ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణ ఏ రాష్ట్రం అభివృద్ధివైపుకు నడవనుంది? నావిశ్లేషణ

తెలంగాణా - ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల ఏర్పాటు నా విశ్లేషణ
నా అభిప్రాయాన్ని గౌరవిస్తూ, ఆలోచనాత్మకంగా, వాస్తవానికి దగ్గరగా విమర్శలు చేయగల విఙ్ఞులైతేనే ఈ వ్యాసాన్ని చదవండి. లేకుంటే ఒక ఆంధ్రుడు (ఆంధ్రప్రదేశ్‌ వారికి మాత్రమే పరిమితమైన పదమా?) వ్రాసిన వృధా వ్యాసంగా భావించి వదిలివేయండి.
ఇద్దరు దంపతులు. . . ముగురు సంతానం . . . కలిసి మెలిసి ఉంటూ ఆనందంగా గడుపుతున్నారు. కలసి ఉన్న కాపురంలో చిన్న తమ్ముడు చాలా అమాయకుడు కావడం, ఎలాంటి పనులు చేపట్టినా రాబడి లేని పరిస్థితి ఉండడంతో ఆర్ధికంగా వెనుకబడే ఉండేవాడు. రెండవ వాడు గడుసువాడు. నిజానికి వాడికీ రాబడి లేని పరిస్థితి ఉన్నప్పటికీ పెద్దవాడు ఆశాజీవి, తమ్ముళ్లను పైకి తీసుకురావాలన్న తలంపుగలవాడు తమ్ముళ అభివృద్ధే తన అభివృద్ధి అని నమ్మిన వాడు కావడంతో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తూ అన్న, తమ్ముడు అందుకోలేని స్థాయికి వెళ్లాడు మధ్యవాడు. ఇక అన్న ఇందాక అనుకున్నట్లు తన కోసం శ్రమిస్తూనే తమ్ముళను తనవాళ్లుగా భావించి సంపాదించిన కొద్దిగా కూడా గడుసువాడైన చిన్న తమ్ముని వద్దే ఉంచాడు. మొదటి నుంచి మధ్యవాడికి అన్న, తమ్ముడుతో కలసి ఉండడం ఇష్టంలేదు. తప్పని సరి పరిస్థితులలో కలిసి ఉంటున్నా, ఆదాయం పెరుగుదల ఉండడంతో సంసారం సాగించాడు. ఇంతలో ఏమైందో . . ఎవరు నూరిపోశారో. . . పంపకాలు కావాలంటూ పిడుగులాంటి మాటన సోదరుల చెవిన వేశాడు.
పెద్దవాడు వద్దురా కలసి ఉంటే కలదు సుఖం అని నచ్చజెప్పడానికి చూశాడు. బెదిరించడానికి చూశాడు. లాభం లేదు చివరకు విడిపోయారు. న్యాయమో అన్యాయమో వడ్డించిన విస్తరి మధ్యవాడికి, ఎంగిలాకులు అన్న, తమ్ములకు మిగిలింది. వండినది అన్నే కావడంతో మళ్లీ వండుకోగలడో లేదో అన్నది, చిన్న తమ్ముడు కుదురుగా ఉంటూ అన్నతో కలిసి ఉంటాడో లేదో అన్నది వేచిచూడాలి
ఈ సోది అర్ధమైందా . ? నిజానికి ఇది మన రాష్ట్ర పరిస్థితి (ఇంతకూ నాది ప్రస్తుతం ఏరాష్ట్రం? ఎందుకంటే నిన్ననే తెలంగానా రాష్ట్రం అవతరించింది . . ఈనెల 8న ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తుందట మరి ఈ 2 నుంచి 7వ తేదీ మధ్య నా రాష్ట్రమును ఏమని పిలవాలో) పెద్దవాడు కోస్తాజీవి. చిన్నవాడు రాయలసీమవాసి కాగా గడుసువాడైన మధ్యవాడు తెలంగాణా సోదరుడు.
