ఆండ్రాయిడ్‌ - నేరుగా ఎక్సెల్‌ షీట్ లోని కాంటాక్ట్స్ ను మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాలా?

ఆండ్రాయిడ్‌ - నేరుగా ఎక్సెల్‌ షీట్ లోని కాంటాక్ట్స్ ను మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాలా?
ఈ రోజు మరో కొత్త ఆండ్రాయిడ్‌ సాఫ్ట్వేర్‌ గురించి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. తరచూ ఫోన్‌ మార్చడము లేదా, ఎక్కువగా కొత్త కాంటాక్ట్‌ నెంబర్లను ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాల్సి వచ్చేవారికోసమే ఈ సాఫ్ట్‌వేర్‌. పేరు contact transfer గూగుల్‌ ప్లేస్టోర్‌నుంచి ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
ఈ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసి, ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక మీరు మీ ఫోన్‌లో కాంటాక్ట్‌్సను బ్యాకప్‌ తీసుకోవాలనుకుంటే ఎక్స్‌పోర్ట్‌ కాంటాక్ట్స్‌ పై క్లిక్‌ చేసి ఎలా సేవ్ చేయాలో, ఎక్కడ సేవ్‌ చేయాలో వివరాలు అందిస్తే క్షణాల్లోనే మీ ఫోన్‌ కాంటాక్ట్‌ నంబర్లనీ ఎక్సెల్‌ షీట్‌గా మార్చి మీరు చూపిన ప్రదేశంలో సేవ్‌ చేయబడతాయి. వాటిని మీరు మీ కంప్యూటర్‌ద్వారా మానేజ్‌ చేసుకోవచ్చు
ఇక కాంటాక్ట్‌ నంబర్లు ఫోన్‌లో టైపు చేయడం కష్టం కనుక మీ కంప్యూటర్‌లో ఎక్సెల్‌ షీట్‌లో నేమ్‌, నంబర్‌లను టైపు చేసుకుని, మీ ఫోను లోకి .xls ఫైలుగా కాపీ చేసుకుని, పై సాఫ్ట్‌వేర్‌లోని ఇంపోర్ట్‌ కాంటాక్స్ట్‌ ద్వారా ఎక్సెల్‌ షీట్‌లోని నంబర్లన్నంిటినీ క్షణాల్లోనే మీ ఫోనులో కాంటాక్ట్‌ రూపంలో సేవ్‌ చేసుకోండి

1 Comments

Previous Post Next Post