భౌతిక శాస్త్రం లో ప్రాధమిక భావనలు - పరికరాలు ఉపయోగాలు



భౌతిక శాస్త్రం లో ప్రాధమిక భావనలు - పరికరాలు ఉపయోగాలు 
1. అల్టిమీటర్‌ : విమానాలు వెళ్ళిన ఎత్తును కొలిచే సాధనం.
2. అమ్మీటర్‌ : విద్యుత్‌ ప్రవాహ బలాన్ని కొలిచే సాధనం
3. యానిమోమీటర్‌
: గాలి వేగాన్ని, దిక్కును కొలిచే సాధనం.
4. ఆడియోమీటర్‌ : వినికిడి శక్తిని కొలిచే సాధనం.
5. భారమితి : వాతావరణ పీడనాన్ని కొలిచే సాధనం.
6. బైనాక్యులర్‌ : దూరాన ఉన్న వస్తువులను దగ్గరగా ఉన్నట్లు చూడగల్గే సాధనం.
7. కేలరీ మీటరు : ఉష్ణాన్ని కొలిచే సాధనం.
8. ధర్మామీటరు : ఉష్ణోగ్రతను కొలిచే సాధనం.
9. దూరదర్శిని : దూరాన ఉన్న వస్తువులను చూడటానికి ఉపయోగించే సాధనం.
10. క్లినికల్‌ ధర్మామీటరు : మానవ శరీర ఉష్ణోగ్రతను కొలవటానికి ఉపయోగించే సాధనం.
11. క్రోనో మీటరు : సముద్రంలో నౌక ఏ రేఖాంశం మీద ఉన్నదో తెలిపే సాధనం.
12. కంప్యూటర్‌ : ఒక క్రమ పద్ధతిలో అందించిన సమాచా రాన్ని దాచుకొని, అవసరమైనప్పుడు అవసరమైన విధంగా తిరిగి అందించే సాధనం.
13. డైనమో
: యాంత్రిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే సాధనం.
14. మోటార్‌ : విద్యుచ్ఛక్తిని యాంత్రిక శక్తిగా మార్చే సాధనం.
15. ఎలక్ట్రో కార్డియో గ్రాఫ్‌ : గుండె కొట్టుకోవటాన్ని గ్రాఫ్‌ రూపంలో చూపించే సాధనం.
16. ఎలక్ట్రో ఎన్‌సిఫలో గ్రాఫ్‌ : మానవ మెదడులోని విద్యుదావేశాన్ని నమోదు చేసే సాధనం.
17. ఎలక్ట్రోస్కోప్‌ : స్వల్ప విద్యుదావేశాలను సూచించే సాధనం
18. గల్వనో మీటర్‌
: స్వల్ప విద్యుత్‌ ప్రవాహాలను సూచించే సాధనం.
19. హైడ్రోమీటర్‌ : ద్రవాల తారతమ్య సాంద్రతను కొలిచే సాధనం.
20. హైగ్రోమీటర్‌ : వాతావరణంలోని తారతమ్య ఆర్ధ్రతను కొలిచే సాధనం.
21. హైగ్రోస్కోప్‌ : వాతావరణంలోని ఆర్ద్రతలో జరిగే మార్పులను సూచించే సాధనం.
22. హైడ్రోఫోన్‌ : జల ఉపరితలం క్రింద శబ్ద వేగాన్ని కొలిచే సాధనం.
23. ల్యాక్టోమీటర్‌ : పాల స్వచ్చత (సాంద్రతను) కొలిచే సాధనం.
24. ది క్చూచి : నౌకా ప్రయాణంలో దిక్కులను తెలిపే సాధనం.
25. మైక్రోమీటర్‌ : స్వల్ప దూరాలను కొలిచే సాధనం.
26. మానోమీటర్‌ : వాయువుల పీడనాన్నికొలిచే సాధనం.


మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

Post a Comment

Previous Post Next Post