విద్యుత్‌ - ఆవిష్కరణ

విద్యుత్‌ - ఆవిష్కరణ
- క్రీ.పూ. 800 సంవత్సరంలో తొలిసారిగా గ్రీకు దేశానికి చెందిన థేల్స్‌ అనే శాస్ర్తవేత్త సీమగుగ్గిలాన్ని ఉన్ని చర్మంతో రుద్ది, అది చిన్న చిన్న తేలికపాటి వస్తువులను ఆకర్షించడాన్ని గుర్తించాడు.
- గ్రీకు భాషలో సీమగుగ్గిలాన్ని ఎలక్ర్టాన్‌ అంటారు.
- 16వ శతాబ్దంలో గిల్బర్ట్‌ అనే శాస్ర్తవేత్త గాజు కడ్డీను సిల్క్‌గుడ్డతో రుద్ది, అది ఆకర్షణ ధర్మాన్ని పొందడాన్ని గుర్తించాడు.
- ఇలా రెండు వస్తువుల ఘర్షణ వలన వస్తువులు విద్యుదావేశపూరితం అవ్వడాన్ని విద్యుదీకరణ అని పిలిచారు.
- గిల్బర్ట్‌ ఈ ఆకర్షణా తత్వానికి స్థావర విద్యుత్‌గా నామకరణం చేశారు.
- పై ప్రయోగాలే కాకుండా పొడిజుట్టును ప్లాస్టిక్‌ దవ్వెనతో దువ్వినపుడు, గాజు తలుపులను పొడిగుడ్డతో తుడిచినపుడు, ప్లాస్టిక్‌పెన్నును ఉన్నికోటుతో రుద్దినపుడు కూడా విద్యుదీకరణం జరగడాన్ని గమనించవచ్చును

Post a Comment

Previous Post Next Post