శుభ‌వార్త . . . న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ ప‌ది ల‌క్ష‌ల మంది వీక్ష‌కుల‌ను చేరుకున్న‌ది. . .

శుభ‌వార్త . . . న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ ప‌ది ల‌క్ష‌ల మంది వీక్ష‌కుల‌ను చేరుకున్న‌ది. . .
మిత్ర‌మా,
నిరుద్యోగుల‌కు చ‌క్క‌ని స్ట‌డీ మెటీరియ‌ల్స్ ఉచితంగా అందించే వేదిక‌ను నిర్మించాల‌న్న స‌త్సంక‌ల్పంతో 2011 డిసెంబ‌ర్ 6 న ప్రారంభం అయిన న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ ప‌య‌నంలో మ‌రో ఉన్న‌త‌మైన మైలు రాయిని చేరుకున్న‌ది. నేటి వ‌ర‌కూ న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ వెబ్‌సైట్‌ను వీక్షించి, స్ట‌డీమెటీరియ‌ల్స్ లేదా ఇత‌ర అంశాల‌ను వినియోగించుకున్న వీక్ష‌కుల సంఖ్య 10,00,000 ల‌ను దాటింది. ఇటువంటి చ‌క్క‌ని విజ‌యాన్ని అందించి న మీ అంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాద‌ములు.

అయితే ఇంకా న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ సాధించాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా వెబ్‌సైట్లో క‌రెంట్ అఫైర్స్‌, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, సైకాల‌జీ, విద్యాదృక్ప‌ధాలు, భౌతిక శాస్త్ర‌ము, ర‌సాయ‌న శాస్త్ర‌ము, అరిథ్‌మెటిక్‌, రీజ‌నింగ్‌, విపత్తుల నిర్వ‌హ‌ణ వంటి స‌బ్జ‌క్టుల‌కు సంబంధించిన చ‌క్క‌ని స్ట‌డీమెటీరియ‌ల్స్ అందుబాటులో ఉంటున్న‌ప్ప‌టికీ మిగిలిన స‌బ్జక్టులకు సంబంధించిన స్ట‌డీ మెటీరియ‌ల్స్ త‌క్కువ‌గా ఉంటూ కొద్ది వెలితిని చూపిస్తున్నాయి. క‌నుక మీరు లేదా మీ మిత్ర‌బృందంలో ఎవరైనా చ‌క్క‌ని స్ట‌డీ మెటీరియ‌ల్స్ రూపొందించిన లేదా రూపొందించాల‌న్న ఉత్స‌హాం ఉన్న వారిని న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్‌కు ప‌రిచ‌యం చేయండి. భవిష్య‌త్తులో అన్ని స‌బ్జ‌క్టుల‌కు సంబంధించిన, అన్ని పోటీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన చ‌క్క‌ని స్ట‌డీ మెటీరియ‌ల్స్‌తో న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్‌, ఉద్యోగార్ధుల‌కు వారి జీవిత ల‌క్ష్యాన్ని చేరుకొనేందుకు ఒక చుక్కానిలా న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ మారాల‌ని ఆకాంక్షిస్తున్నాను.
మీ స‌హాయం అందించాల‌ని కోరుతూ
విద్యాదానం - మ‌హాదానం
మీ
చైత‌న్య కుమార్ స‌త్య‌వాడ‌
చింత‌ల‌పూడి, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా, ఫోన్ 9441687174
వీక్షించండి.
న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్‌
www.navachaitanya.info

Post a Comment

Previous Post Next Post