రాష్ట్రం విడిపోయింది. . . ఎవరి కోరికో ఏమో . . . ఎంతమంది కోరుకున్నారో ఏమో . . . మొత్తానికి జరిగిపోయింది. ఇక రెండు రాష్ట్రములు ఎటువైపుకు పోతాయో. . .
                      ముందుగా రాష్ట్ర విభజన నాకు ఇష్టంలేదు. నేను సమైక్యవాదిగా మాట్లాడడంలేదు. విడిపోతే తెలంగాణాకు కష్టాలు ఎదురౌతాయన్న భావన ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను. నా విశ్లేషణలో నాకు అనిపిస్తున్న కారణాలు. . . (వీటిపై మీ అమూల్యమైన అభిప్రాయాలను స్వీకరించడానికి నేను సిద్దంగా ఉన్నాను)
- తెలంగాణా విభజన వలన ఎన్నో వస్తాయని ప్రజలకు నాయకులు ఊదర గొట్టారు ఒక్కొక్క అంశాన్ని విడిగా చూద్దాం
- తెలంగాణా విభజన వలన నీళ్లు వస్తాయని చెప్పారు. నిజానికి తెలంగాణా లోని దాదాపు 80 శాతం భూభాగం గోదావరి, కృష్ణా నదుల మట్టం కంటే ఎగువన ఉంది. నీరు పల్లమెరుగు అన్న చందాన తెలంగాణాకు సాగునీరు అందించాలంటే ఎత్తిపోతల మినహా ఇతర మార్గాలు సాధ్యంకాదు. అయితే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అన్ని నత్తనడకన సాగుతున్నాయి. వీలైతే కొంచెం వేగంగా వాటిని పరుగెత్తించే ప్రయత్నం చేయగలరేమో కాని తెలంగాణా మెరక మొత్తాన్ని పూడిక తీసి చదును చేసి గ్రావిటీపై కాలువలు తవ్వి నీటిని తీసుకురావడం సాధ్యంకాదేమో?
- తెలంగాణా విభజన వలన ఉద్యోగాలు వస్తాయన్నారు? విభజన వలన ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇప్పటికే 610 జీవో ఇతర వాటివలన ప్రభుత్వ ఉద్యోగులు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలోనే పనిచేస్తున్నారు. ఇకపోతే మెరిట్‌ ప్రాతిపదికన నాన్‌లోకల్‌ కేటగిరిలో అందే 20 శాతం ఉద్యోగాలలోనూ, భార్యా భర్త ఇరువురు ఉద్యోగస్తులు కావడం వలలనో లేక కుక్కబుద్దితో దొంగసర్టిఫికెట్లను సంపాదించిన అక్రమార్కులో అతి కొద్దిశాతం మందే ప్రాంతాలు మారి ఉంటారు. పై కారణాలలో మొదటి రెండు న్యాయపరమైనవి కాగా చివరిది ఒక్కటే అన్యాయం. అలాంటి వారు కూడా అతి కొద్దిమందే. వారిని వారి ప్రాంతాలకు పంపితే ఎన్ని ఉద్యోగాలు ఖాళీ అవుతాయి? ఎంతమంది తెలంగానావారికి కొత్త ఉద్యోగాలు వస్తాయి? ఇక ప్రైవేటు ఉద్యోగాల విషయానికి వస్తే సమర్ధుడు తెలుగువాడు కాకున్నా హైదరాబాద్‌లో ఉద్యోగం లభిస్తుంది.. దీనికి తెలంగాణా ఆంద్రఅన్న బేధం ఏముంది? కొత్త రాష్ట్రములలో రాష్ట్రం విడిపోవడం వలన టీచర్లు, డాక్టర్లు, న్యాయవాదులు, ఇతర రంగాలలో కొత్త ఉద్యోగాల కల్పన జరగడానికి ఏం అవసరం వచ్చేస్తోందో నాకు అర్ధం కావడంలేదు. ఇకపోతే మహా అయితే రాష్ట్ర విభజన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామంటున్నారు కనుక ఐఏఎస్‌, ఐపిఎస్‌ వంటి పోస్తులతో పాటు కొద్దిగా జిల్లా స్ధాయి అధికారుల భర్తీ జరుగవచ్చేమో. బహుశా దీనినే బూత్తద్దంలోంచి పెంచి చూపించి ఉంటారు.
