GROUP -2 FINAL SYLLABUS & PATTERN (Screening test & Mains)

GROUP -2 FINAL SYLLABUS & PATTERN

APPSC - Group-2 Examinations:

- ఈ సారి కొత్త‌గా గ్రూపు-2 ప‌రీక్షా విధానంలో సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకొచ్చింది ఎపిపిఎస్సీ
- గ‌తంలో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌గా ఉండే ప‌రీక్షా విధానంలో మార్పుల‌ను తెచ్చింది.
- గ్రూపు-2 ప‌రీక్ష రెండు అంచెలుగా జ‌రుగ‌నున్న‌ది
            1. స్క్రీనింగ్ ప‌రీక్ష‌
            2. మెయిన్స్‌
1. స్క్రీనింగ్ ప‌రీక్ష‌ - Group-2 Screening test:
- ఉద్యోగానికి పోటీప‌డే అభ్య‌ర్ధుల‌ను ఫిల్ట‌ర్ చేయ‌డానికి ఈ స్ర్కీనింగ్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు.
ఈ ప‌రీక్ష సిల‌బస్ క్రిందివిధంగా ఉండ‌నున్న‌ట్లు ఎపిపియ‌స్సీ ప్ర‌క‌టించింది
ఎ) సమకాలీన అంశాలు: జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక, ఆర్ట్స్‌, క్రీడలు, సాంస్కృతిక, పరిపాలన (గవర్నెన్స్‌) అంశాల్లోని ప్రధాన అంశాలు.
బి) భారత రాజ్యాంగంలోని ఫెడరలిజమ్‌, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ, స్థానిక పాలన, కేంద్రంలో, రాష్ట్రాల్లో శాసన వ్యవస్థలు, కార్యనిర్వాహక వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు, గిరిజన ప్రాంతాల్లో పాలన.
సి) భారత ఆర్థికాభివృద్ధి: మధ్యభారతంలో ఆర్థిక వ్యవస్థ, స్వాతంత్య్రానికి పూర్వం భారత ఆర్థిక వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, కార్మిక విధానాలు, భారత్‌లో వ్యవసాయ, హరిత విప్లవాల ప్రభావం; ప్రాంతాలు, జనాభా వర్గాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు.

ఆర్ట్స్ గ్రూపులో ఇంట‌ర్‌మీడియ‌ట్‌, డిగ్రీ పూర్తి చేసిన అభ్య‌ర్ధుల‌కు ఈ సిల‌బ‌స్ కొద్దిగా లాభం చేకూర్చేలా ఉన్న‌ప్ప‌టికీ, సైన్స్ గ్రూపుల వారు కూడా క‌ష్ట‌ప‌డి చ‌ద‌వ‌డం ద్వారా ఉద్యోగం సాధించే అవ‌కాశం ఉంది.

2. మెయిన్స్ ప‌రీక్ష‌ Group-2 mains
- స్క్రీనింగ్ ప‌రీక్ష‌లో క్వాలిఫై అయిన అభ్య‌ర్ధుల‌నుంచి ఉద్యోగానికి ఎంపిక చేయ‌డానికి ఈ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ది.
- మొత్తం మూడు పేప‌ర్ల్లు, ఒక్కొక్క‌టి 150 మార్కుల వంతున మొత్తం 450 మార్కుల‌కు మెయిన్స్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు.
మెయిన్స్ ప‌రీక్ష‌కు సిల‌బ‌స్ క్రిందివిధంగా ఉండ‌నున్న‌ట్లు ఎపిపియ‌స్సీ ప్ర‌క‌టించింది
మెయిన్‌ పరీక్షకు సిలబస్‌

