సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో కొత్త కొలువులు సందడి చేస్తున్నాయి. వీఆర్‌ఓ/వీఆర్‌ఏ నోటిఫికేషన్ విడుదల అయ్యి వారం గడవక ముందే డిగ్రీ క్వాలిఫికేషన్‌తో పంచాయితీ కార్యదర్శుల ప్రకటన విడుదల అయినది. పది, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలు కలిగి ఉన్న అభ్యర్ధులకు వీఆర్‌ఏ, వీఆర్‌ఓ, పంచాయితీ కార్యదర్శుల భర్తీ ప్రకటనలు వరమనే చెప్పాలి. ప్రణాళికాబద్దంగా ప్రిపరేషన్‌ను కొనసాగిస్తే వీటిలో విజయం సాధించవచ్చు. అదే సందర్భంలో పోటీ ఎక్కువ ఉంటుదన్న విషయాన్ని అభ్యర్ధులు మరువరాదు. ఈ పంచాయితీ కార్యదర్శిల నియామక పరీక్షలకు సంబంధించినవివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం
రాత పరీక్ష తేదీ ఫిభ్రవరి 23, 2014
దరఖాస్తుల స్వీకరణ 2014 జనవరి 04 నుంచి 2014 జనవరి 22 వరకూ
రాత పరీక్ష రెండు పేపర్లతో ఉంటుంది
మొదటి పరీక్షలో కరెంట్ అఫైర్స్ (జాతీయ అంతర్జాతీయ అంశాలు, ఇతర అంశాలు), చరిత్ర, అర్ధశాస్ర్తం, రీజనింగ్, విపత్తుల నిర్వహణ వంటి అంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు.
రెండవ పరీక్షలో గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానాలపై ప్రశ్నలు అడుగుతారు.
పైన చెప్పిన అంశాలు పేర్లు క్రొత్తగా కనిపిస్తున్నప్పటికీ, కొత్త సీసాలో పాత సారా అన్న చందాన మూడు నుంచి పదవ తరగతి వరకూ ఉన్న పాఠ్యాశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా మెరుగైన ప్రతిభను చూపవచ్చు.
ప్రిపరేషన్ ఇలా సాగించండి.
- మూడు నుంచి పదవ తరగతి వరకూ ఉన్న భౌతిక, రసాయన, జీవ శాస్ర్తాలలోని అంశాలను క్షుణ్ణంగా చదవండి
- కరెంట్ అఫైర్స్ విభాగంలో పట్టు సాధించడానికి కనీసం ఆరు నెలలకు ముందు దినపత్రికలను సేకరించండి. సాధ్యంకాని పక్షంలో సూర్య వారి ప్రఙ్ఞ వారపత్రికలోని వీక్లీరౌండప్ పేజీలను, సాక్షివారి భవిత వీక్లీ రౌండప్‌పేజీలను, ఆంధ్రజ్యోతి వారి దిక్సూచిలోని వీక్లీ రౌండప్ పేజీలను సేకరించండి. వాటిని అధ్యయనం చేయడం ద్వరాఆ కరెంట్ అఫైర్స్ విభాగంపై పట్టు సాధించండి.
- జికె కోసం మార్కెట్‌లో దొరికే మంచి పుస్తకాన్ని సేకరించి రోజుకు కొన్ని టాపిక్‌లను అధ్యయనంచేయండి.
- చరిత్ర, ఆర్ధిక సంబంధ అంశాలు, విపత్తుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద కనబరచి విజయం సాధించండి.
- పంచాయితీ కార్యదర్శి డివిజినల్ టెస్ట్‌లు (20)
- పంచాయితీ కార్యదర్శి స్టడీ మెటీరియల్
- కరెంట్ అఫైర్స్ కోసం ప్రఙ్ఞవీక్లీ రౌండప్‌ల సేకరణ
లు లభించును
వివరాలు సూచనలకోసం సంప్రదించండి
మీ
చైతన్య కుమార్ సత్యవాడ
ఫోన్ 9441687174
email menavachaitanyam@gmail.com
మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174