దేనికైనా రెడీ చిత్రంలో నాకు తప్పుగా అన్పించిన సందర్భాలు కొన్ని

నా అంతరంగం (తొంగి చూడకండి)
దేనికైనా రెడీ చిత్రంలో నాకు తప్పుగా అన్పించిన సందర్భాలు కొన్ని
1. బ్రహ్మానందం గారిచేత చెప్పించిన వాక్యం
నాకు తెలుసురా సంభావన పేరు చెబితే మీరు తోక ఊపుకుంటూ వస్తారని.

2. మంచు విష్ణు
యాగం జరుగుతుండగా మంత్రాలు రాని విష్ణు సారోస్తారా పాట పాడడం

3. హిందువులకు పవిత్రమైన దీపాలను ముస్లింలకు పవిత్రమైన నమాజ్ తో అసందర్భంగా పోల్చడం

4. మీరు అచ్చం మా ఆయన లాగానే ఉన్నారే అంటూ ఒక బ్రాహ్మణ స్త్రీ, బ్రాహ్మణులనే కాదు ఏ కులం మతం స్త్రీ అయినా ఇలాంటి పదజాలం ఉపయోగించదు.


అన్నింటిని మించి నిరసన తెలుపడానికి మోహన్ బాబు యింటికి వెళ్ళిన బ్రాహ్మణులను కిరాయి గూండాలతో కొట్టించడం, వారిని యాచకులేమో అంటూ మోహన్ బాబు దూషించడం

ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నన్ను బాధ పెట్టింది.


యిది ఈ సినిమా తో ప్రారంభం అయినది కాదు. వీక్షకుల వెర్రిని సొమ్ము చేసుకోవడానికి ఎందరో నిర్మాతలు దర్శకులు సినిమాలో ఎవరో ఒకరిని వెధవని చేసి చూపడం మామూలు అయిపోయింది.
స్త్రీలను అసభ్యంగా చూపించారు
ఉపాధ్యాయులు, అద్యాపకులపై కుళ్ళు జోకులు వేసారు
పోలీసులను చేతకానివారిలా అసభ్యంగా చూపించారు
భారతీయ నాట్య రీతులను కించపరిచారు
కొన్ని ప్రాంతాల భాషలను, వ్యవహారిక శైలిని కించపరిచేలా సంభాషణలు రాసారు.
నేడు కొన్ని కులాల ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు

నా అభిప్రాయంలో తప్పు వారిది కాదనిపిస్తుంది. సొమ్ముల కోసం నానా గడ్డి కరుస్తున్న నేటి సమాజంలో వారి ప్రవర్తన నాకు వింతగా అన్పించడం లేదు.

కాని వీక్షకులుగా మనం ఏం చేస్తున్నాం? ఆ అశ్లీ లాన్నె ప్రోత్సహిస్తున్నాం. అలాంటి చిత్రాలనే హిట్ చేస్తున్నాం. కారణం ఏమంటే ఏ చిత్రం వలన అయినా మనోభావాలు దెబ్బతినేది సమాజంలో బహు కొద్ది శాతం మందినే.
వారు ఎడుస్తుండగా మిగిలినవారంతా మనకెందుకులే అనుకుంటూ ఆయా చిత్రాలను చూసి నవ్వుకుని, చివరిలో అయ్యో పాపం అనేసి వెళ్ళిపోతున్నారు. మనదాక వస్తేగాని బాధ ఏంటో  లేదు. బాధ తెలిసినపుడు మన ప్రక్కన బహు కోదిమందే ఉంటున్నారు.ఏమి చేయలేని పరిస్తితి.

ప్రతివారు ఇలానే ప్రక్కన ఒకడు ఏడుస్తుంటే మనకెందుకులే అని నవ్వుకుంటూ వెళ్ళిపోతే ఈ సమాజం పోయేది ఎటు?
ఓ  మిత్రమా ఒకసారి గమనించు తప్పును తప్పు అని నిర్భయంగా చెప్పు. తప్పును ఒప్పుకోవడానికి వెనుకాడకు. అలా చేయకుంటే మనం మనుషులం కాదు.మనిషి ముసుగులో కనిపించే రాక్షసులం.


మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

నా అంతరంగం (లోప‌లికి తొంగి చూడ‌కండి). . .

Post a Comment

Previous Post Next Post