చిన్నారి గేయాలు - వారాలు
ఆదివారం నాడు అరటి మొలిచింది
సోమవారం నాడు సుడివేసి పెరిగింది
మంగళవారం నాడు మారాకు తొడిగింది
బుధవారం నాడు పోట్టిగెల వేసింది
గురువారం నాడు గుబురులో దాగింది
శుక్రవారం నాడు చూడగా పండింది
శనివారం నాడు చక చక గెలకోసి
అందరికి పంచితిమి అరటి అత్తములు
అబ్బాయి అమ్మాయి అరటి పండ్లివిగో
Tags
చిన్నారి గేయాలు