ఉష్ణము పాఠ్యాంశంలో ఇవ్వదగిన ప్రాజెక్టులు
ఉష్ణము పాఠ్యాంశంలో ఇవ్వదగిన ప్రాజెక్టులు
సమాచార సేకరణ రకపు ప్రాజెక్టులు
1. సహజ గీజర్‌కు సంబంధించిన సమాచారమును సేకరించి నివేదికను రాయండి.
2. కృత్రిమ గీజర్‌కు సంబంధించిన సమాచారమును సేకరించి నివేదికను రాయండి.
3. థర్మామీటరు ఆవిష్కృతమైన తీరు, థర్మామీటరు పనిచేసే విధానానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, నివేదికను తయారుచేయండి.
4. ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే వివిధ రకాల స్కేళ్లను గురించిన సమాచారాన్ని సేకరించి నివేదికను రూపొందించండి.
అన్వేషణ/ప‌్రయోగ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు
1. ఒక చిన్న మూత, ఒక పెద్ధ పాత్రలో ఒకే పరిమాణం గల ద్రవాన్ని ఉంచితే, ఏది త్వరగా భాష్పీభవనం చెందుతుంది? ఈ ప్రయోగం ఆధారంగా కాఫీను టీ కప్పులో కంటే సాసర్‌లో త్రాగడం ఏ విధంగా మేలో వ్యాఖ్యానించండి.
2. అంచు కలిగిన ఒక పళ్లెంలో నీరు పోసి అందులో ఒక గరాటును బోర్లించండి. గరాటు అంచు పూర్తిగా పళ్ళానికి ఆని ఉండకుండా, గరాటును ఒకవపు నాణెంపై ఉంచండి. ఈ పళ్లాన్ని బర్నర్‌పై ఉంచి నీరు మరగడం ప్రారంభించేవరకూ వేడిచేయండి. మొదట ఎక్కడ బుడగలు ప్రారంభమయ్యాయి? ఎందుకు? ఈ ప్రయోగ పరిశీలనల ఆధారంగా గీజర్ (వేడినీటి ఊట) పనిచేసే విధానాన్ని వివరిస్తూ నివేదికను రూపొందించండి.
3. మూడు ఒకే పరిమాణం కలిగిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను సేకరించండి. ఆ బాటిళ్ల పై భాగాలను ఒకదానిని తెల్లని కాగితంతో, మరొక దానిని నల్లని కాగితంతో, మూడో దానిని ఎరుపు రంగు కాగితంతో కప్పివేయండి. బాటిళ్లలో నిండుగా నీళ్లను నింపి మూడు గంటలపాటు ఎండతగిలో ప్రదేశంలోఉంచండి. మూడు గంటల తరువాత ఒక ధర్మామీటరును ఉపయోగించి బాటిళ్లలో నీటి ఉష్ణోగ్రతలను గుర్తించండి. ఏ బాటిల్‌లో నీరు ఎక్కువగా వేడెక్కినది? ఈ ధర్మం ఆధారంగా ఎండాకాలంలో ఏ రంగు దుస్తులను వేసుకోకూడదో సకారణంతో వివరించండి.
4. ఒక మీటరు స్కేలును తీసుకుని మధ్యలోనూ, మధ్య బిందువుకు సమాన దూరాలలో రెండు చివరలవద్ద రంధ్రాలను చేయండి. త్రాసు మాదిరిగా పట్టుకోవడానికి వీలుగా మధ్య రంధ్రంలో ఒక దారాన్నికట్టండి. ఒక చివర రంధ్రంలో బరువులు వేయడానికి వీలుగా ఒక పళ్ళెమును ఏర్పాటుచేయండి. రెండో చివర రంధ్రంనుండి దారం సహాయంతో ఒక వెడల్పు మూతిగల బాటిల్‌ను బోర్లించినట్లుగా కట్టండి. భారాలను చేర్చుతూ దండం క్షితిజ సమాంతరంగా ఉండేలా చేయండి. దండం క్షితిజ సమాంతరంగా వచ్చిన తరువాత బాటిల్‌లోని గాలిని నెమ్మదిగా వేడిచేసే ప్రయత్నం ప్రారంభించండి. ఏమి గమించారు? దీని ఆధారంగా సముద్రాలు వాతావరణపు ఉష్ణోగ్రతలను క్రమబద్దీకరించే విధానానికి సంబంధించిన కారణాన్ని అన్వేషించండి.
5. మూడు ఒకే పరిమాణం కలిగిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను సేకరించండి. ఆ బాటిళ్ల పై భాగాలను ఒకదానిని తెల్లని కాగితంతో, మరొక దానిని నల్లని కాగితంతో, మూడో దానిని ఎరుపు రంగు కాగితంతో కప్పివేయండి. బాటిళ్లలో నిండుగా నీళ్లను నింపి మూడు గంటలపాటు ఎండతగిలో ప్రదేశంలోఉంచండి. మూడు గంటల తరువాత ఒక ధర్మామీటరును ఉపయోగించి బాటిళ్లలో నీటి ఉష్ణోగ్రతలను గుర్తించండి. ఏ బాటిల్‌లో నీరు ఎక్కువగా వేడెక్కినది? ఈ ప్రయోగం ఆధారంగా వేడి ప్రదేశాలలో సహజంగా ఇళ్లకు తెలుపు రంగు వేయడం మేలు అనడానికి కారణాన్ని అన్వేషించండి.
ఈ ప్రాజెక్టుల జాబితాలో మరికొన్ని ప్రాజెక్టులను చేర్చడానికి మీ సహకారం అందించండి. ఉష్ణము పాఠ్యాంశం నుండి చేయదగిన ప్రాజెక్టుల వివరాలను
ఉష్ణము పాఠ్యాంశం ఇవ్వదగిన ప్రాజెక్టులు పేరుతో వాట్సాప్ ద్వారా 9441687174 నెంబరుకు లేదా menavachaitanyam@gmail.com ఈమెయిల్‌కు పంపించండి.