౧. రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శా సంబంధం లేకుండే పనిచేసే బలము ----
ఎ.ఫలితబలము
బి.స్పర్శాబలము
సి.ప్రత్యక్ష బలము
డి.క్షేత్రబలము
జవాబుః క్షేత్ర బలము
౨. భూమిపై నిట్టనిలువుగా ఉంచబడిన ఏ వస్తువు యొక్క అతి తక్కువ పొడవైన నీడైనను (మిట్టమధ్యాహ్నం వేళ ఏర్పడే నేడ) ఎల్లప్పుడూ పడే దిశ ---
ఎ.దక్షిణంతూర్పు
బి.ఉత్తరం తూర్పు
సి.దక్షిణం పడమర
డి.ఉత్తరం పడమర
జవాబుః ??
౩. బంగారము మెరుపును కోల్పోకుండా ఉండడానికి కారణము ---
ఎ.దీనికి మెరుపు కొరకు తక్కువ రాగిని కలుపుట
బి.దీనికి గాలితో చర్యావేగము తక్కువ
సి.ఇది గాలితో చర్య జరుపదు
డి.దీనికి మెరుపు కొరకు ఎక్కువ రాగిని కలుపుట
జవాబుః ఇది గాలితో చర్య జరుపదు
౪. దంతక్షయము ప్రారంభమగుటకు పిహెచ్ విలువ ----
ఎ. 8.5 కంటే ఎక్కువ
బి. 5.5 కంటే తక్కువ
సి. 5.5 కంటే ఎక్కువ
డి. 8.5 కంటే తక్కువ మరియు 5.5 కంటే ఎక్కువ
జవాబుః 5.5 కంటే తక్కువ
౫. గాల్వనీకరణము నందు ఇనుప వస్తువులపై పూత పూయుటకు ఉపయోగించే లోహము ----
ఎ.జింకు
బి.రాగి
సి.అల్యూమినియం
డి.వెండి
జవాబుః జింకు
౬. కారు హెడ్‌లైట్స్‌నందు అమర్చే పుటాకార దర్పణ ఆకారము
ఎ. స్థూపాకారము
బి.వృత్తాకారము
సి.చతురస్రం
డి.పరావలయం
జవాబుః పరావలయం?
౭. ఎటియం కార్డును స్కానర్‌లో స్వైప్ చేయుటలో ఇమిడి ఉన్న సూత్రం
ఎ. ఫెర్మాట్ సూత్రం
బి. ఆర్కిమెడిస్ సూత్రం
సి.బెర్నౌలీ సూత్రం
డి.విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రం
జవాబుః విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రం
౮. బహుల సంయోజకత గల మూలకం
ఎ.నైట్రోజన్
బి.ఫాస్పరస్
సి.మెగ్నీషియం
డి.కార్బన్
జవాబుః ఫాస్పరస్
౯. క్రింద నివ్వబడిన వాక్యాలను చదివి వానిలో ఏ సందర్భంలో పని జరుగలేదో గుర్తించండి
ఎ.కూలీ సామానులను రైలులో పెట్టుట
బి.సిమెంటు బస్తాలను లారీలోనికి ఎత్తుట
సి.అమ్మాయి బొమ్మకారును నేలపై లాగుట
డి.అబ్బాయి ఆటస్థలంలో ఉన్న పెద్ద రాతిబండను నెట్టుటకు ప్రయత్నించుట
జవాబుః అబ్బాయి ఆటస్థలంలో ఉన్న పెద్ద రాతిబండను నెట్టుటకు ప్రయత్నించుట
౧౦. ఎక్కువ జడత్వము గల వాహనము
ఎ.బస్సు
బి.సైకిల్
సి.ఆటో
డి.కారు
జవాబుః బస్సు
Tags
PS