కరెంట్‌ అఫైర్స్ - నేడు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం

16 సెప్టెంబర్: అంతర్జాతీయ ఓజోన్ సంరక్షణా దినం

16
సెప్టెంబర్ 2014ను అంతర్జాతీయ ఓజోన్ సంరక్షణా దినంగా జరిపుకున్నారు. ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతున్న పదార్థాలపై 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్స్ పై చేసిన సంతకాల తేదిని స్మరించుకునేలా ఈ రోజును నిర్ణయించబడింది. ఒజోన్ లేయర్ ప్రొటెక్షన్ 2014 థీమ్ : ది మిషన్ గోస్ ఆన్
ఈ రోజు సందర్భంగా, ప్రోటోకాల్ లక్ష్యాలను మరియు దాని సవరణలకు అనుగుణంగా కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ఒక రోజును అంకితమివ్వాలని అన్నిదేశాలకు ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది.

అంతర్జాతీయ ఓజోన్సంరక్షణా దినం గురించి 
ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతున్న పదార్థాలపై 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్స్ పై చేసిన సంతకాల తేదిని స్మరించుకునేలా 16 సెప్టెంబర్ రోజును
UN జనరల్ అసెంబ్లీ 1994లో అంతర్జాతీయ ఓజోన్ పొర సంరక్షణా దినం ప్రకటించింది.
దశలవారీగా మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం తీసుకున్న చర్యల వల్ల, ఓజోన్ క్షీణతా పదార్థాల వాడకం తగ్గడం తద్వారా ఓజోన్ పొరను కాపాడటంలోనూ మరియు వాతావరణ మార్పు పరిష్కరించడ
oలోనూ సహాయపడింది. ఓజోన్ క్షీణతకు దోహదపడుతున్న పదార్థాలుగా పరిగణించబడే వాయువులలో ముఖ్యంగా కార్బన్ టెట్రా క్లోరైడ్, క్లోరో-ఫ్లోరో కార్బన్స్,హాలోన్లు ఉన్నాయి.
ఓజోన్ పొర గురించి 
ఓజోన్ పొర, సూర్యుని హానికరమైన కిరణాల నుండి భూమిని రక్షించడానికి వాయుకవచంలా ఉండి రక్షిస్తుంది. ఈ పొర భుగ్రహం మీద జీవరాసిని రక్షించడంలో సహాయపడుతుంది. హానికరమైన అతినీలలోహిత వికిరణం(harmful ultraviolet radiation) ను భూమికి  చేరకుండా పరిమితం చేయడం ద్వారా మానవ ఆరోగ్యం మరియు పర్యావరణ వ్యవస్థలు రక్షిస్తుంది.

ఓజోన్ పొరను, ఫ్రెంచ్ భౌతికశాస్త్రవేత్తలు చార్లెస్ ఫాబ్రి  మరియు హెన్రి బుసన్ 1913లో గుర్తించగా, భూమి ఉపరితలం నుండే స్ట్రాటోఆవరణ ఓజోన్ కొలవటానికి ఉపయోగిoచే స్పెక్ట్రోఫోటో మీటర్ ను కనుగొని బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు డి.ఎం.బి. డాబ్సన్ దాని ద్వారా ఓజోన్ యొక్క పూర్తి వివరాలు అన్వేషించాడు. 1928 మరియు 1958 మధ్య డాబ్సన్ ప్రపంచవ్యాప్తంగా ఓజోన్ పర్యవేక్షణ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అవి ఈ రోజుకి కూడా పనిచేస్తున్నాయి. ఓజోన్ భారాన్ని కొలిచే కొలతకు డాబ్సన్ యూనిట్ అని పేరును పట్టడం ద్వారా అతనిని గౌరవించారు.


Post a Comment

Previous Post Next Post