పంచాయితీ సెక్ర‌ట‌రీ - ప్ర‌శ్నాప‌త్రాల శ్రేణి - పాటించాల్సిన నియ‌మ నిబంధ‌న‌లు

పంచాయితీ సెక్ర‌ట‌రీ స్ర్కీనింగ్ టెస్ట్ ప్ర‌శ్నాప‌త్రాల శ్రేణిలో చేరి, ఈమెయిల్ ద్వారా ప్ర‌శ్నాప‌త్రాలు పొందాల‌నుకునే వారు పాటించాల్సిన సూచ‌న‌లు

1. ఈ ప్యాకేజిలో మీకు ఎటువంటి స్ట‌డీ మెటీరియ‌ల్ ల‌భించ‌దు. కేవ‌లం ప్ర‌శ్నాప‌త్రాలు మాత్ర‌మే పంప‌బ‌డ‌తాయి.
2. డివిజిన‌ల్, రివిజ‌న్ ప్ర‌శ్నాప‌త్రాలు 100 మార్కుల‌కు, గ్రాండ్‌టెస్ట్‌లు 150 మార్కుల‌కు పంప‌బ‌డ‌తాయి.
3. ఈ ప్ర‌శ్నాప‌త్రాల‌ను ఆయా స‌బ్జ‌క్టుల‌లో నిష్ణాతులైన ఉపాధ్యాయుల స‌హ‌కారంతో సేక‌రించిన ప్ర‌శ్న‌ల‌తో రూపొందించ‌డం జ‌రుగుతుంది. వీరెవ‌రు పంచాయితీ సెక్ర‌ట‌రీ కోచింగ్ సెంట‌ర్‌ల‌లో కోచింగ్ ఇచ్చేవారు కాదు గ‌మ‌నించండి.
4. ఈ ప్ర‌శ్నాప‌త్రాల‌లో ప్ర‌శ్న‌ల‌ను రూపొందించడానికి మార్కెట్‌లో విరివిగా దొరికే పుస్త‌కాల‌తో పాటు, ప్రామాణిక పుస్త‌కాలు, ఉపాధ్యాయులు వారు రూపొందించుకున్న సొంత నోట్సును ఆధారంగా చేసుకోవ‌డం జ‌రుగుతుంది.
5. ప్ర‌శ్నాప‌త్రాల‌న్నీ ఈమెయిల్ ద్వారా మాత్ర‌మే పంప‌బ‌డ‌తాయి. వాట్సాప్ ద్వారా కానీ, లేదా పోస్టు ద్వారా కానీ పంప‌బ‌డ‌వు.
6. ప్ర‌శ్నాప‌త్రాలు పంపిన విష‌యాన్ని మీకు వాట్సాప్ ద్వారా తెలియ‌ప‌ర‌చ‌డం జ‌రుగుతుంది.
7. ప్ర‌శ్నాప‌త్రాన్ని షెడ్యూల్‌లో తెలిపిన తేదీ ఉద‌యం 9.00 గంట‌ల‌లోగా పంప‌డం జ‌రుగుతుంది. స‌మాధాన ప‌త్రాన్ని అదే రోజు సాయంత్రం 9.00 గంట‌ల‌లోపు పంప‌డం జ‌రుగుతంది. స‌మాధాన ప‌త్రం మాత్రం ఈమెయిల్‌తోపాటు వాట్సాప్ ద్వారా కూడా పంప‌బ‌డుతుంది.
8. దాదాపు అనుకున్న షెడ్యూల్ ప్ర‌కార‌మే ప్ర‌శ్నాప‌త్రాల‌ను పంప‌డం జ‌రుగుతంది. అనుకోని కార‌ణాల వ‌ల్ల ప్ర‌శ్నాప‌త్రం పంప‌డం ఆల‌స్యం అయినా, పంప‌డం వాయిదా వేసినా అభ్య‌ర్ధులు ఓపిక వ‌హించాల్సి ఉంటుంది.
9. ప్ర‌శ్నాప‌త్రాల‌ను ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుని రూపొందించిన‌ప్ప‌టికీ, ముద్ర‌ణా సంబంధ‌మైన దోషాలు, త‌ప్పులు ఉండే అవ‌కాశం లేక‌పోలేదు. అందుకే స‌మాధాన ప‌త్రం పంపిన త‌రువాత కీ వెరిఫికేష‌న్ నిర్వ‌హించ‌బడుతుంది. ఈ వెరిఫికేష‌న్‌లో మీరు స‌మాధానం త‌ప్పు ఇవ్వ‌బ‌డిన‌ట్లు గుర్తించిన ప్ర‌శ్న‌ల వివ‌రాల‌ను పంపితే ఉపాధ్యాయుల‌చేత వెరిఫై చేయించి స‌రైన స‌మాధానం పంప‌డం జ‌రుగుతుంది. ప్ర‌తీ ప్ర‌శ్నాప‌త్రంలోనూ ఒక‌టి రెండు తప్పులు దొర్లే అవ‌కాశం ఉంది గ‌మనించండి.
10. ఈ ప్ర‌శ్నాప‌త్రాలు పూర్తిగా మిమ్మ‌ల్ని ప్ర‌ణాళికాబ‌ద్దంగా చ‌దివించ‌డానికి ఉద్దేశించిన‌వి. క‌నుక ఇందులో ఏవో ఎక్స్ట్రార్డినరీ ప్ర‌శ్న‌లు ఉంటాయ‌ని భావించ‌కండి. కొన్ని ప్ర‌శ్న‌లు, ప్ర‌శ్నాప‌త్రాలు సాధార‌ణ స్థాయిలో కూడా ఉండే అవ‌కాశం ఉంది.
11. వీలైనంత వ‌ర‌కూ ప్ర‌శ్న‌లు ప్ర‌స్తుత ప్ర‌శ్నాప‌త్రాల స్తాయిలో అంటే క‌ఠిన‌మైన ప్ర‌శ్న‌లు, జ‌త‌చేయ‌డం, త‌ప్పుల‌ను గుర్తించ‌డం, స‌రైన‌వి ఎంచుకోవ‌డం త‌ర‌హా ప్ర‌శ్న‌లు క‌నీసం 30 నుంచి 40 శాతం ఉండేలా ప్ర‌శ్నాప‌త్రాల‌ను రూపొందించ‌డం జ‌రుగుతంది.
12. షెడ్యూల్ ప్ర‌కారం పంప‌డంలో కానీ, ప్ర‌శ్నాప‌త్రాల స్థాయిలో కానీ మీకు ఎటువంటి ఇబ్బంది క‌లిగినా, లేక మీకు న‌చ్చ‌కున్న స‌కార‌ణంతో మీ డబ్బును వెనుక‌కు అడిగే అవ‌కాశం మీకు ఇస్తున్నాము


మీరు ఈ పోటీ ప‌రీక్ష‌లో విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తూ
మీ
న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్‌,
చింత‌ల‌పూడి, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
ఫోన్ 9441687174

మీరు ఈ ప్ర‌శ్నాప‌త్రాల‌ను కొనుగోలు చేయాల‌నుకుంటే క్రింది పేమెంట్ లింక్ ద్వారా రూ. 201 ల‌ను చెల్లించి, మీ వివ‌రాల‌ను న‌మోదు చేయండి. మ‌రియు వివ‌రాల‌ను 9441687174 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌చేయండి.

Post a Comment

Previous Post Next Post