పేపర్‌ -1: Group-2 Mains Paper-1
సాధారణ విషయాలు, మెంటల్‌ ఎబిలిటీ
1. జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్య అంశాలు
2. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ సమకాలీన అంశాలు
3. సామాన్యశాస్త్రం, ఐటీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లోని సమకాలీన అభివృద్ధిలో దాని ప్రభావం.
4. ఆధునిక భారత సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర.(భారత స్వాతంత్య్రోద్యమ దృష్టి కోణం నుంచి)
5. భారత రాజనీతి, పాలన: రాజ్యాంగపరమైన అంశాలు, ప్రజా విధానాలు, సంస్కరణలు, ఇ-పరిపాలన అంశాలు.
6. ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఇండియ సైన్స్‌ ఇండిపెండెన్స్‌
7. ఆంధ్రప్రదేశ్‌ ప్రాథామ్య భారత భౌగోళిక స్వరూపం
8. విపత్తుల యాజమాన్యం
9. సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ
10. లాజికల్‌ రీజనింగ్‌, అనలటికల్‌ ఎబిలిటీ, సమాచార అనువర్తింపు
11. సమాచార విశ్లేషణ
12. ఆంధ్రప్రదేశ్‌ విభజన: పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైన సమస్యలు.
ఏ) రాజధాని నగరాన్ని కోల్పోవడం, నూతన రాజధాని నిర్మాణం- సవాళ్లు.
బి) సాధారణ సంస్థల విభజన, పునర్నిర్మాణం
సి) ఉద్యోగుల విభజన, వారి స్వస్థల అంశాలు
డి) వాణిజ్య, పారిశ్రామికవేత్తలపై విభజన ప్రభావం
ఇ) రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులు
ఎఫ్‌) రాష్ట్ర విభజన తరువాత మౌలికసదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు
జి) విభజనపై సామాజిక ఆర్థిక, సాంస్కృతిక ప్రభావం
హెచ్‌) నదీ జలాల పంపిణీ సంబంధింత అంశాలపై విభజన ప్రభావం
ఐ) ఏపీ పునర్విభజన చట్టం, 2014.
 పేపర్‌-2 Group-2 Mains Paper-2
ఆంధ్రప్రదేశ్‌ సామాజిక చరిత్ర..
1. ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, సాంస్కృతిక చరిత్ర: భౌగౌళిక స్వరూపం. చరిత్ర, సంస్కృతిపై వాటి ప్రభావం- శాతవాహనులు, ఇక్ష్వాకులు, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు. భాష, కళ, శిల్పకళాకౌశలం- వేంగి తూర్పు చాళుక్యులు-సమాజం, మతం, తెలుగు భాష, సాహిత్యం, కళలు, నిర్మాణ కళాకౌశలం.
2. 11, 16 శతాబ్దాల్లో ఆంధ్రాను పాలించిన పలు రాజ్యాలు- సాంస్కృతిక, మత పరిస్థితులు. తెలుగు భాషాభివృద్ధి, సాహిత్యం, కళ, నిర్మాణ కళాకౌశలం, చిత్రకళా కౌశలం
3. యురోపియన్లు- వాణిజ్య కేంద్రాలు- 1857 తిరుగుబాటు, ఆంధ్రాపై దాని ప్రభావం- బ్రిటిష్‌ పాలన ఏర్పాటు- సామాజిక, సాంస్కృతిక జాగృతి. జస్టిస్‌ పార్టీ/ఆత్మగౌరవ ఉద్యమం, 1885 నుంచి 1947 మధ్య ఆంధ్రాలో జాతీయోధ్యమ వృద్ధి. సామాజిక ఉద్యమకారుల పాత్ర - కమ్యూనిస్టులు-జమిందారీ వ్యతిరేకులు, రైతు ఉద్యమం, జాతీయ సాహిత్యాభివృద్ధి.
4. ఆంధ్రా ఉద్యమ పుట్టుక, వృద్ధి-ఆంధ్రమహా సభల పాత్ర, ప్రముఖ నేతలు; 1953లో ఆంధ్ర రాష్ట్రావతరణకు దోహదం చేసిన సంఘటనలు; ఆంధ్రా ఉద్యమంలో వార్తా పత్రికల పాత్ర.
5. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రావతరణకు దోహదం చేసిన సంఘటనలు-విశాలాంధ్ర మహాసభ- రాష్ట్రాల పునర్విభజన సంఘం, దాని సిఫారసులు-పెద్దల ఒప్పందం- 1956-2014 మధ్య కాలంలో ముఖ్యమైన సామాజిక, సాంస్కృతిక సంఘటనలు.
సెక్షన్‌ -2
భారత రాజ్యాంగపై సాధారణ స్థూల దృష్టి.
1. భారత రాజ్యంగ స్వరూపం
2. భారత ప్రభుత్వ నిర్మాణం, విధులు
3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసన, పరిపాలన అధికారాల పంపిణీ.
4. కేంద్ర, రాష్ట్రాల సంబంధాలు- సంస్కరణల అవసరం- రాజమన్నార్‌ కమిటీ, సర్కారియా కమిషన్‌ తదితరాలు
5. రాజ్యాంగ సవరణ విధానం
6. భారత రాజకీయ పార్టీలు
7. భారత్‌లో సంక్షేమ వ్యవస్థలు
పేపర్‌-3 Group-2 Mains Paper-3
భారత ఆర్థికరంగం, ప్రణాళిక రంగం
* భారత ఆర్థిక, ప్రణాళిక వ్యవస్థలు, ప్రస్తుత రాష్ట్రాలు
* భారత ఆర్థిక విధానాలు
* సహజ వనరుల లభ్యత, అభివృద్ధి
* బ్యాంక్‌, పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ మనీ
* వృద్ధి అర్థ, సూచీలు
* జాతీయ ఆదాయం
ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ
1. ఏపీ ఆదాయం, ఉపాధి కల్పనలో వ్యవసాయం పాత్ర
2. రాష్ట్ర పంచవర్ష ప్రణాళికలు
3. రాష్ట్ర ఆర్థిక విధానాలు
4. రాష్ట్రంలోని సేవల రంగాలు
5. రాష్ట్ర ప్రభుత్వ సామాజిక, ఆర్థికసంక్షేమ కార్యక్రమాలు.

