చరిత్రలో ఈ రోజ/జూన్ 16
1723 : అర్థశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన ఆడం స్మిత్ జననం.(మ.1790)
1870 : ప్రముఖ బెంగాలీ న్యాయవాది మరియు స్వాతంత్ర్యోద్యమ నేత, దేశబంధుగా ప్రసిద్ధి చెందిన చిత్తరంజన్ దాస్ జననం.(మ.1925)
1903 : సుప్రసిద్ధ ప్రసార ప్రముఖులు, చిత్రకారులు ఆచంట జానకీరాంజననం.(మ.1994)
1917 : ప్రముఖ తెలుగు కవి, పండితుడు మరియు అష్టావధానినముడూరు అప్పలనరసింహం జననం.(మ.1986)
1944 : బెంగాలీ విద్యావేత్త మరియు ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞుడు ప్రఫుల్ల చంద్ర రాయ్ మరణం(జ.1861)
1963 : లెఫ్టినెంట్ వాలెంతినా తెరిష్కోవా తన 26వ ఏట, మొట్టమొదటి మహిళా రోదసీ యాత్రికురాలు గా (రోదసీలోనికి వెళ్ళిన 5వ వ్యక్తి), వోస్తోక్-6 (రోదసీ నౌక పేరు) లో, రోదసీలోనికి ప్రయాణించింది.
1994 : భారత దేశ ప్రముఖ గాత్ర కళాకారిణి ఆర్య అంబేద్కర్ జననం
.
2001: దేవాదుల ప్రాజెక్టు కు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశాడు.








