మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులా? అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం (హెల్త్‌కార్డ్‌) గురించి తెలుసుకుని, పొందండి ఇలా. . .

అర్హత:

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధి పధకం గా ఈ పధకం పిలవబడుతుంది.ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనరులకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు నెట్వర్క్ హాస్పిటల్ ద్వారా 'నగదు రహిత' చికిత్స అందించడం ఈ పధకం లక్ష్యం.
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ,రాష్ట్ర పెన్షనరులకు ,వారిపై ఆధారపడిన కుటుంభసభ్యులకు నగదు రహిత చికిత్స అందిస్తుంది. ఈ పధకం క్రింద లబ్దిదారులందరికీ ఎ.పి.ఐ.యమ్.ఎ. నిభందనల క్రింద పొందిన లబ్ది ఇకపై ఆగిపోతుంది.క్రింద పేర్కొన్నవిభాగాల వారు ఈ పధకం లబ్ది దారులు.
పస్దుతం పనిచేస్తున
క్రమబద్దీకరించిన అందరు ప్రభుత్వ ఉద్యోగులు.
స్థానిక సంస్థలోని ప్రోవిషన్ వైజ్ ఉద్యోగులు.
విశ్రాంతి ఉద్యోగులు
అందరు సర్వీసు పెన్షనరులు
అందరు కుటుంబపెన్షను దార్లు(వీరిపై ఆధారపడినవారికీ వర్తించదు)
తిరిగి ఉద్యోగంపొందిన సర్వీసు పెన్షనరులు

కుటుంబం: దిగువపేర్కొన్న వారు కుటుంబ సభ్యులుగా పరిగణించబడతారు.

తల్లిదండ్రులు : (ఉద్యోగిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు లేదా కన్న తల్లిదండ్రులు,ఏదో ఒక తల్లిదండ్రులు మాత్రమే)
చట్టప్రకారం వివాహం చేసుకున్న భార్య మరియు ఆమెఫై ఆధారపడిన ఆమె తల్లిదండ్రులు (పురుష ఉద్యోగుల /సర్వీపు పెన్షనరుల విషయంలో).
భర్త ,అతనిఫై ఆధారపడిన అతని తల్లిదండ్రులు (మహిళా ఉద్యోగుల /సర్వీపు పెన్షనరుల విషయంలో).

పూర్తిగా ఆధారపడిన చట్టబద్దమైన సంతానం (సవతి పిల్లలు,దత్తత పిల్లలతో సహా).

ఆధారపడడం అంటే:  ఆధారపడడం అనే పదానికి దిగువ అర్ధం వర్తిస్తుంది


తల్లిదండ్రుల విషయంలో, వారి పోషణ కోసం ఉద్యోగిపై ఆధారపడినవారు.
నిరుద్యోగ కుమార్తెల విషయంలో , అవివాహితులు ,వైధవ్యం పొందినవారు ,విడాకులు పొందినవారు, భర్తచే వదిలివేయబడినవారు.
నిరుద్యోగ కుమారుల విషయంలో 25 ఏళ్ళలోపు వయస్సు కలిగిన వారు,ఉపాధి లేదా ఉద్యోగం పొందడానికి వీలులేని వైకల్యం కలిగినవారు.

ఎన్రోల్మెంట్:

బీమా సౌకర్యం పొందిన ఎన్రోల్మెంట్ కు ఒక యూనిట్ గా పరిగణించబడతారు .భార్య, భర్తలు ఇద్దరూ ఉద్యోగులు లేదా సర్వీసు పెన్షనర్లు అయిన సందర్భంలో ఆధారపడిన కుటుంబ సబ్యుల విషయమై ఏవిషమైన డూప్లికేషన్ ఇద్దరిపైనా వేర్వేరుగా ఆధరపడినట్టు చూపరాదు.

ఎన్రోల్మెంట్ విధానం:

అథెన్ట్ కేషన్ :

అర్హులిన లబ్దిదారులందరికీ అర్హతకార్డులుగా పిలవబడే ఆరోగ్యకార్డులు అందచేయబదతాయి. ఆరోగ్యకార్డుల వివరాల ఆధారంగా లబ్దిదార్లు అర్హతను ఆన్ లైను విధానంలో పరిశీలించడం జరుగుతుంది. లబ్దిదారులు అర్హత కార్డును సిబ్బందికి చూపించాలి. అర్హత కార్డులేనప్పుడు కార్డునెంబరుని తెలపాలి.నెట్వర్క్ ఆసుపత్రులలో ఏర్పాటైన 'కియాస్క్' వద్ద ఉన్న సిబ్బంది అర్హతకార్డు వివరాలను పొందుపరచిన డేటా బేసు నుండి 'ఆన్ లైను' ద్వారా సరిచూస్తారు. అథెన్ట్ కేషన్ ,జెన్యునిటి, అర్హత పరిశీలించండి.పూర్తికావడంతో అథెన్ట్ కేషన్ పూర్తవుతుంది.

ప్రయోజనాలు:

ముందునుంచి వున్న వ్యాదులు:
అన్నివ్యాదులకు తొలిరోజునుంచి చికిత్స అందించడం జరుగుతుంది.కాంట్రాక్టు ప్రారంభానికి ముందునుంచి ఉద్యోగి లేదా పెన్షనరును భాధిస్తున్న ఏ వ్యాధి అయినా ఈ పధకంలో ఉచిత చికిత్స జరుగుతుంది.
ఔట్ పేషంటుగా చికిత్స:
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధి పధకంలో ప్రస్తుతం దీర్ఘకాలిక(క్రానిక్) వ్యాధులకు మాత్రమే ఔట్ పేషంటు సేవలు అందుబాటులో ఉన్నాయి.ఇతర వ్యాధులకు ఔట్ పేషంటు సేవలకోసం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించండి.
ఇన్ పేషెంట్ గా చికిత్స:
వివిధ విభాగాల్లో గుర్తించిన వ్యాధులకు జాబితాలోపేర్కొన్న చికిత్స విధానాల (x`స్)అందచేయబడతాయి. రోగులకు (ఫాలోఅప్) ప్యాకేజిల క్రింద ఆసుపత్రి అనతర కొనసాగింపు (ఫాలోఅప్) సేవలు అందచేయబడతాయి.