- సంస్కతి అన్నారు. . . రాయలసీమకు లేదా? విజయనగరానికి లేదా? ప్రకాశం నెల్లూరు, గోదావరి, కృష్ణా ఏ జిల్లాకు లేదు ప్రత్యేక సంస్కృతి . . . ఇలా ఆలోచిస్తే రాష్ట్రమును రెండుకాదు కేకులా 23  ముక్కలు చేయాలేమో?
- - ఆత్మ గౌరవం అన్నారు. . . చివరకు గౌరవిస్తున్నాము. . . మరి ఆ గౌరవం మనల్ని ఎలా నిలబెడుతుంది? ఆత్మ గౌరవం అన్నింటికి సమాధానాలు చెప్పగలదా? . . ఆంధ్రులపై వేసిన నీటి దోపిడి, ఉద్యోగ దోపిడీ, సంస్కృతి దోపిడి పదాలతో చేసిన గాయాలను మాన్పగలదా?
- కొత్తగా రాష్ట్రం ఏర్పడడం వలన ఇప్పటికే పూర్ణకుంభంగా ఉన్న తెలంగాణా రాష్ట్రం కంటే ఇప్పుడిప్పుడే మొగ్గలు వేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే విడగొట్టారు. . వెళ్లగొట్టబడ్డారు అన్న జాలి ఉంటుంది కనుక కేంద్రం నుంచి మంచి సాయం, కొత్త ప్రాజెక్టులలో ప్రాధాన్యత, ఐఐటి, ఐఐఎం, ఆసుపత్రులు, విద్యాసంస్థల ఏర్పాటు విషయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ఐదు సంవత్సరాలలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఐదు సంవత్సరాలు తెలంగానాకు ఆశించిన మేరకు సహాయం లభించకపోవచ్చు. దీనికి కారణం ఏమిటి?
- మిగులు బడ్జెట్‌ అనే ఒక దారుణమైన అందమైన అబద్దం రాష్ట్రం అంతటా హల్‌చల్‌ చేసింది. విభజనకు పూర్వం రాష్ట్ర ప్రధాన ఆదాయాలలో చాలావరకూ రాజధాని కేంద్రంగా చేసుకుని చెల్లింపులు జరిగేవే. అంటే నివాస ప్రాంతం ఎక్కడైనా వారు కట్టే టాక్స్‌ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌ ఆదాయంలో చేరి తెలంగానా ఆదాయంగా కన్పించేది. ఇక రాష్ట్రం విడిపోయిన మీదట ఎవరి ఆదాయం వారికి చెందుతుంది కనుక అనూహ్యరీతిలో హైదరాబాద్‌ ఆదాయం తగ్గే అవకాశం ఉంది. తద్వారా తెలంగాణాకు మిగులు బడ్జెట్‌ కాక, ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉండే పరిస్తితి ఉంది. అదే సమయంలో ఇటు సీమాంధ్ర ఆదాయం పెరిగి లోటు బడ్జెట్‌ లోటు పూరించబడి ఇది కూడా ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉండేలా మారబోతుంది. దీనికి అదనం కేంద్రం సహాయం . . చెప్పండి ఏ రాష్ట్రంఅభివృద్ధికి అవకాశం ఉందో. . .
