మిత్రమా,
10వ తరగతి విద్యార్ధులు క్రమం తప్పకుండా సైన్స్‌లోని పటాలను అభ్యాసం చేయడానికి వీలుగా సైన్స్ చిత్రాల కాలెండర్‌ను రూపొందించాను. దీనికై
మీరు
http://bit.ly/XNCPSCAL
లింక్‌ను వీక్షించి ఆపై డౌన్‌లోడ్ అయ్యే చిత్రాలను కలర్ ప్రింట్ తీసుకుని, ఆపై లామినేషన్, స్పైరల్ బైండింగ్ చేయించుకుని మీరూ ఈ కాలెండర్‌ను రూపొందించుకోవచ్చు. తరగతి గదిలో ఈ కాలెండర్‌ను తగిలించి, రోజూ ఒక పేజీ తిరగేయడం, ఆ పటాన్ని విద్యార్ధుల చేత వారి డ్రాయింగ్ పుస్తకాలలో గీయించడం ద్వారా క్రమబద్దమైన అభ్యాసానికి అవకాశం కలుగుతుంది. ఈ కాలెండర్‌ను రూపొందించుకోవడానికి కలర్ ప్రింట్‌ల కోసం రూ. 80, లామినేషన్ కోసం రూ. 80 స్పైరల్ బైండింగ్ ఇతర అవసరాలకు రూ. 40 వంతున దాదాపు రూ. 200 రూపాయిలు ఖర్చు అవుతుంది. కానీ శాశ్వత బోధనోపకరణంగా మనకు ఇది ఉంటుంది. లామినేషన్ వలన విద్యార్ధులు దీన్ని చింపివేసే అవకాశం లేదు. ఈ విషయమై మీ సూచనలను తెలియచేయగలరు.
మీ
చైతన్య కుమార్ సత్యవాడ
చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్