కరెంట్‌ అఫైర్స్‌ - ఎస్.బి.ఐ. చరిత్రలో తొలి మహిళా చైర్ పర్సన్

ఎస్.బి.ఐ. చరిత్రలో తొలి మహిళా చైర్ పర్సన్
-ఎస్‌బిఐ చైర్ పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య 2013 అక్టోబర్ 7న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వర కు ఈమె బ్యాంకు మేనేజింగ్ డైరె క్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
-207 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్‌బిఐ బ్యాంకు పగ్గాలను ఒక మహిళ చేపట్టడం ఇదే ప్రథమం.
-సాధారణంగా ప్రభుత్వ బాంకుల్లో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను ఒక్కరే నిర్వహిస్తే, ఎస్‌బిఐలో మాత్రం ఛైర్మన్, నలుగురు ఎండీలు ఉంటారు.
-1977లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బిఐలో చేరిన ఈమె తన 36 ఏళ్ళ ఉద్యోగ జీవితంలో రిటైల్, ట్రెజరీ కార్పొరేట్ ఫైనాన్స్ తదితర విభాగాల్లో పనిచేశారు.
-ఇప్పటివరకు ఎస్‌బిఐ ఛైర్మన్ పదవి చేపట్టిన వారిలో భట్టాచార్య అతి పిన్న వయస్కురాలు
-ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అలహా బాద్ బ్యాంకు (సుబ్బలక్ష్మీ పాన్సే), బ్యాంక్ ఆఫ్ ఇండియా (వి.ఆర్.అయ్యర్), ప్రైవేటు బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంకు (చందాకొచ్చర్) యాక్సిస్ బ్యాంక్ (శిఖాశర్మ) హెచ్‌ఎస్‌బీసీ ఇండియా (నైనాలాల్ కిద్వాయ్)లకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు.
-జనరల్ ఇన్సూరెన్స్, కస్టడీ సర్వీసెస్, ఎస్‌బిఐ మెక్వైరీ ఇన్‌ఫ్రా ఫండ్ సబ్సిడరీస్ వంటి విభాగాల ఏర్పాటులో ఈమె కీలకపాత్ర పోషించారు.
-బ్యాంక్ న్యూయార్క్ ఆఫీస్ ఎక్స్‌టర్నల్ ఆడిట్ కరస్పాండెంట్ రిలేషన్స్ చీఫ్‌గా కూడా ఈమె బాధ్యతలు నిర్వహించారు.
-ఈమె 2016 మార్చి వరకు ఈ పదవిలో ఉంటారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
-గ్రామీణ పరపతి సర్వే సంఘం సిఫారసుల మేరకు 1955లో ఇంపీరియల్ బ్యాంకు జాతీయం చేయబడి భారతీయ స్టేట్ బ్యాంక్‌గా ఏర్పడింది. దీని వాటా మూల ధనం 92 శాతం రిజర్వుబ్యాంకు స్వాధీనం చేసుకుంది.
-భారతదేశంలో ప్రభుత్వ యాజమాన్యంలో ఏర్పడిన మొట్టమొదటి వాణిజ్య బ్యాంకు
-భారతీయ స్టేట్ బ్యాంకు ఏర్పడినప్పుడు దాని బ్రాంచీల సంఖ్య 446 ఉంటే 2013 నాటికి 15,000 లకు చేరుకుంది.
-1959లో భారతీయ స్టేట్‌బ్యాంకు (అనుబంధ బ్యాంకులు) చట్టం చేయబడింది. ఈ చట్టం కింద 7 ప్రాంతీయ బ్యాంకులు జాతీయం చేయబడి ఎస్‌బిఐకు అనుబంధ బ్యాంకులుగా జరపరిచారు.
-స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసిపోయాయి.
-ప్రస్తుతం ఎస్‌బిఐకు అనుబంధంగా 5 బ్యాంకులు ఉన్నాయి.
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్
3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్
4. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా
5. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్
-2008, ఆగస్ట్ 13న స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ర్ట ఎస్‌బిఐలో విలీనమైంది
-2009, జూన్ 19న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ విలీనం ప్రారంభమై 2010 ఏప్రిల్ నాటికి పూర్తయింది.
-ప్రస్తుతం ఎస్‌బిఐ ప్రపంచంలో అతి పెద్ద 66వ బ్యాంక్
-దేశంలోని మొత్తం బ్యాంకింగ్ అసెట్స్‌లో ఎస్‌బిఐ, దాని ఐదు అనుబంధ బ్యాంకులు 20 శాతం పైగా వాటాను కలిగి ఉన్నాయి.
-ఎస్‌బిఐలో ఉద్యోగులు సుమారు 2.25 లక్షలు.



Post a Comment

Previous Post Next Post