BUS DEPOT IN CHINTALAPUDI - CHINTALAPUDI NEWS



ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న చింతలపూడి గ్రామ వాసుల కల నిజమయ్యే రోజు త్వరలోనే రాబోతున్నది. విమాన యానం అంటే తెలియదు.    రైలు ప్రయాణానికి చాలా దూరంగా ఉండడం వలన పట్టణంలోని ప్రజలలో కనీసం తొంభై శాతం మంది కనీసం ఒక్కసారైనా రైలులో ప్రయాణించి ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు. . ఇప్పటికీ బస్సు సౌకర్యంసైతం లేని గ్రామాలెన్నో చింతలపూడి చుట్టూ ఉన్నాయి. చింతలపూడినుంచి నేరుగా రాష్ట్ర రాజధాని విజయవాడకు నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడం చింతలపూడి దుస్థితికి నిదర్శనంగా నిలిచింది. అలా అని విజయవాడ ఎక్కడో దూరం అనుకోకండి జస్ట్ వంద కిలోమీటర్ల దూరంలో ఉంది విజయవాడ. అదేదో ఆటలాగా ఒకనెల బస్సు వేస్తారు. ఎక్కడా లేని ఆక్యుపెన్సీ రేషియో ఇక్కడ ఆశించి అది లేదన్న కారణంతో మళ్లీ తీసేస్తారు. నిజానికి దానికి కారణం ఆర్టీసీ వారే. బస్సు సమయాల నిర్ణయం వలననే ఉదాహరణకు చింతలపూడినుంచి అది సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరేది. అదే సమయానికి భద్రాచలంనుంచి వచ్చే ఏలూరు బస్సు చింతలపూడి నుంచి బయలుదేరేది. ఇలా . .
ఎట్టకేలకు చింతలపూడిలో బస్సు డిపో ప్రారంభం కాబోతున్న వార్తను నేటి దినపత్రికలు ప్రచురించాయి. బస్సు డిపో నిర్మాణ స్థల సేకరణ పనులు కూడా ప్రారంభం అయ్యాయి.







Post a Comment

Previous Post Next Post