ఆండ్రాయిడ్-వాయిస్ కాలుక్యులేటర్ నోటి మాటలతో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో లెక్కలు చేయండిలా. . .
ఈ రోజు నా స్మార్ట్ మొబైల్‌లో ఒక అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. చాలా బావుంది. దీని వివరాలను మీకు తెలియచేద్దామనుకున్నాను. ఈ అప్లికేషన్ పేరు VOICE CALCULATOR. గూగుల్ ప్లేస్టోర్‌లో వెతికి, ఈ ఆప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పేరుకు తగ్గట్టుగానే ఇది మాటలను సమీకరణాలుగా మార్చి లెక్కలు చేసే అప్లికేషన్. మీరు ఇంగ్లీషులో ఇచ్చే ఆదేశాలను బట్టి అంకెలను కూడడం, తీసివేయడం, గుణకారం, భాగాహారాలను చేయడం ఈ అప్లికేషన్ చేయగలదు.
ఉదాహరణకు మీరు 'త్రీ ప్లస్ టూ' అనే కమాండ్‌ను ఈ అప్లికేషన్‌ను ఓపెన్‌చేశాక స్పీక్ పై టచ్ చేసి చెప్పినట్లయితే వెంటనే దీని 3+2=5 అని చూపుతుంది. ఇలా చతుర్విద ప్రక్రియలను నోటితో చెబుతూ మీ ఫోన్‌తో చేసుకోవచ్చు
నోటి మాటలతో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో లెక్కలు చేయండిలా. . .