- విద్యుత్‌ విషయంలో జనాభా ప్రాతిపదికన విభజన జరిగి ఉంటే తక్షణమే తెలంగాణా అభివృద్ధిలో వెనుకడుగు వేయడం, ఆంధ్రప్రదేశ్‌ సింహంలా ముందుకు దూకడం జరిగేది. కాని అన్యాయంగా అప్పులు, ఆస్తులు అన్నీ జనాభా ప్రాతిపదికన పంచి ఒక్క విద్యుత్‌ను మాత్రం వినియోగం ఆధారంగా పంపిణీ చేశారు. సరే ఇప్పుడు ఏ ఆంధ్రుడు తెలంగాణాకు బదిలీ అయిన విద్యుత్‌ను లాక్కోడానికి ప్రయత్నం చేసే అవిఙ్ఞులు కారు కానీ త్వరలో సీమాంధ్ర రాజధాని, పారిశ్రామిక అభివృద్ధి ప్రారంభం అయిన తరువాత అంటే దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇటూ వినియోగం పెరిగి విద్యుత్‌ బదిలీ ఆగిపోవచ్చు. ఈ లోగా తెలంగాణా విద్యుత్‌లోటును పూరించుకోవాలంటే కేవలం సౌర విద్యుత్‌ అవకాశాలే మార్గమని నా అభిప్రాయం. థర్మల్‌ విద్యుత్‌కేంద్రాలు స్థాపిస్తామన్న నాయకుల కారుకూతలు నేను నమ్మలేకున్నాను. జరిగితే ఆనందమే కానీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటును కాలుష్యానికి బయపడుతున్ స్థానికులు వ్యతిరేఖిస్తున్నారు. ఆ కేంద్రాల ఏర్పటాఉ అనుకున్నంత సులబం మాత్రం కాదు.
ప్రజల జీవన శైలి కూడా అభివృద్ధిలో అతి ముఖ్యం అయినది. తెలంగానా ప్రజలకు సంపాదించిందంతా ఆనందంగా ఖర్చుపెడదామనే కాని మంచి వ్యాపారం ప్రారంభించడం, పరిశ్రమలు స్థాపించడం, విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం వంటి పనులను రిస్‌్కలుగా ఫీలవుతు దూరంగా ఉంటారు. ఇది వారి అభివృద్ధికి అడ్డంకి కాగలదు
ఇలా చూస్తూ పోతే అనేక రంగాలలో విభజన తెలంగాణాకు చేటు తీసుకురాబోతున్నది. వీటివలన తెలంగాణా అభివృద్ధి కుంటుపడే అవకాశం ఎక్కువగానే ఉంది అని నా అభిప్రాయం
ఇక ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అవకాశాలు గమనిద్దాం. . .
- కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రత్యేక హోదా, టాక్‌్స హాలిడేలు కొత్త పరిశ్రమలను ఆకర్షిస్తాయి. దీనికి సమర్ధవంతమైన నాయకత్వం తోడైతే తప్పక కొత్త పరిశ్రమలు ఏర్పాటు అవుతాయి. టాక్‌్స హాలిడే ఆశతో హైదరాబాద్‌నుంచి అనేక కంపెనీలు తమ రిజిస్టర్డ్‌ కార్యాలయాలను సీమాంధ్రప్రాంతానికి తరలిస్తాయి. ఇటీవల ఆ విషయాన్ని ప్రకటించిన అవంతీసీడ్స్‌ ఈ ప్రయత్నంలో తొలి అడుగు వేసిన పరిశ్రమగా నిలిచింది.
- తెలంగానాలో పరిశ్రమలు, విద్యా సంస్థలలో సింహభాగం ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారివే. వారు మాతృ భూమిపై అభిమానం, ఇక్కడా అభివృద్ధి చెంది ధనార్జన చేయాలన్న స్వార్ధంతో కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలను ప్రారంభించే అవకాశం ఎక్కువ.
- పది సంవత్సాల పాటు టాక్‌్స హాలిడే గొప్ప వరం. పరిశ్రమ మొత్తాన్ని లారీలో ఎక్కించుకుని సీమాంధ్రకు తెచ్చుకున్నా వచ్చే నష్ఠాన్ని ఇది ఐదు సంవత్సరాలలోనే పూడ్చగలదు. కనుక పరిశ్రమలు మూకుమ్మడిగా తరలి వచ్చే అవకాశం ఉంది.
- విదేశీ కంపెనీలు, విదేశాలు, ఇతర రాష్ట్రముల పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబునాయుడుకు ఉన్న పరిచయాలు కూడా ఈ విషయంలో కొంత మేలు చేసే అవకాశం
- వినియోగం ఆదారంగా కేటాయింపులు జరిగినప్పటికీ, జనాభా ప్రాతిపదికన సీమాంధ్రకే విద్యుత్‌ వాటా అధికం. ఇదే సందర్భంలో తెలంగానాకు విద్యుత్‌లోటు ఉంది. కనుక పరిశ్రమల ఏర్పాటు తెలంగాణాలో కంటే ఆంధ్రప్రదేశ్‌లో లాభదాయకంగా ఉంటుందని పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారులు ఆలోచించే అవకాశం ఉంది.
