ఉద్యోగావకాశాలు - స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ - లోవర్‌ డివిజినల్‌ క్లర్క్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌

సర్కారీ కొలువుకు సిద్ధమేనా?
రూ.24,000- రూ. 27,000 నెలజీతంతో కేంద్రప్రభుత్వ ఉద్యోగం... పదోన్నతి ద్వారా గెజిటెడ్‌ అధికారి స్థాయికి చేరుకునే అవకాశం... దీనికి వీలు కల్పించే నోటిఫికేషన్‌ను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా కేంద్రప్రభుత్వ శాఖల్లోని డేటా ఎంట్రీ ఆపరేటర్‌, లోవర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు!
సుమారు 2000 గ్రూప్‌- సి పోస్టుల నియామకం జరగబోతుండగా, వీటిలో 1000కి పైగా డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులున్నాయి. అభ్యర్థులకు మొదటగా రాతపరీక్ష నిర్వహిస్తారు. దీనిలో కనీస అర్హత మార్కులు సాధించినవారికి స్కిల్‌టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుకు పోటీపడేవారు స్కిల్‌ టెస్టులో, లోవర్‌ డివిజన్‌ క్లర్క్‌ అభ్యర్థులు టైపింగ్‌ టెస్టులో అర్హత పొందాలి. అలా అర్హులైన అభ్యర్థులకు రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టింగ్‌ ఇస్తారు.
పరీక్షకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 19.8.2014. మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు. పురుషులు రూ. 100 చెల్లించి పరీక్షకు దరఖాస్తు చేయవచ్చు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్లు: http://ssc.online.nic.in ; http://ssconline2.gov.in
వయ: పరిమితి
* జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 2.8.1987 నుంచి 1.8.1996 సంవత్సరాల మధ్యలో పుట్టి ఉండాలి (18 నుంచి 27 సంవత్సరాల వయసు వారు).
* ఓబీసీ అభ్యర్థులు 3 సంవత్సరాలు
* ఎస్‌సీ/ ఎస్‌టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీహెచ్‌ అభ్యర్థులకు 10 సంవత్సరాల మినహాయింపు ఉంది.
విద్యార్హతలు: పదో తరగతితోపాటు ఇంటర్‌/ దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు కింద ఉన్న ఏదైనా పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్ష రాసుకునే సౌకర్యం ఉంది - హైదరాబాద్‌, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం.
పరీక్ష విధానం
200 ప్రశ్నలు ఉండే రాతపరీక్షకు 200 మార్కులు కేటాయించారు. పరీక్షను 2 గంటల సమయంలో పూర్తిచేయాలి. వీహెచ్‌ అభ్యర్థులకు 40 నిమిషాల అదనపు సమయం ఉంటుంది.
నాలుగు విభాగాలు ఉండే పరీక్షలో ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి విభాగంలో కనీస అర్హత మార్కులు సాధించాల్సిన అవసరం లేదు.
రాత పరీక్ష: 2.11.2014 (లేదా) 9.11.2014
రాతపరీక్షలోని విభాగాలు
* జనరల్‌ ఇంటెలిజన్స్‌ - 50 ప్రశ్నలు- 50 మార్కులు
* ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ - 50 ప్రశ్నలు- 50 మార్కులు
* క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ - 50 ప్రశ్నలు- 50 మార్కులు
* జనరల్‌ అవేర్‌నెస్‌ - 50 ప్రశ్నలు- 50 మార్కులు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* దరఖాస్తు పూర్తిచేయడంలో ఏవైనా తప్పులు చేస్తే మళ్లీ మార్పులు చేసుకోలేం. కాబట్టి వివరాలను జాగ్రత్తగా నింపాలి.
* రాతపరీక్షలో రుణాత్మక మార్కులున్నాయి. కాబట్టి తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం గుర్తించాలి.
* 200 ప్రశ్నలను 120 నిమిషాల్లో పూర్తిచేయాలి. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు చేసేలా ఉండాలి.
* తెలియని ప్రశ్నలు, ఎక్కువ సమాచారం ఉన్న ప్రశ్నలను విడిచిపెట్టాలి.
* ఒకసారి ప్రయత్నం చేసినపుడు సమాధానం రాకపోతే ప్రశ్నలు వదిలి వేరే ప్రశ్నను చేయాలే తప్ప అదే ప్రశ్నను మళ్లీ ప్రయత్నించకూడదు.
* ప్రతి విభాగం నుంచి కనీస కటాఫ్‌ మార్కులు లేవు. కాబట్టి తెలిసిన అంశాల నుంచి ఎక్కువ మార్కులు సాధించాలి.
* మొత్తం 200 ప్రశ్నలకూ సమాధానం గుర్తించాలనే ధోరణి విడిచి, ఇచ్చిన సమయంలో తెలిసినవాటికి మాత్రమే జవాబు గుర్తించటం అలవాటు చేసుకోవాలి.
* 200 ప్రశ్నల్లో 140- 150 తెలిసిన ప్రశ్నలకు సమాధానం పెట్టగలిగితే విజయావకాశాలు మెండుగా ఉంటాయి.
మంచి మెటీరియల్‌, పాత మాదిరి ప్రశ్నపత్రాలు సంపాదించి చక్కని ప్రణాళిక రూపొందించుకుని తయారవ్వాలి. ఈ సదవకాశాన్ని జీవితంలో స్థిరపడేలా మలచుకోవాలి.

Post a Comment

Previous Post Next Post