TODAY IN HISTORY BY LOKANADH

చరిత్రలో ఈ రోజు/మే 19
1890: అమెరికా ను గడగడ లాడించిన వియత్నాం నాయకుడు హొ చి మిన్ జననం (మ.1969).
1894 : సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి మరియు సంఘసంస్కర్త గుడిపాటి వెంకట చలం జననం (మ.1979).
1904 : భారత దేశంలో పెట్టుబడిదారుడు, పారిశ్రామికవేత్త, పారిశ్రామిక రంగ పురోగమనంలో ప్రముఖుడు జమ్సేట్జి టాటా మరణం (జ.1839).
1913 : భారత 6 వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జననం. (మ.1996)
1938 : ప్రముఖ రచయిత,నటుడు,సినిమా దర్శకుడు గిరీష్ కర్నాడ్ జననం.
1952 : భరత నాట్యానికి, కర్ణాటక సంగీతమునకు, అంతరించిపోతున్న భారతదేశ కళలకు ఎనలేని సేవ చేసిన బెంగుళూరు నాగరత్నమ్మ మరణం (జ.1878).
1955 : కంప్యూటర్ శాస్త్రవేత్త , జావా అనే కంప్యూటర్ భాషకు తండ్రి లాంటి వాడు అయిన జేమ్స్ గోస్లింగ్ జననం.
1970 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సంపాదకుడు కోలవెన్ను రామకోటీశ్వరరావు మరణం (జ.1894).
1985: కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య మరణం (జ.1913)

    

Post a Comment

Previous Post Next Post