- కొత్త రాజధాని నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ రియల్‌ ఎస్టేట్‌, స్థిరాస్థుల కొనుగోలు అమ్మకాలను పెంచే అవకాశం ఉంది. ఇదే సమయంలో పెట్టుబడి దారులు అందరూ అందరూ స్వార్ధం కోసం అయినప్పటికీ ఇటు చూడడం వలన అటు హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలలో అమ్మకాలు, కొనుగోళ్లు మందగించి రిజిస్ర్టేషన్‌ల ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గే అవకాశం
- హైదరాబద్‌లోని ప్రైవేటు కంపెనీలలో పనిచేసేవారిలో ఎక్కువశాతం మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. తెలంగాణా రాష్ట్రమన్న అభద్రతా భావం వలననో లేక మా ప్రాంతం అన్న భావనతోనో  లేక పారిశ్రామికంగా ఇక్కడ అవకాశాలు మెరుగుపడుతున్నాయన్న కారణంతోనే ఎక్కువ మంది తిరిగి సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కు వచ్చేస్తారు. దీంతో అక్కడి మేధాశక్తి కూడా ఇటు వచ్చే అవకాశం. ఎవరు ఒప్పుకున్నా లేకున్నా ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతం వారు మేధాశక్తులలో అగ్రగణ్యులు. కనుక  .  . . .
- అపార జలవనరులు, సాగు భూములు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో భాగంకాబోతున్నాయి.
- వీటికి నాయకుల అంకిత భావం తోడై అంతర్జాతీయ విమానాశ్రయాల అభివృద్ధి, నూతన పరిశ్రమల ఏర్పాటుకు అవినీతి లేకుండా అనుమతులు ఇచ్చే సరళ విధానాలు, నూతన రాజధాని నిర్మాణంలో సమర్ధత, కేంద్రం నుంచి అందే సహాయం సమర్ధంగా అందుకోగలిగితే వచ్చే పది సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ని చూడవచ్చు. బాధ అనిపించినా ఈ పది సంవత్సరాలలో తెలంగానా వెనుదిరగడాని చూడక తప్పదు. ఈ బ్లాగులో ఈ పోస్‌్టను పది సంవత్సరాలు పదిలంగా ఉంచి వచ్చే 2025  వ సంవత్సరం జూన్‌ 2 వ తేదీన చూడాలన్నది నా కోరిక
మీ నుంచి మంచి విఙ్ఞతతో కూడిన స్పందనలను కోరుతున్నాను. పై విషయాలు నేను వార్తాపత్రికలు ఇతర మార్గాల ద్వారా తెలుసుకున్న సమాచారంద్వారా చేసిన విశ్లేషణ మాత్రమే. ఇందులోని తప్పులను, సవరణలను (ఏవైనా ఉంటే) మీ నుంచి తెలుసుకోవాలన్న కోరికతో
మీ
చైతన్య కుమార్‌ సత్యవాడ
చింతలపూడి
పశ్చిమగోదావరి జిల్లా
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రము
ఫోన్‌ 9441687174
ఈమెయిల్‌ menavachaitanyam@gmail.com
 స్పందనలు


 Anonymous said...
Hi Chithanya,

Hope you are doing great. Very nice analysis, next five years, everyone in AP should get united and work for our state development..lot of people across globe has a strong feeling of we can do it..but we have to stop blaming Telangana tammullu..let them built their state..whatever the reasons, they divided telugu community, without any proper sharing rules..prathi chedulu oka manchi vuntundi..e roju vibaja ela cheyyabatti..ap lo andaru okkati ga ekam ayyi..state develop cheddam anna alochana andari lo vundi..in next 10 or 15yrs we will be good shape..with god's grace and blessing..Hard work always yields wonderful results. We can do it as one team. We have to show next generations,, andhra people always strong and sound..this is one of the best chance..even our ancestors faced same issue with Madras- AP separation.. Love all ans server all..Help ever and hurt never..
