👏👏ఇస్రో మరో ఘనత:👏👏
పీఎస్ఎల్వీ సీ 29 ప్రయోగం సక్సెస్
శ్రీహరికోట: పోలార్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ 29 ప్రయోగం విజయవంతమైంది. సాయంత్రం 6 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించారు. పీఎస్ఎల్వీ సింగపూర్‌కు చెందిన 6 ఉపగ్రహాలను ఈ శాటిలైట్ నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఏపీలోని శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 59 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నింగిలోకి ఎగిరిన పీఎస్‌ఎల్వీ సీ29 నింగిలోకి ఎగిసింది. సింగపూర్‌కు చెందిన 6 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ సీ-29 నింగిలోకి మెసుకెళ్లింది. ఈ ఆరు ఉపగ్రహాల బరువు 625 కిలోలు. భూపరిశోధనకు గాను సింగపూర్ పంపిన 400 కిలోల బరువు కలిగిన టెలియాస్ ఉపగ్రహంతో పాటు ఐదు చిన్న ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో శాస్త్రవేత్తలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. సింగపూర్ ప్రతినిధులు షార్ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. షార్ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన ప్రయోగాల్లో ఇది 50వ ప్రయోగం కావడం విశేషం. కాగా, పీఎస్ఎల్వీ సిరిస్‌లో ఇది 32వది. ఇస్రో చరిత్రలో ఇది వరుసగా పీఎస్ఎల్వీ 31వ విజయం. ఈ ఏడాది జూన్ 10న పీఎస్‌ఎల్వీ సీ 28 ద్వారా ఐదు విదేశీ ఉపగ్రహాలను, సెప్టెంబర్ 28న పీఎస్‌ఎల్వీ సీ 30 ద్వారా మరో కార్టోశాట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది.
Tags
CA