కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ - తెలుగులో
కరెంట్ అఫైర్స్
సహజంగా మీరు సిద్ధం అవుతున్న పోటీ పరీక్ష ఏదైనా కరెంట్ అఫైర్స్ అనే సబ్జక్టు ఒకటిగా ఉంటుంది. ప్రధాన పోటీ పరీక్షలు అయిన APPSC, TSPSC నిర్విహించే వివిధ పోటీ పరీక్షలు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, డియస్సీ, టెట్, పోలీసు ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాలు, బ్యాంకు ఉద్యోగాలలో కరెంట్ అఫైర్స్ అనేది ఒక కీలకమైన సబ్జక్టు. కొన్ని పోటీ పరీక్షలలో అయితే విద్యార్ధి విజయాన్ని కరెంట్ అఫైర్స్ సబ్జక్టే నిర్ణయిస్తుంది అనడంలో సందేహం లేదు.కరెంట్ అఫైర్స్ కోసం ఏం చదవాలి?
మరి అటువంటి కరెంట్ అఫైర్స్ సబ్జక్టును ఎలా ప్రిపేర్ కావాలి అని ఎవరిని అడిగినా చెప్పే మాట ఒక్కటే. రోజూ దినపత్రికలను చదవడం ద్వారా కరెంట్ అఫైర్స్ పై గ్రిప్ సాధించవచ్చు అని. నిజమే. నిత్యం దినపత్రికలను ఫాలో అవుతూ ఉంటే కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. ఏ ప్రశ్న అడిగినా తేలికగా సమాధానం గుర్తించే అవకాశం చిక్కుతుంది.మరి న్యూస్ పేపర్ ఎలా చదవాలి?
ఏదో చదివామన్నట్లు న్యూస్ పేపర్ ను తిరగేస్తే కరెంట్ అఫైర్స్ పై పట్టు రాదు. విద్యా సంబంధిత పేజీలో, ఆకర్షణీయంగా కనిపించే వసుంధర, ఫ్యామిలీ, సినిమా పేజీలు, క్రీడా పేజీలు ప్రత్యేకమైన పేజీలు చదివడం వల్ల సమయం వృధా తప్ప కరెంట్ అఫైర్స్ పై పట్టు రాదు.
అందుకే కొన్ని మెళకువలను నేర్చుకుని నిత్యం కరెంట్ అఫైర్స్ పై పట్టు లక్ష్యంగా వార్తా పత్రికలను చదవాలి. ప్రతి రోజు జరుగుతున్న పరిణామాలను పక్కనబెట్టి, ప్రత్యేకమైనవి, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయినవి, శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందినవి, నియమాకాలు, ఆవిష్కరణలు వంటివాటిపై ఫోకస్ పెట్టాలి. క్రీడా రంగంలో కూడా పతకాలు సాధించడం, రికార్డులు సాధన, టైటిల్స్, ట్రోఫీలను గెలవడం వంటి అంశాలను పరిశీలించాలి. పరిశీలించి వదిలివేయడం కాకుండా, ఒక నోటు పుస్తకంలో ప్రతి రోజూ, ఆ రోజు దినపత్రికలో కనిపించిన ఉత్తమ అంశాలను నోటు చేసుకుంటూ ఉండాలి. ఈ నోటు పుస్తకం ఎంత సమర్ధవంతంగా రూపొందించుకుంటున్నామో, మన ప్రిపరేషన్ అంత సరిగా సాగుతున్నదన్న విషయం మరవరాదు. ప్రతి రోజు దినపత్రికలో కనీసం 25 నుంచి 30 ముఖ్యమైన అంశాలుంటాయన్నది మనసులో ఉంచుకుని కరెంట్ అఫైర్స్ సంబంధిత అంశాలను వెతికి పట్టుకోవాలి.
నవచైతన్య కాంపిటీషన్స్ సహకారం - కరెంట్ అఫైర్స్ చదవడంలో
లక్ష్యం లేకపోతే ఏ ప్రయాణం అయినా సరిగా సాగదు. అందుకే మీరు ప్రతి రోజు దినపత్రికను ఎంత బాగా చదివారో పరీక్షించేందుకు నవచైతన్య కాంపిటీషన్స్ ప్రతి రోజు రాత్రి గం. 9.00 కు ఆ రోజు దినపత్రికలలో వచ్చిన పరిణామాలపై బిట్స్ రూపొందించి, క్రింది పేజిలో అందుబాటులో ఉంచుతుంది. ఈ బిట్స్ అన్నింటికి మీరు సమాధానం గుర్తించగలిగితే, మీరు ఆ రోజు దినపత్రికను క్షుణ్ణంగా చదివినట్లే. లేదంటే మీ ప్రిపరేషన్ లో ఏదో లోపమున్నట్లు.
కనుక ఈ డైలీ టెస్ట్ లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరుకుంటూ . . .
మీ
నవచైతన్య కాంపిటీషన్స్
10th Class Physical Science Questions & Answers . .
Tags
CA