ప్యాకేజి:

దిగువ సేవలన్ని ప్యాకేజి లో యిమిడి ఉన్నాయి:
జాబితాలోచేర్చిన చికిత్స (దేరఫి ),పొందిన రోగులకు మొదటినుంచి చివరకు నగదు రహిత సేవలు నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా అందించడం 'డిస్చార్జి ' అయిన 10 రోజుల వరకు ఉచితంగా మందులు అందచేయడం ,నెల రోజుల వరకు ఎటువంటి సమస్యలు తలెత్తినా వైద్యసేవలంధించడం
చికిత్స పొందడం యష్టంలేని రోగులకు (జాబితాలో వున్న చికిత్సలకు సంబంధించి ) ఉచితంగా వ్యాధి ధృవీకరణ నిర్వహణ

19.3 . లో పేర్కొన్న యితర సేవలు అందించడం.

ప్యాకేజిల వివరణ :

జాబితా లోని చికిత్సల కోసం ప్రతి ఒక్కరికి నగదు రహిత సేవలు అందించడం . చికిత్స కోసం ఆసుపత్రి కి వెళ్లిన నాటి నుంచి ఎటువంటి నగదు చెల్లింపులు లేకుండా ఉచిత వైద్య సేవలు పొంది తిరిగి రావడం ,వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఏమి చెల్లించనవసరం లేదు. ఈ ప్యాకేజిక్రింద సేవలు పొందడానికి ట్రస్ట్ ఎప్పటికప్పుడు రూపొందించే మార్గదర్శక సూత్రాలు అనుసరించాలి /p>
గమనిక :
ఆసుపత్రుల స్థాయి నిర్ధారణ (గ్రేడింగ్) , ప్యాకేజిరేట్లు ,పూర్తిస్థాయి అంచనాలుపై అవగాహనకు బెంచి మార్కు గుర్తించడం జరుగుతుంది .
రోగిని సమీపంలోని ఆసుపత్రికి రిఫర్ చేసేందుకు వీలుగా భౌగోళికంగా ప్రాంతాలకు దగ్గరలో ఉండే ఆసుపత్రుల జాబితా ప్రకటించడం జరుగుతుంది .
దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం (డయాబెటిస్ ) వంటి వ్యాధులతో భాధపడే రోగులు ఏ ఆసుపత్రిలో మందులు పొందాలో అన్నవిషయం రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పేర్కొంటుంది .
కొన్ని చికిత్సలను ' నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్' వంటి కొన్ని సంస్థలకు పరిమితం చేసే అధికారం రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు ఉంటుంది .

ప్యాకేజి లో ని సేవల విశదికరణ :

కింద పేర్కొన్న సేవలు ప్యాకేజిలోయిమిడి వున్నాయి:
తత్కాలిక నివాసం (స్టే) :- ఇన్ పేషెంట్ గా వుండేందుకు ఐ.సి .యు , ఆపరేషన్ అనంతర వార్డు ,పాక్షిన ప్రయివేటు వార్డు మరియు ప్రయివేటు వార్డుల లోని బెడ్ చార్జీలు తాత్కాలిక నివాసం .
ఇన్ పుట్స్: ఓ.టి .చార్జీలు ,ఓ .టి .ఫార్మసీ, ఓ .టి డిస్పోజబుల్స్ ,కన్యూమల్స్ ,ఇంప్టాంట్స్,రక్తం ,రక్తానికి సంబంధించిన ఉత్పత్తులు ,సాధారణ మందులు ,ఆక్సిజన్ ,నిపుణులైన వైద్యుల ఫీజు ఆసుపత్రిలోని వైద్యుల ఫీజు ఆసుపత్రిలోని వైద్యుల ఫీజులు ఇన్ పుట్స్లో ఇమిడి వున్నాయి.
నిర్ధారణ పరీక్షలు : అన్ని బయోకెమిస్త్రీ ,పాధాలజి ,మైక్రోబయోలజి ,ఇమేజియాలజి ,నిర్ధారణ పరీక్షలు ,వ్యాధి నిర్ధారణ ,రోగి నిర్వహణ ఖర్చులు ఈ ప్యాకేజిలో వున్నాయి .

ఇతర ఖర్చులు : ఆహారం మరియు రవాణా చార్జిలు ,నిర్ధారించిన నాణ్యత కలిగిన ఆహారం ,ఆసుపత్రి లోపల ఉన్న క్యాన్ టీన్ నుండి గాని , బైట అమ్మకం దార్లనుండి గాని ఉచితంగా అందించాలి . నెట్వర్క్ ఆసుపత్రి నుండి రోగి స్వంత మండల ప్రధాన కార్య స్థానానికి మధ్య ఆర్.టి.సి బస్సు రేటుకు సమానమైన సొమ్ము లేదా రూ .50 /- (ఏది తక్కువ అయితే అది ) తిరుగు ప్రయాణ చార్జీలుగా చెల్లించడం జరుగుతుంది .

రక్తం మరియు సంబంధిత ఉత్పత్తులు :

అందుబాటుకు అనుగుణంగా ,ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకు నుండి కానీ ,బైట ఒప్పందం కుదుర్చుకున్న బ్లడ్ బ్యాంకు నుంచి కానీ అవసరమైన పక్షంలో రోగి కి రక్తం అందించాలి .ప్యాకేజి లో ఉన్న ప్రకారం ఆసుపత్రి స్వంత బ్లడ్ బ్యాంకు నుంచి బ్లడ్ అందించాలి .ఒకవేళ స్వంత బ్లడ్ బ్యాంకు లో రక్తం అందుబాటులో లేకపోతే ,రెడ్ క్రాస్ సంస్థ యితర స్వచ్చంద సంస్థలు నిర్వహించే బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తం సేకరించే కృషి చేయాలి .ఇతర సంస్థలనుంచి రక్తం సేకరించేదుంకువీ లుగా ఒక లేఖను రోగికి ఇవ్వాలి.

