డియస్సీ సిలబస్‌ . . ఇతర సందేహాల నివృతి ప్రయత్నం

సెప్టెంబర్‌ 5 న డియస్సీ నోటిఫికేషన్‌ అని విద్యాశాఖామంత్రి ప్రకటించినప్పటికీ అభ్యర్ధులలో ఎన్నో సందేహాలు. . . అవి
1. ప్రస్తుతం ఆగస్ట్‌లో కోర్సు పూర్తి చేసుకోనున్న అభ్యర్ధులకు అవకాశం ఇస్తారా?
2. ఒకవేళ అవకాశం ఇస్తే టెట్‌ ఈ డియస్సీనుంచే రద్దు చేస్తారా? (ఇప్పటి బ్యాచ్‌ ఇంకా టెట్‌ రాయలేదు, క్వాలిఫై కాలేదు కాబట్టి)
౩. లేకపోతే ముందుగా టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి తరువాత డియస్సీ నోటిఫికేషన్‌ ఇస్తారా?
4. బియిడి అభ్యర్ధులు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నా, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. ఎన్నికలకు ముందు బియిడి అభ్యర్ధులకు ఎస్జీటీ అవకాశం ఇస్తానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఉన్నారు. అది అమలు చేసే అవకాశం ఉందా?
5. డియస్సీకు పాత సిలబస్‌ చదవాలా? కొత్త సిలబస్‌ చదవాలా?
6. ఒకవేళ పాత సిలబస్‌ అంటే నలుపు తెలుపుల్లో ఉన్న పాత పుస్తకాలా? లేక నాలుగు సంవత్సరాల క్రితంనుంచి వరుసగా మారుతూ వస్తున్న రంగుల పుస్తకాలా?

నా విశ్లేషణ
సిలబస్‌ ఏదైనా పరీక్ష సరళి ఎలా ఉన్నా, అవకాశం ఇచ్చినా ఇవ్వకున్నా అభ్యర్ధి గట్టి ప్రణాళికతో చదివితేగానీ డియస్సీలో జాబ్‌ సంపాదించే అవకాశం లేదు కాబట్టి ఇప్పటినుంచి ప్రిపరేషన్‌ ప్రారంభించమని నా మనవి
ఇకపోతే డియస్సీలో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక్కడ నేను రాస్తున్న వివరాలు అన్నీ నా ఊహలే కానీ, నాకు ఎక్కడినుంచి అధికారిక సమాచారం అందలేదని విన్నవిస్తున్నాను. గమనించి చదవండి
- డియస్సీకు పాత సిలబస్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే క్రొత్త మారిన సిలబస్‌ విద్యార్ధిని దృష్టిలో ఉంచుకుని రూపొందించుకున్నది.
- ఇది పూర్తిగా కృత్యాలతో కూడుకున్నది. ఙ్ఞానం పరంగా ఈ ప్రస్తుత పాఠ్యపుస్తకాలలో ఉన్న సారం చాలా తక్కువ.
- డియస్సీ ఉద్యోగార్ధులు వారి వారి సబ్జక్టులలో పూర్తి స్థాయి పట్టు సాధించి పాఠశాలలో అడుగుపెట్టాల్సి ఉంది. కనుక అన్ని పాఠ్యాంశాలకు సంబంధించిన సంపూర్ణఙ్ఞానం ఉద్యోగార్ధికి అవసరం.
- ఈ ఙ్ఞానం ఉన్న పాత పాఠ్యపుస్తకాలనే ప్రస్తుతం సిలబస్‌గా ఎంచుకునే అవకాశం ఉంది. అయితే ఒక్కవిషయం ఏమంటే. . పాత సిలబస్‌నుంచి కాన్సెప్ట్‌ ను తీసుకుని దానిని నూతన సరళి అంటే కృత్యాధారంగా, నిత్యజీవిత అనువర్తనంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
ఉదాహరణకు గతంలో
మండడానికి అవసరంఅయిన వాయువును క్రింది వాటిలో గుర్తించండి
అని అడిగిన ప్రశ్నను ప్రస్తుతం ఇలా అడగవచ్చు
రాము వెలుగుతున్న క్రొవ్వొత్తిపై ఒక గాజు సీసాను బోర్లించాడు. ప్రక్కన ఆసక్తిగా గమనిస్తున్న సుబ్బు, కొద్దిసేపటికి కొవ్వొత్తి ఆరిపోవడం చూసి రామును కారణం అడిగాడు. రాము చెప్పే సమాధానాన్ని క్రింది ఆప్షన్‌లనుంచి ఎంచుకోండి
- ఇలా అనువర్తన ప్రశ్నల శాతం చాలా ఎక్కువగా ప్రస్తుతం ఉండవచ్చు
- కనుక అభ్యర్ధులు పాఠ్యపుస్తకాలను చదువుతూ, వాటి సారాన్ని నూతన పుస్తకాలకు అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది.

- ఇక మరో అంశం ప్రస్తుతం డిఎడ్‌ చేస్తున్న అభ్యర్ధులకు కూడా డియస్సీ అవకాశం ఇచ్చే అవకాశం ఉంది.
- ఈ విషయం టెట్‌తో ముడిపడి ఉంది. దీనికి రెండు రకాల నిర్ణయాలను ప్రభుత్వం తీసుకునే అవకాశం కలదు
  1. టెట్‌ను ఇప్పుడే రద్దు చేసి డియస్సీను రెండు పేపర్లు విధానంలో (జస్ట్‌ సైకాలజీ సబ్జక్టునుకూడా కలుపుతూ 200 ప్రశ్నలతో నిర్వహిస్తున్న ప్రస్తుత పరీక్షను 100 + 150 గా మార్చే ఆలోచన చేయవచ్చు
  2. లేదా సెప్టెంబర్‌ ఐదున కంబైన్డ్‌ నోటిఫికేషన్‌, అంటే అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో టెట్‌ పరీక్ష తేదీలను, డిసెంబర్‌, జనవరి తేదీలలో డియస్సీ తేదీలతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు.
- కనుక ప్రస్తుత బ్యాచ్‌ విద్యార్ధులు డియస్సీపై దృష్టిపెట్టడం మంచిది

- ఇక బిఎడ్‌ అభ్యర్దులకు ఎస్జీటీ అవకాశం రాజకీయ పరమైన నిర్ణయం. కనుక పూర్తిగా విశ్లేషణ దీనిపై సాధ్యంకానప్పటికి నా అంచనా ప్రకారం బిఎడ్‌ అభ్యర్ధులకు 30 శాతం పోస్టులు కేటాయించే అవకాశం ఉంది.



డియస్సీకు ప్రిపేర్‌అవుతున్న అభ్యర్ధుల కోసం అతిత్వరలో డియస్సీ డివిజినల్‌ టెస్ట్‌లను నవచైతన్య కాంపిటీషన్స్‌ అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ డివిజినల్‌ టెస్ట్లు మీకు మార్కెట్‌లో ఎక్కడా లభించవు. మీరు సబ్జక్టును ప్రణాళిక ప్రకారం చదువుతూ ప్రతి టెస్ట్‌ను పూర్తి చేయడంద్వారా డియస్సీలో పూర్తిస్తాయి విజయం సాధించవచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించండి
నవచైతన్య కాంపిటీషన్స్‌
చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా
ఫోన్‌ః 9441687174

Post a Comment

Previous Post Next Post