‌రొక డిపార్ట‌మెంట్ నా ఉద్యోగం ఎక్క‌డికీ పోదుక‌దా అంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతూ వ్య‌వ‌హ‌రించే వ్య‌క్తులు క‌ళ్లు తెర‌వ‌కుంటే
రానున్న ఐదు సంవ‌త్స‌రాల‌లో విద్యా వ్య‌వ‌స్థ నాశ‌న‌మైపోతుంది. ఈ ్ర‌ప‌భావం కేవ‌లం విద్యావ్య‌వ‌స్థ‌పైనే కాకుండా ఇత‌ర వ్య‌వ‌స్థ‌ల‌పై కూడా ఉంటుంద‌న్న స‌త్యాన్ని ఇక్క‌డ మ‌రువ‌రాదు.
ఇక‌నైనా . . .
బోధిస్తున్న స‌మ‌యంకంటే ఎక్కువ బోధిస్తే మేలా లేక బోధ‌న ఆపేసి మూల్యాంక‌నం చేసేస్తే మేలా. .  ఈ విధానాల‌ను రూపొందించేవారు ఆమాత్రం ఆలోచించ‌లేరా?

మీ
చైత‌న్య కుమార్ స‌త్య‌వాడ‌

నా అంతరంగం (లోప‌లికి తొంగి చూడ‌కండి). . .

2 Comments

  1. ఈ విధానం పట్ల దాదాపు అందరు ఉపాధ్యాయుల దీ ఇదే అభిప్రాయం. కానీ వ్యక్తపరచ లేక మౌనం వహిస్తున్నట్టు తెలుస్తోంది.

    ReplyDelete
  2. ఈ విధానం పట్ల దాదాపు అందరు ఉపాధ్యాయుల దీ ఇదే అభిప్రాయం. కానీ వ్యక్తపరచ లేక మౌనం వహిస్తున్నట్టు తెలుస్తోంది.

    ReplyDelete
Previous Post Next Post