ప్రత్యేక జాబితాలో వున్న చికిత్సల ప్యాకేజి:

కాన్సర్ చికిత్స క్రింద ప్యాకేజి : కీమోధెరఫీ , రేడియోధెరఫీ చికిత్సలో ఏర్పడే సైడ్ ఎఫెక్టులను నిరోధించే పరిజ్ఞానం వున్న శిక్షణ పొందిన నిపుణులతో మాత్రమే చేయించాలి.(మెడికల్ ఆంకాలజిస్ట్ లు , రేడియో ఆంకాలజి స్ట్ లు)
హెమెటలాజికల్ మాటిగ్ నెస్సిస్ (ల్యుకేమియా,లింఫోమాస్ ,మల్టిపుల్ మైలోమా ) తో ఉన్న రోగులు వీడియోట్రిక్ మాలిగ్ నేన్రిస్ (14 ఏళ్ళలోపు వయస్సు వున్న రోగులు ) వున్న రోగులు మెడికల్ ఆంకాలజిస్ట్ ల తో మాత్రమే చికిత్స చేయించాలి .
కన్వెషనల్ రేడియోధెరఫీ కు స్పందించని కేసులు ,వ్యాదులలో మాత్రమే అడ్వాన్సుడు రేడియోధెరఫీ ప్రోజిసర్సు ఉపయోగించాలి .
చికిత్సల జాబితాలో ట్యూమర్ (కంతి) ని చేర్చలేదు .రోగాన్ని తగ్గించడంలో ధీర్ఘకాల పురోగతి ,వ్యాధి నివారణ రుజవ వు తాంటే ట్యూమర్స్ (కంతులు) కీమోధెరఫీ విధానంలో చికిత్స చేయవచ్చు .పూర్తి స్థాయి సర్వయివ లేని కేసునుంచి కేసుకు సమీక్షించాలి.
పాలిట్రుమా విభాగంలో ప్యాకేజి:
పాలిట్రుమా విభాగంలో ఆర్థోపెడిక్ ట్రామా (శాస్త్రచికిత్సలతో సరిచేసేవి), న్యూరలాజికల్ (నరాలకు సంబంధించిన) ట్రామా, (శాస్త్రచికిత్సలు, మందుల వాడకంతో సరిచేసేవి), రొమ్ము సంమ్భందించిన గాయాలు ( శాస్త్రచికిత్సలు, మందుల వాడకంతో సరిచేసేవి ), పొత్తికడుపుకు సంబందించిన గాయాలు) భాగాలుగా వున్నాయి. రోగి పరిస్థితికి అనుగుణంగా చికిత్సలో వీటిని కలిపి లేదా విడివిడిగా వినియోగించవచ్చు.
ఒకవారం ఆసుపత్రిలో వుంచి చేయగలిగిన (ఇమేజియాలజి ఆధారంగా) తీవ్ర గాయాలు ఉన్న కేసులు మాత్రమే ఈ ప్యాకేజీలో చికిత్స చేయాలి.సాదారణ, స్వల్ప గాయాలు వున్న కేసులు ఈ ప్యాకేజీలో అమలు చేయకోడదు.
న్యురలాజికల్ (నరాలకు సంబందించిన ) ట్రోమా విషయంలో హెచ్.ఎం.ఆర్.ఐ స్కానింగ్ వంటి ఇమేజియాలజి, గ్లాస్గో కోమా స్కేల్ ఆధారంగాను (13 కంటే తక్కువ వున్న స్కేల్ వాంచ్చనియం ) ఆసుపత్రిలో చేర్చాలి.
పాలిట్రుమాకు సంబందించిన అన్ని శాస్త్రచికిత్సలు ఆసుపత్రిలో చేర్చిన కాలంలో పనిలేకుండా ఈ ప్యాకేజీలో అమలు చేయాలి.
ట్రామా పేషెన్ట్ లు అందరికి సాధారణ పరిక్షలు ఉచితం.

వైద్య సేవల కొనసాగింపు ప్యాకేజిలు

అన్ని చికిత్సల విభాగాలలో ఆరోగ్య సేవల కొనసాగింపు ఈ పధకంలో కల్పించబడుతుంది. డాక్టర్ను సంప్రదించడం, మందులు, వ్యాది నిర్ధారణ పరీక్షలు వంటి సేవలు నగదు రహితంగా లబ్దిదారులకు అందచేయబడతాయి. అంతేకాకుండా లబ్దిదారులకు పూర్తిస్థాయి ప్రయోజనం చేకూర్చడం, వ్యాధి పరంగా ఎటువంటి చిక్కులు రాకుండా నివారించడం జరుగుతుంది. ఈ ప్యాకేజిలో నెట్ వర్క్ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు కొనసాగింపు చేపడతారు. దీనికయ్యే ఖర్చు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి నెట్ వర్క్ ఆసుపత్రులకు అందుతుంది.
ఈ ప్యాకేజిల మార్గదర్శక సూత్రాలు దిగువ పేర్కొనబడినాయి
వైద్య సేవల కొనసాగింపు రోగిని ఆసుపత్రి నుంచి డిస్ఛార్జ్ చేసిన 11 వ రోజు నుంచి ఒక సంవత్సరకాలం పాటు నగదు రహితంగా కొనసాగిమ్పబడుతుంది. ఈ వైద్య సేవల కొనసాగింపు ప్రతి ఏట పధకంతో పాటు పొడిగింపబడుతుంది.
దీనికి ప్రీఆదరైజేషన్ అవసరం లేదు.
నిర్వాహణ సౌలభ్యం కోసం ప్యాకేజి సొమ్మును 4 విడతలలో వినియోగించడం జరుగుతుంది. మొదటిసారి ఆసుపత్రి సందర్శన, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మొదటి త్రైమాసకంలోనే అధికంగా వుంటాయి.అందువల్ల మొదటి ఇన్స్టాల్మెంట్లో ఎక్కువ కేటాయించబడుతుంది
రోగి ఆసుపత్రి సందర్శన మందుల అవసరాన్నిబట్టి ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
నెట్ వర్క్ ఆరోగ్యమిత్రతో కలిసి రామ్కో రోగి వైద్య సేవల కొనసాగింపుకు సహకరిస్తారు .