అభ్య‌ర్ధులు స్క్రీనింగ్ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన త‌రువాత‌నే మెయిన్స్ ప‌రీక్ష‌కు వెళ్ల‌వ‌ల‌సి ఉంటుంది క‌నుక‌, ముందుగా స్క్రీనింగ్ ప‌రీక్ష‌కు సంబంధించిన సిల‌బ‌స్ పై దృష్టిసారించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా స‌మ‌కాలీన అంశాలు క‌రెంట్ అఫైర్స్ విభాగాల‌పై 50 మార్కులు కేటాయించ‌డం జ‌రిగింది క‌నుక‌, నోటిఫికేష‌న్ స‌మ‌యం నుండి క‌నీసం ఒక సంవ‌త్స‌రం వెనుక‌కు గ‌ల వ‌ర్త‌మాన ప‌రిణామాల‌ను గురించి తెలుసుకుంటూ నోట్సును రూపొందించుకోవాలి. వీటిలో ముఖ్యంగా అంత‌ర్జాతీయంగా జ‌రుగుతున్న ప‌రిణామాలు, జాతీయ స్థాయిలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాలు, శాస్త్ర‌సాంకేతిక రంగాల‌లో ముఖ్య‌మైన అంశాలు, అవార్డులు, స‌ద‌స్సులు, స‌మావేశాలు వంటి విష‌యాల‌ను ముఖ్యంగా తెలుసుకోవాలి.
భార‌త రాజ్యాంగంలోని మౌలిక భావ‌న‌లు, రాజ్యాంగం రూపుదిద్దుకున్న క్ర‌మ‌ము, కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు వంటి విష‌యాల‌ను గురించి నిశితంగా ప‌రిశీలించి, అవ‌గాహ‌న చేసుకోవాలి.
భార‌తీయ ఆర్ధిక వ్య‌వ‌స్థ అధ్య‌యనానికి 50 మార్కులు కేటాయించినందున ఈ విభాగం పై శ్ర‌ద్ద‌సారించాలి. ఈ విభాగంలో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వారికి మెయిన్స్ ప‌రీక్ష‌కు ఎంపిక‌య్యే అవ‌కాశాలు మెరుగ‌వుతాయి.

గ్రూప్‌-2 ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌య్యే అభ్య‌ర్ధుల‌కోసం న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ నిర్వ‌హిస్తున్న
గ్రూప్‌-2 స్పెష‌ల్ పేజిను వీక్షించ‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి.

Post a Comment

Previous Post Next Post