Mahesh said...
Super analysis dear.....Hats offs...its exactly true....
Hari Babu Suraneni said...
ఇంకొకటి నేను వూహిస్తున్నాను.రాజధాని యేర్పడి పునర్నిర్మాణానికి పయానం మొదలు కాగానే ఇప్పటి వరకూ తెలంగాణా లో ఉన్న ఆంధ్రా వ్యాపార పారిశ్రామిక వర్గాలు ఇటువైపుకు వస్తారు. అది విభజన వాదులు సృష్టించిన భావోద్వేగాల ఫలితమే. సాంకేతికంగా చూసుకున్నా తమ రాష్ట్రం రెవెన్యూ తరుగు లో ఉండగా తాము పొరుగు రాష్ట్రానికి పన్నులు కట్టి ఆ రాష్ట్రానికి ఉపయోగ పడటం అనేది చాలా చెత్తగా అనిపిస్తుంది యెవరికయినా. యిప్పుడు కచరా గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టం, మీరు ఇక్కదే ఉండొచ్చు అని బతిమాలుకుంటున్నారు గానీ తెలంగాణా వార్ని ప్రోత్సహించాల్సి వచ్చినప్పుదయినా ఆంధ్రా వార్ని నొక్కుతారు.అప్పుడు నొక్కించుకుని బయట పదతం కన్నా ఇప్పుడు తమను ప్రోత్సహించే సొంత గడ్డకు తరలి వెళ్ళటం మంచిది కదా అనే భావన కూడా కలవొచ్చు.ఆ రకంగా కూడా హైదరాబాదు ఆదాయం తగ్గుతుంది.
bonagiri said...
బాగా విశ్లేషించారు.

నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాదు స్థాయి అభివృధ్ధి జరిగినా, జరగకపోయినా, కేరళ రాష్ట్రంలా అన్ని అభివృధ్ధి సూచికలలో ముందు ఉంటే చాలు.
Dear Chaitanya kumar Satyawada…
I just read your article…
విడిపోయిన సోదరులు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ఎవరికి విజయావకాశాలెక్కువ? నా విశ్లేషణ
And I am from Telangana State. I agree with your views. The things you have mentioned in your story may or may not happen.
But the only thing I will not agree with you that
ఎవరు ఒప్పుకున్నా లేకున్నా ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతం వారు మేధాశక్తులలో అగ్రగణ్యులు. కనుక  .  . . .
End of the day it is nice article and appreciable.
Regards
Vijaykumar
Hyderabad
Telangana State
నావ్యాసానికి స్పందించిన మిత్రులు అందరికి ధన్య వాదములు. విజయ్‌ గారు నేను మీ వ్యాసంతో పూర్తిగా ఏకీభవిస్తాను కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంవారు మేధాశక్తిలో అగ్రగణ్యులన్న మాటను తప్ప అని మెయిల్‌ పంపించారు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతం వారు మేధాశక్తిలలో అగ్రగణ్యులన్న మాటతో వారు ఏకీభవించక పోవడం - నేను హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను.