ఆర్థికపరమైన కవరేజి—ఆర్థికపరమైన విధానం

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధి పధకంలో కుటుంబానికి సంవత్సరానికి బీమా మొత్తం 3 లక్షలు కుటుంబానికి బీమా చేసే మొత్తం ఫ్లోటర్ విధానంలో వుంటుంది. లబ్దిపొందే కుటుంబం మొత్తం కవరేజి మొత్తాన్ని లబ్దిపొందే కుటుంబంలోని ఒక వ్యక్తి వ్యక్తిగతంగా వినియోగించుకోవచ్చు. దీన్నే ఫ్లోటర్ చేసిన నిర్వహిస్తారు. 175 కోట్ల బఫర్ మిగులు మొత్తం ఏర్పాటవుతుంది. ఒకవేళ లబ్దిపొందే కుటుంబానికి అందాల్సిన వైద్య సేవల ఖర్చు నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ అయితే అదనంగా నిధులు ఈ మిగులు మొత్తం నుంచి అందచేయబడతాయి. ఈ మిగులు నిధులు కూడా ఫ్లోటర్ విధానంలో వినియోగించబడుతుంది. ఈ అదనపు నిధులు వినియోగానికి వైద్యులచే ఏర్పాటైన సాంకేతిక కమిటి ఆమోదం తెలుపుతుంది.

నిధుల విడుదల - విరాళం

ఉద్యోగులు ఆరోగ్య సంరక్షణ నిధిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనరులు 40 శాతం మరియు రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం నెలవారీ ప్రీమియం విరాళంతో నిర్వహిస్తాయి. వేతన చెల్లింపు అధికారి (డి.డి.ఒ) జీతం నుంచి మినహాయించిన లబ్దిదారు ప్రీమియంను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు చెల్లిస్తారు. ఎన్రోల్ కావడం, విరాళం తప్పనిసరి, భార్యభర్తలు యిరువురు అర్హులైన ఉద్యోగులు లేదా సర్వీసు పెన్షనరులు అయితే వారిద్దరు ఎన్రోల్మెంట్, విరాళం తప్పనిసరి. ఎట్టిపరిస్థితులలో ఆధారపడిన కుటుంబ సభ్యుల ఎన్రోల్మెంట్లో డూప్లికేషను అనుమతించరు.

పరిపాలన ఖర్చు

ఈ పధకంలో పరిపాలన ఖర్చులు సీలింగ్ని 5 శాతం అనుమతించడం జరిగింది.

వార్డ్ సౌకర్యం

మూడు స్లాబులుగా విభజించిన వేతన గ్రేడ్ ఆధారంగా ఉద్యోగులు, పెన్షనరులకు సాధారణ వార్డ్, సెమి ప్రైవేటు వారు ప్రైవేటు వార్డులలో ప్రవేశం వుంటుంది. అఖిల భారత సర్వీసు అధికార్లు, వారికి సమాన స్థాయి అధికార్లు అదిక ప్రీమియం చెల్లించాలి.

పేషెంట్ ప్రోసెస్ ఫ్లో

అవుట్ పేషెంట్ విధానం

ఈ పధకంలో ఎదైనా వ్యాధితో బాధపడుతున్న లబ్దిదారులు దిగువపేర్కొన్న తొలి కాంట్రాక్టు పాయింట్ వద్ద నమోదు చేయించుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో లేదా రిఫర్ చేసిన నెట్ వర్క్ ఆసుపత్రిలో నేరుగా ఒ.పి నమోదుకు వీలుంది.

నెట్వర్క్ ఆసుపత్రి వద్ద ఒ.పి పద్ధతి :

చేరిక: నెట్వర్క్ ఆసుపత్రి వద్దకు రిఫర్ కార్డుద్వారా రిజిస్ట్రేషన్ కోసం కంప్లైంట్తో ఆసుపత్రిలోని కియోస్క్ వద్దకు వస్తారు
నమోదు: నెట్వర్క్ ఆరోగ్యమిత్ర మొదటి పేషెంట్ ను నమోదు చేసుకుంటారు. ఒకవేళ రోగి పిల్లలు అయితే, తల్లితండ్రుల గుర్తింపు, కంప్లైంట్ నమోదు చేసుకుంటారు. ఒ.పి.లో నమోదు చేసి టికెట్ జారీ చేస్తారు.
ఒ.పి కన్సల్టెషన్ : రోగిని ఒ.పి.కి పంపి రోగి ఈ క్రింద అర్హులేనా? కాదా ? నిర్దారిస్తారు. అవసరమైతే వ్యాధి నిర్ధారణ పరిక్షలు నిర్వహిస్తారు.
వ్యాధినిర్ధారణ పరిక్షలు: అవసరమైన నిర్ధారణ పరిక్షల కోసం పంపి, పరిక్షల అనంతరం డాక్టర్ వద్దకు తీసుకొస్తారు. అక్కడ ఒ.పి. గా చికిత్స చేస్తే, మందుల చీటీ ప్రీస్క్రిప్షన్ ఇవ్వబడుతుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ప్రీస్క్రిప్షన్ లను ఆరోగ్యమిత్ర కంప్యుటర్ లో నమోదు చేయడంతో కేసు పరిష్కరించినట్లవుతుంది.
ఒ.పి.లో కేసు పరిష్కారం కానప్పుడు పద్ధతి:- ఒ.పి. లో పరిష్కారం కాదనిభావిస్తే 'రామ్కో' వివరాల్ని కంప్యుటర్ లో నమోదు చేసి, ప్రభుత్వ ఆసుపత్రికి పంపడం జరుగుతుంది.

ఇన్పేషెంట్ గా నమోదు: జాబితాలో చికిత్సల్లో ఏదైనా ఒక విధానం క్రింద రోగికి చికిత్స చేయాల్సి వస్తే 'రామ్కో' చికిత్స వివరాలు, విధానాలను కంప్యుటర్ లో నమోదు చేసి ఇన్పేషెంట్ గా నమోదును మార్పుచేసి, అర్హత ఆధారంగా సెమిప్రియివేటు లేదా ప్రియివేటు వార్డుకి చేర్చి ప్రీ- ఆథరైజేషన్ ను కల్పిస్తారు.

