![]() |
CURRENT AFFAIRS PSLV C 26 IRNSS - 1 C |
పిఎస్ఎల్వీ - సి 26 ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-సి1
- పిఎస్‌ఎల్‌వీ సి 26 పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ శ్రేణిలో 28 వది- గత 28 ప్రయోగాలలో ఒకేఒక్కటి విఫలం కావడంతో అత్యంత సురక్షితమైన శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌గా పేర్గాంచింది
- 2014 అక్టోబర్ 16 ఉదయం 1.32 గంటలకు నింగికెగిరింది.
- ఈ ప్రయోగం అక్టోబర్ 10 న జరగాల్సి ఉండగా సాంకేతిక కారణాల వలనవాయిదా పడినది.
- దీనితో ప్రయోగించిన శాటిలైట్ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి
- ఇండియన్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ శ్రేణిలో ఇది మూడవది. మొత్తం 7 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు.
- ఈ శ్రేణిలో గతంలో ఐఆర్‌ఎన్‌ఎస్-1ఎ ను 2013 జూలైలోనూ, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బి ను 2014 ఏప్రియల్‌లోనూ ప్రయోగించారు.
- మిగిలిన నాలుగు ఉపగ్రహాలను 2015 డిసెంబర్‌లోగా ప్రయోగించనున్నారు
- ఉపగ్రహం బరువు 1425.4 కిలోగ్రాములు.
- భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థలోనిది.
- ఇప్పటికే అమెరికా జిపిఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్), రష్యా గ్లోనాస్ (గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్)లు సొంత నావిగేషన్ ఉపగ్రహాలను కలిగి ఉన్నాయి.
- యూరోపియన్ యూనియన్ గెలీలియో పేరుతో, చైనా బెయ్‌డోవ్ పేరుతో, జపాన్ క్వాసీ-జెనిత్ పేరుతో ఈ టెక్నాలజీను రూపొందించుకుంటున్నాయి.
Tags
CA