కానీ ఆ మాట అనడానికి నా కారణాలను గమనించండి
బ్రిటీష్‌వారు భారతదేశాన్ని పరిపాలించిన కాలంలో భారతదేశంలో పలు ప్రాంతాలలో వారు వారి అవసరాల నిమిత్తం ఆంగ్లవిద్య, పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటి తెలంగాణా ప్రాంతం అప్పటి నిజాం నవాబు పాలనలో ఉండడం, ఇతర కారణాల రీత్యా సీమాంధ్ర ప్రాంతంలో ప్రారంభించిన మిషనరీ పాఠశాలలకు, కళాశాలలు, యూనివర్సిటీలతో పోల్చితే తెలంగాణ ప్రాంతంలో తక్కువ అభివృద్ధి చేశారు. దానివలన స్వాతంత్ర్యం సిద్ధించే నాటికే సీమాంధ్ర ప్రాంతంలో అప్పటికే పలు మిషనరీ పాఠశాలల స్థానిక తరాలను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నం అయ్యాయి. నిజాం నవాబు విద్యా అభివృద్ధికి ప్రాముఖ్యత ఇవ్వక పోవడం వలన స్వాత్రంత్యం వచ్చే నాటికి సీమాంధ్రప్రాంతంతో పోల్చితే తెలంగాణా చాలా వెనుకబడి ఉంది. అలాగే నిజాం నవాబు పాలనలో విద్యావకాశాల లేమి వలన ప్రజలు ఏరోజు జీవనానికి ఆరోజు కష్టం అనే భావనలో ఉండేవారు. రేపు అనే రోజును పరిశీలించలేక అభివృద్ధివైపుకు నడవలేకపోయారు. వీటి ఫలితంగా స్వాతంత్ర్యం సిద్దించే నాటికే సీమాంధ్రలో ఉన్న అభివృద్ధి అవకాశాలు, విద్యా సంస్థలు తెలంగాణాలో 1960 - 70  సంవత్సరాల వరకూ రాలేకపోయాయి. దీనితో తెలంగాణాలోని కొన్ని తరాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయి. ఇటు సీమాంద్రలో అప్పటికే అభివృద్ధి చెందిన ప్రజల జీవనం, అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్న హైదరాబాద్‌వైపు నడిచింది. అక్కడి అభివృద్ధిలో భాగం అయ్యింది. కనుకనే ఎప్పటికీ అభివృద్ధిలోనూ మేధాశక్తిలోనూ తండ్రి పది మెట్లు ఎక్కితే కొడుకు పదకొండవ మెట్టునుంచి ప్రయాణం ప్రారంభించిన చందాన అభివృద్ధి చెందిన సీమాంధ్ర తరాలు తమ వారసులను మరింత అభివృద్ధివైపుకు నడిపించారు. ఈ కారణం చేతనే ఎప్పటికీ అభివృద్ధిలోనూ, అవకాశాల వినియోగం లోనూ, మేధాశక్తిలోనూ సీమాంధ్ర వాసులు, తెలంగానా వాసులకు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ముందు ఉంటారు అన్నది నా భావన
మీ స్పందన కోసం ఎదురుచూస్తూ
మీ
చైతన్య కుమార్‌ సత్యవాడ

చైతన్య కుమార్ గారు...
మీ స్పందనకు మరియు వివరణకు ధన్యవాదాలు...
మీరు ఇచ్చిన వివరణ నాకు బాగా నచ్చింది.
మీ విశ్లేషణని నేను అంగీకరిస్తున్నాను. విద్యలో వెనకబడటం అన్నది ముమ్మాటికీ అప్పట్లో తెలంగాణా ను పాలించిన పాలకుల తప్పే కాని తెలంగాణా ప్రజల తప్పు కాదని నా అభిప్రాయం, మరియు వాళ్ళ తరువాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలించిన ఆంధ్ర పాలకుల తప్పు కూడా ఉందని నా అభిప్రాయం. నాకు తెలిసినంతవరకు తెలంగాణాలో చదువుకు అంతగా మక్కువ చూపించరు. ఎక్కువగా చిన్నదో పెద్దదో బిజినెస్ కొరకే ప్రయత్నించటం నేను గమనించాను. నిజానికి ఆంధ్రప్రదేశ్ ని పాలించిన మంత్రులు, ముఖ్య మంత్రులు ఆంధ్ర తో సమానంగా తెలంగాణాకు కూడా ప్రాధాన్యం ఇచ్చి తెలంగాణా అభివృద్ధిని కూడా కాంక్షించి ఉంటే ప్రత్యేక తెలంగాణా అనే ఆలోచనే రాకపోయేదని నా అభిప్రాయం. దీనిపై మీ స్పందన తెలియజేయండి.

విజయ్ కుమార్...
అదికూడా తప్పే అని నా అభిప్రాయం నిజానికి ఆంధ్రపాలకులు స్వార్ధపరులే
అయితే రాయలసీమ ఇప్పటి హైదరాబాద్‌ మహానగరం కంటే అధికంగా అభివృద్ధి చెంది
ఉండాల్సింది. ఎందుకంటే ముఖ్యమంత్రులలో ఎక్కువశాతం రాయలసీమ వాసులే.