విశ్లేషణ మరియు నేర్చుకోవడం :

ప్రాధమిక విశ్లేషణ తర్వాత రోగిని ఆసుపత్రిలో చేర్చుకొని అవసరమైతే మార్ని పరిక్షలు చేస్తారు. అవుట్ పేషెంట్గానే మొదట రోగిని పరీక్షించడం జరుగుతుంది. తర్వాత వ్యాధి నిర్ధారణ. చికిత్స విధానం నిర్ధారించిన తర్వాత ఆన్ లైన్ వర్క్ ఫ్లో లో రోగిని ఇన్ పేషెంట్గా చేర్చుకుంటారు.

పూర్తిస్థాయి వ్యాధినిర్ధారణ మరియు కేటగిరైజేషన్ (విభాగీకరణ)

రోగిని పరీక్షించిన అనంతరం :
జాబితాలోని చికిత్స విధానాలు (తెరపీస్)కు సంబందించిన వ్యాదుల వల్ల రోగి భాధపడుతుంటే ట్రస్ట్ పోర్టల్ ద్వారా 24 గంటలు ప్రీ- ఆథరైజేషన్ 'రామ్కో' పంపుతారు.

జాబితాలోని చికిత్స విధానాలకు సంబంధించని, నెట్ వర్క్ ఆసుపత్రులు నిర్వహించాబడని వ్యాదులు భాధపడుతుంటే రోగికి సరైన కౌన్సిలింగ్ చేసి దగ్గరలోని సంబందిత ఆసుపత్రికి పంపడం జరుగుతుంది.

ప్రీ- ఆథరైజేషన్

రోగి కేసుకు సంభందించిన పత్రాలు ప్రీ- ఆథరైజేషన్ కు 'రామ్కో' అప్ లోడ్ చేస్తారు.

చికిత్స చేయడం:

ప్రీ- ఆథరైజేషన్ పొందిన తర్వాత నెట్వర్క్ ఆసుపత్రి రోగికి పూర్తిస్థాయి వైద్యసేవలు అందిస్తుంది. ఆసుపత్రిలో వైద్య చేసే సమయంలో ఎటువంటి విపత్కర పర్యవసానాలు తలెత్తినా వాటికి కూడా వైద్యం అందించడం జరుగుతుంది.

ఆసుపత్రి నుంచి విడుదల:

పూర్తిస్థాయి స్వస్థత తర్వాత రోగిని ఆసుపత్రి నుంచి డిస్ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆసుపత్రి నుంచి విడుదల సందర్భంలో నెట్వర్క్ ఆసుపత్రి డిస్ఛార్జ్ శీతతో 10 రోజులకు సరిపడే మందులు అందచేస్తుంది. చికిత్స కొనసాగింపుకు కౌన్సిలింగ్ రోగికి ఇవ్వడం జరుగుతుంది.
రోగిని ఆసుపత్రి నుంచి పంపేటప్పుడు సంతృప్తికరమైన సేవలు అందినట్లు రోగి నుంచి ఒక లేఖను తీసుకుంటారు.
పధకం నిబందనల ప్రకారం రోగికి రవాణా చార్జీలు చెల్లించబడతాయి. అన్ని పత్రాలను రామ్కో అప్ లోడ్ చేస్తారు.

కొనసాగింపు సేవలు:

డిస్ఛార్జ్ షీట్లో పేర్కొన్న విధంగా వైద్య ప్రమాణాలు నిబందనలనుసరించి రోగికి కొనసాగింపు సేవలు అందించడం జరుగుతుంది.
ఈ పధకంలో పొందుపరచిన ఉచిత సేవలకొనసాగింపు ప్యాకేజిని ఇందుకోసం వినియోగించడం జరుగుతుంది.

క్లై మ్ ఇవ్వడం :

రోగిని ఆసుపత్రి నుంచి సంతృప్తికరంగా పంపిన 1 రోజు తర్వాత నెట్వర్క్ ఆసుపత్రి బిల్లులు క్లైమ్ చేస్తుంది.

అత్యవసర నమోదు, చేర్పిక :

లబ్దిదర్లందరికి నెట్వర్క్ ఆసుపత్రిలో చేర్చుకొని తక్షణం వైద్యం చేయబడుతుంది. జాబితాలోని ఏఒక్కదాని నుంచి అయిన రోగి బాధపడుతుంటే 'రామ్కో' లేదా పేషెంట్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్, అత్యవసరంగా టెలిఫోన్ ద్వారా ప్రీ- ఆథరైజేషన్ పొందుతారు.
జాబితాలో లేని చికిత్స విదానాలతో రోగి బాధపడుతుంటే, రోగికి సరైన కౌన్స్లింగ్ చేసి సురక్షితమైన రవాణా పద్ధతిలో దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపడం జరుగుతుంది.
ఒకవేళ రోగి తీవ్రత వల్ల వేరేప్రాంతమలోని ఉన్నత ఆసుపత్రికి రోగిని తరలించాల్సి వస్తే, సురక్షితమయిన రవాణా విధానంలో ఇతర నెట్వర్క్ ఆసుపత్రికి పంపాలి.

ట్రస్ట్ కార్యాలయం విధులు

పథకం అమలు చేయడం

ఈ పతాకాన్ని ట్రస్ట్ ద్వారా మొదటి రెండు సంవత్సరాల కాల పరిమితికి అమలు చేయబడుతుంది.
ఈ పతాకాన్ని సిబ్బంది ట్రస్ట్ కార్యాలయం నుంచి అమలు చేస్తారు.
పాలసీ గడువు ముగిసిన ఒక నెల వరకు రన్ఆప్ పెరియడ్ అనుమతించాబడుతుంది. ప్రీ-అధ రైజ్ షేన్ పొందిన వారికీ శాస్త్ర చికిత్సలు పాలసీ గడువు ముగిసిన అనంతరం ఒక నెల వరకు శాస్త్ర చికిత్సలు చేయడం జేరుగుతుంది. అటు వంటి అన్నిక్లే యి మ్ లు గడువులు ముగిసిన నెల తర్వాత చర్చించా బడతాయి .

పరోక్ష పాత్రా కలిగిన శాకలు

24 - గంటల ప్రీ - అధ రైజ్ షేన్ విభాగం :- ట్రస్ట్ వెబ్ పోర్టల్ లో ప్రీ - అధ రైజ్ షేన్ కు నెట్ వర్కు ఆనుపత్రులు చేసిన వినతిని 12 గంటలుగా పరిష్కరించేందుకు ఆనికన విభాగాలకు చెందినా నిపుణులైన డాక్టర్లు ,ట్రస్ట్ డాక్టర్లతో సహా 24 - గంటలు ప్రీ - అధ రైజ్ షేన్ విభాగం అందుబాటులో ఉంటారు .
క్లేయిమ్ ల పరిష్కార విభాగం అర్హత కలిగిన క్లేయిమ్ లు పరిష్కరించేందుకు అవసరమైన సిబంది వరంలో 7 రోజులు పనిచేస్తుంటారు .
ఐ.టి మరియు మిస్లీరియన్స్ యితర పనుల విభాగం
ట్రస్ట్ పోర్టల్ పైవున్నా పరోక్ష పనులైన ఇ- ప్రీ - ఇధరైజ్ షన్ క్లేయిమ్ ల పరిష్కారం విచారణల పరిష్కారం , యితర పనులు వంటి మొత్తం కార్యక్రమాలు సజావుగా సాగేందుకు పూర్తి స్థాయి సిబ్బంది కలిగిన ఐ.టి విభాగాల చర్యలు తెసుకుంటుంది .
మిస్లీరియన్స్ విభాగ ట్రస్ట్ క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి సమాచారం సేకరించి,సరైన పద్ధతిలు వదింపు చేసి , ట్రస్ట్ కు అవసరమైన నివేదికలు సిద్ధంచేస్తుంది .
104 - కాల్ సెంటర్ :-104 - కాల్ సెంటర్ ద్వార ట్రస్ట్ పోర్టల్ ఫోన్ కాల్స్ స్వీకరిస్తుంది. ఈ విభాగం విచారణలు ,ఇన్ కమింగ్ , అవుట్ గోయింగ్ కాల్స్ కు సంభందించిన అంశాలపై వివిధ వద్దతులు , చర్యలు తెసుకొనబడతాయి. భాగస్వంయదరులకు,మార్గదర్శకం చేయడం, విచారణలు వరిష్కరించడం లో 104 కాల్ సెంటర్ కు ట్రస్ట్ సహకారాన్ని అందిస్తుంది. దిన్ని కాల్ సెంటర్ సర్వీసుగా వ్యవహరిస్తారు . కవరేజి , ప్రయోజనాలు , చికిత్స విదానాలు, నెట్ వర్క్ ఆనువత్రులు , నగదు హిత వైద్యం . అందుబాటులో ఉన్న బీమా మొత్తం, క్లేయిమ్ ఏ స్థాయి లో ఉన్నది వంటి వివరాల ఫై రాష్ట్రం లోని నలుములలు నుంచి వచ్చే ప్రశ్నలకు వరం లోని అన్ని రోజుల్లో , 24 - గంటలు తెలుగు లో సమాధానాలు 104 కాల్ సెంటర్ ద్వ్రార్ అందచేయబద్తాయి .
విచారణల విభాగం
ట్రస్ట్ సూచనలను అనుసరించి విచారనులు విభాగం ఫీడ్ బ్యాక్ ఫోర్మాట్ల పంపే రోగుల నుంచి ఫీడ్ బ్యాక్ స్వీకరించి , వాటిని విశ్లేచిస్తుంది . అంతే కాకుండా ప్రతి ఒక కేసు వివరాలను డాకుమెంట్ రూపంలో పొందుపరిచి ట్రస్ట్ పోర్టల్ కు అప్ లోడ్ చేస్తుంది. నగదు రహిత వ్యద్య సేవలు అంది ఆస్పత్రుల నుంచి వెళ్ళే లబ్ది దరులనుంచి సంతృప్తి కరమైన సేవలు అందించాలేనివి వ్రాతపూర్వకంగా స్వీకరిస్తుంది . ప్రతి లబ్ది దారులు తను పొందిన సేవలు సంత్రుప్తిపి ట్రస్ట్ అందచేసిన సమునలో వ్రాతపూర్వకంగా అభిప్రాయాలను తెలియజేయాలి. కష్టమర్ల సంతృప్తిఫై ట్రస్ట్ కూడా రాటింగ్ కార్డులు వినియోగించి స్వేకరించాబడుతుంది
డాక్టర్లు, యితర సిబ్బంది కలిగిన ఈ విభాగం త్రుస్తూ మార్గదర్శక సూత్రాల ప్రకారం , ఈపాటికి అపుడు విచారణలు తెరస్కరిస్తుంది . క్షేత్రస్థాయి లో కూడా విచారణలు పరిష్కారానికి ట్రస్ట్ ప్రయత్నిస్తుంది. లబ్బ్దిదారులు లేదా నెట్ వర్క్ ఆస్పత్రులు తమ సమస్యలపి తెసుకున సర్యాల , వాటి కొనసాగింపు చర్యల గురించి తెలుసుకోవల్సినపుడు వాటికీ సంబందించిన వివరాలు అందచేస్తుంది.o.
లబ్బ్దిదర్లు, నెట్ వర్క్ ఆస్పత్రులు సమస్య పరిష్కరించడం లో తెస్కున చర్యలను సమస్య నమోదు చెసుకున రెండు పని దినలోన ట్రస్ట్ రికార్డు చేస్తుంది.ముందుగ అంగీకరించిన సముఉనాలు , నమోదైన సమస్యలఫై తెస్కున చర్యలు సముద్రనేవేదిక ను ట్రస్ట్ ప్రభుత్వానికి సమర్పిస్తుంది.104 కాల్ సెంటర్ ద్వార మరియు ట్రస్ట్ పోర్టల్ ద్వార ఈ మొత్తం విధానాన్ని పూర్తి చేస్తుంది. సమస్య పరిస్థితులు సమస్య ముల్లం , పరిస్థితులని బట్టి అవసరమైనపుడు దాన్ని పరిష్కరించేందుకు ట్రస్ట్ సర్వీసు ప్రోవైదర్ తో సమస్వ్యం తో కలిగి ఉంటుంది.
పరిపాలన, శిక్షన్ మరియు వనరుల విభాగం: కార్యాలయ నిర్వహణ,న్యాయ సంభంద విషయాలు,అక్కౌంట్స్ నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని కలిగిన మనవ వనరుల విభాగం ట్రస్ట్సేవలు అందిస్తుంది. మనవ వనరుల నిర్వనతోబాటు, వర్కుషాపులు ,శిక్షణ కార్యాలయాలు ,భాగస్వామ్య పథకం నిర్వహణలో భాగస్వామ్యదార్ల పథకం నిర్వహణలో భాగస్వామ్యదార్ల పాత్ర వంటి అంశాలను ఈ విభాగం నిర్వహిస్తుంది.