రాష్ట్రమును నడిపించే నాయకత్వం రాయలసీమ వాసులదే. . . కానీ ప్రతి ప్రాంతం
అభివృద్ధి పాలకులతో పాటుగా ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులపై కూడా ఆధారపడి
ఉంటుందన్న విషయం గుర్తించాలి. మన ప్రాంతం ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం.
రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలకు సరైన నీటిపారుదల వసతి లేని కారణంగా ఆ
ప్రాంతం అబివృద్ధికి ఎప్పటికి కొంచెం వెనుకబడే ఉంటుంది. ఎంతమంది
మంత్రులు, నాయకులు తలుచుకున్నా రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిని అభివృద్ధి
చేయగలరా. . .


అసలు తెలంగాణ సమస్య ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణా మధ్య సమస్య కాదనేది నా
అభిప్రాయం. ఎందుకంటే తెలంగాణాలో హైదరాబాద్‌ చాలా ఎక్కువగా అభివృద్ధి
చెందిందనేది వాస్తవం. హైదరాబాద్‌తో పోల్చదగిన నగరం అటు తెలంగాణలోనూ, ఇటు
ఆంధ్రప్రదేశ్‌లోనూ అభివృద్ధి చెందకపోవడం విచారకరం. ఈ విషయంలో
హైదరాబాద్‌లేని తెలంగాణా ఎంతగా వెనుకబడినదో అంతగానే ఆంధ్రప్రదేశ్‌కూడా
వెనుకబడినది అన్నది గుర్తించాలి. తెలంగాణాలోని ఆదిలాబాద్‌ వంటి జిల్లాలు
వెనుకబడి ఉన్నట్లుగా ఇటు మా జిల్లాలోని పోలవరం, టి.నర్సాపురం వంటి (మా
సమీప ప్రాంతాలు) వెనుకబడి ఉన్న విషయాన్ని గమనించాలి. సో సమస్య అల్లా
అభివృద్ధి హైదరాబాద్‌ చుట్టూ కేంద్రీకృతం అవ్వడమే. దీనికి పరిష్కారం
రాష్ట్ర విభజన ఎంతమాత్రమూ కాదు. జస్ట్‌ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని
అటు సీమాంధ్ర లోనూ ఇటు హైదరాబాదేతర తెలంగాణ లోనూ ఇతర ప్రాంతాలను
అభివృద్ధి చేస్తే సరిపోయేది. కానీ కొందరు నాయకులు స్వలాభం కోసం దీన్ని
బూచిగా చూపుతూ విభజనకు తెరలేపారు. కేంద్రం తెరదించుతూ విభజించింది.
చెప్పండి ఇప్పటికైనా హైదరాబాద్‌ను ప్రక్కనబెట్టి ఇతర తెలంగానా అభివృద్ది
జరుగుతుందంటారా? హైదరాబాద్‌ లాంటి అభివృద్దిని ఆదిలాబాద్‌లోని పల్లెలు
చేరుకుంటాయంటారా?


2 Comments

  1. "ఎవరు ఒప్పుకున్నా లేకున్నా ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతం వారు మేధాశక్తులలో అగ్రగణ్యులు. కనుక ..."
    అలాగే ఎవరు ఒప్పుకున్నా లేకున్నాఆంధ్రప్రదేశ్‌ ప్రాంతం వారు కన్నా బ్రిటిష్ వాల్లు మేధాశక్తులలో అగ్రగణ్యులు కదా!

    ReplyDelete
  2. ఎదో ఒక రాష్ట్రం మాత్రమే అభివ్రుద్ది అయ్యే అవకాషం ఉన్నట్టుగా ఉన్నది మీ ప్రష్న, రెండు రాష్ట్రాలు అభివ్రుద్ది అయ్యే అవకశాని కూడ ప్రష్న లో చేర్చగలరు

    ReplyDelete
Previous Post Next Post