లాగిన్ అయ్యేందుకు ఉద్యోగులకు సూచనలు

ఒకటవ దశ: ఆధార్ సంఖ్య పొందండి
(అ) ఆధార్ రసీదు ఎడమ వైపున వున్న 14 అంకెల సంఖ్యను ఇ.హెచ్.ఎఫ్ అంతర్జాల దరఖాస్తు లో నింపండి. ఉ: నమోదు సంఖ్య 1111/15210/02106 ఉన్నచో ఇ.హెచ్.ఎఫ్ అంతర్జాల దరఖాస్తు లో "Identification Details" అను ఖాళీ లో 11111521002106 నింపండి.
(ఆ) ఆధార్ రసీదు కుడి వైపున వున్న "Dated" పదాన్ని సమయం తో సహా చూడండి: తారీఖు (2 అంకెలు) + నెల (2 అంకెలు) + సంవత్సరం (4 అంకెలు) + ఘంటలు (2 అంకెలు) + నిముషాలు (2 అంకెలు) + క్షణాలు (2 అంకెలు), వెరసి 14 అంకెలు.
(ఇ) ఈ 14 అంకెలని కుడి వైపు నుండి ఎడమవైపునకు మధ్యలో మరేమీ గుర్తులు లేకుండా వరుస సంఖ్యగా మార్చండి. ఉ: Date: 11/08/2011 16:48:44 మార్చిన తరువాత 20110811164844 గా అవుతుంది.
(ఈ) పైన (ఈ) లో వొచ్చిన 14 అంకెల సంఖ్యని (అ) లో వొచ్చిన 14 అంకెల సంఖ్య తరువాత జోడించి 28 అంకెల సంఖ్యగా మార్చండి. 28 అంకెల నమోదు సంఖ్య పై ఉదాహరణ లో : 1111152100210620110811164844 గా రాయాలి.
(ఉ) ఆధార్ నమోదు సంఖ్య, ఆధార్ కార్డ్ను ఇప్పటికే మీరు పొందివుంటే, ఈ దశలో చేయవలసినవి వదిలేయండి
రెండోవ దశ: సమాచారం తయారు చేయడం
డేటా యొక్క తయారీ కోసం దిగువ నున్న పట్టిక లో సూచనలను చదవండి.
మీవి, మీ కుటుంబ సభ్యుల పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, మీ సర్వీసు రిజిస్టర్ మొదటి రెండు పేజీలు స్కాన్ చేసి, ఆ కాపీలను సిద్దం చేయండి. ఈ కాపీలను దరఖాస్తుతోపాటు పంపాలి.గమనిక: కంప్యూటర్ పరిజ్ఞానం లేని ఉద్యోగులు, పెన్షనరులు వారి వేతన చెల్లింపు అధికారి డి.డి.ఓ అధికారులను పైన పేర్కొన్న సమాచారంతో కలిసి సహాయం పొందండి
మూడో దశ: దరఖాస్తు చేయు విధానం
www.ehf.gov.in వెబ్ పోర్టల్కి లాగిన్ అవ్వండి.
ఇందుకు మీకు కేటాయించిన ఉద్యోగ కోడును యూసర్ ఐ.డి గాను, మీ వేతన చెల్లింపు అధికారి (డి.డి.ఓ) మీకు కేటాయించిన 'పాస్ వర్డ్' ను ఉపయోగించండి
మీరు ఉద్యోగి అయితే, మొదటగా లాగిన్ కి ఉపయోగించిన 'పాస్ వర్డ్ 'ను మార్చుకోండి. మీ 'పాస్ వర్డ్' ను రహస్యంగా ఉంచుకోండి.
నమోదు అయ్యేందుకు అవసరమైన దరఖాస్తు వివరాలు  నమోదు అయ్యేందుకు అవసరమైన దరఖాస్తు వివరాలు
వ్యక్తిగత వివరాలు  వ్యక్తిగత వివరాలు
ఉద్యోగ గుర్తింపు నెంబర్ (ఐ.డి)ట్రెజరీ అధికారులు ఇచ్చిన గుర్తింపు నెంబర్
పి.పి.ఓ . నెంబర్మీరు పెన్షనరు అయితే పి.పి.ఓ నెంబర్
పేరుసర్వీసు రిజిస్టర్లో వ్రాసిన విదంగా
ఆధార్ నెంబర్ఆధార్ కార్డ్లో పేర్కొన్న విధంగా
ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ఆధార్ ఎన్రోల్మెంట్ సమయంలో ఇచ్చిన ఐ.డి నెంబర్
పుట్టిన తేదిసర్వీసు రిజిస్టర్లో వ్రాసిన విదంగా
సెక్స్ పురుషులు లేదా స్త్రీలు
వైవాహికస్థితి వివాహితులా కాదా
కులంమీ కులం
అంగవైకల్యం అంగవైకల్యం వుంటే , ఆ వివరాలు
జాతీయతభారతీయులు
సంప్రదించు వివరాలు 
చిరునామా*  నివాస చిరునామా, ఇ-మెయిల్ చిరునామా, మొబైల్ ఫోన్ నెంబర్ వ్రాయాలి. ఇ-మెయిల్ జాగ్రత్తగా వ్రాయాలి. వీటి ద్వారా సమాచారం మీకు అందచేయబడుతుంది.
గుర్తింపు వివరాలు
రేషన్ కార్డు నెంబర్  మీకు రేషన్ కార్డు వుంటే ఆ నెంబర్ వ్రాయాలి . ఆ నెంబర్ వుంటే మీ సమాచారం వివరాలు తెల్సుకోవడం సులువవుతుంది. రేషన్ కార్డు వుంటే తప్పని సరిగా వ్రాయండి
గుర్తింపు చిహ్నాలు*  మీ శరీరం ఫై వున్న పుట్టుమచ్చలు వంటి రెండు గుర్తింపు చిహ్నాలు
ఉద్యోగ వివరాలు
హెచ్.ఓ.డి(శాఖ అధిపతి)*  మీ శాఖ అధిపతి హోదా, మీరు పెన్షనరు అయితే రిటైర్అయినప్పటి మీ శాఖ అధిపతి హోదా
జిల్లా*  ప్రస్తుతం మీరు ఉద్యోగం చేస్తున్న జిల్లా పెన్షనరు అయితే ఈ వివరాలు అవసరం లేదు. డి.డి.ఓ.( వేతన చెల్లింపు అధికారి) కోడ్ ప్రస్తుతం వేతనం పొందుతున్న డి.డి.ఓ. గుర్తింపు కోడ్ ను ట్రెజరి అధికారుల నుంచి పొందవచ్చు. పెన్షనరు అయితే ఈ వివరాలు అవసరం లేదు
ఉద్యోగం పేరు*  ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కేటగిరి వ్రాయండి. ఉదా : సివిల్ అసిస్టెంట్ సర్జన్, డ్రైవర్, కమాటి మెదలయినవి. మీరు పెన్షనరు అయితే మీరు రిటైర్ అయిన ఉద్యోగం పేరు. మీరు పెన్షనరు అయితే, మీరు పెన్షన్ పొందుతున్న ఆఫీసు పేరు , సబ్ ట్రెజరీ అధికారి (ఎస్.టీ.ఓ), సహాయ పెన్తిఒన్ పేమెంట్ అధికారి (అ.పి.పి.ఓ) ల గుర్తింపు కోడ్ వ్రాయాలి
వేతన వివరాలు
ప్రస్తుత వేతనం  ప్రస్తుతం పొందుతున్న వేతనం వ్రాయాలి. పెన్షనరుకు ఏది వర్తించదు
జత చేయవలసినవి
సర్వీసు రిజిస్టర్*  ఉద్యోగి పేరు, పుట్టిన తేది, అధికారి సంతకం వంటి వివరాలు స్పష్టంగా కనిపించేవిదంగా ఉద్యోగి పాత సర్వీసు రిజిస్టర్కు చెందినవయితే 1 , 2 పేజీలు , కొత్త సర్వీసు రిజిస్టర్ అయితే 4 , 5 పేజీలు స్కాన్ చేసిన రెండు పేజీలు సాఫ్ట్ కాపీలు జతచేయాలి.పెన్షనరు అయితే. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ స్కాన్ చేసిన సాఫ్ట్ కాపీ జత చేయాలి
ఫోటోలు*  విదేశియానానికి అవసరమయిన పాస్ పోర్ట్ దరఖాస్తులో అతికించే పద్ధతిలో ఐ.సి.ఎ.ఒ విధానంలో తీయించుకున్న పాస్ పోర్ట్ సైజు ఫోటోలు (ఉద్యోగివి, కుటుంబ సభ్యులవి ) జతచేయాలి. ఐ.సి.ఎ.ఒ విధానంలో పాస్ పోర్ట్ సైజు ఫోటోలు కావాలని ఫోతోగ్రఫర్కు ముందుగానే చెప్పాలి.
పుట్టినతేది ధ్రువపత్రం*  మీ ఫై ఆధారపడిన కుటుంబ సబ్యుల్లో ఐదేళ్ళ కంటే తక్కువ వయస్సు వున్న పిల్లలకు ఆధార్ నెంబర్ ఉండదు. పుట్టినతేది ధ్రువపత్రం స్కాన్ చేసి సాఫ్ట్ కాపీ సిద్దం చేయాలి.
వైకల్య ధ్రువపత్రం*  కుటుంబంలో ఎవరయినా వికలాంగులు వుంటే, అంగవైకల్య ధ్రువపత్రం స్కాన్ చేసి కాపీ జత చేయాలి.
కుటుంబ సభ్యుల వివరాలు
పేరు, ఉద్యోగితో వున్న సంబంధం, ఆధార్ నెంబర్*  కుటుంబ సభ్యుని పేరు, ఉద్యోగితో కల సంబంధం, ఆధార్ నెంబర్ లేదా ఆధార్ ఎన్రోల్ల్మేంట్ గుర్తింపు నెంబర్ వ్రాయాలి. కుటుంబంలోని ప్రతి ఒక్కరి వివరాలు, ఉద్యోగితో సంబంధం వ్రాయాలి.
సంతకం చేసిన దరఖాస్తు ద్రువికరణతో
సంతకం చేసిన దరఖాస్తు ద్రువికరణతో*  వెబ్ సైటులో పొందుపరచిన ఇ-దరఖాస్తు ఫారంలో ఫై సమాచారం నమోదు చేసిన తర్వాత, దాన్ని ప్రింట్ చేసి దరఖాస్తు ఫారం ఫై సంతకం చేయాలి. ఆ విధంగా సంతకం చేసిన దరఖాస్తు ఫారంను స్కాన్ చేసి సాఫ్ట్ కాపీ తయారుచేయాలి
ద్రువీకరణలో పేర్కొన్న అంశాలు
  మీ ద్రువీకరణ క్రింద విధంగా వుంటుంది 1 ) మీ కుటుంబానికి చెందిన డేటా వివరాల్ని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కు బదిలి చేయడానికి అంగీకరించడం జరిగింది. 2 ) అర్హతలేని వారిని కుటుంబ సబ్యులుగా పేర్కొంటే, మీరు క్రమశిక్షణ చర్యలకు బాద్యులుగా అయ్యేందుకు అంగీకరించడం జరిగింది. ౩) సమాచారం అంతా సర్వీసు రిజిస్టర్ ఆధారంగా, తనకున్న పూర్తి స్థాయి పరిజ్ఞానంతో ద్రువికరించడం జరిగింది.

పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు అవసరం అయ్యే అన్ని రకాల స్టడీ మెటీరియల్స్ ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి చూడండి నవచైతన్య కాంపిటీషన్స్ www.menavachaitanyam.blogspot.com



మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

Post a Comment

Previous Post Next Post