సైన్స్ ఫెయిర్‌లో పాల్గొనడం వలన విద్యార్ధులలో సృజనాత్మక తత్వం అభివృద్ధి చెందుతుంది. అయితే వినూత్నంగా ఆలోచించడం, సైన్స్ మోడల్‌ను తయారుచేయడం అంత సులభమైన విషయమేమీ కాదు. శాస్ర్తీయ కోణంలో ప్రతీ అంశాన్నీ పరిశీలించడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. విద్యార్ధినీ, విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు సైన్స్ ప్రాజెక్టుల పట్ల అవగాహన కలిగించడానికి, నూతన ఆలోచనలను రేకెత్తించడానికి, ఇప్పటివరకూ జరిగిన సైన్స్ ఫెయిర్లలో విద్యార్ధులు రూపొందించి ప్రదర్శించిన వందలాది సైన్స్ ప్రాజెక్టులను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో రూపొందించబడిన సైంటిఫిక్ స్టూడెంట్స్ వెబ్సైట్లో పొందుపరచి ఉంచారు. నవచైతన్య కాంపిటీషన్స్ వీక్షకులకోసం ఈ లింక్‌లను క్రింద పొందుపరిచాము. మీరు కోరిన లింక్ పై క్లిక్ చేసినట్లయితే యూట్యూబ్ ద్వారా మీరు కోరిన వీడియో ప్రసారం అవుతుంది.
గమనించండిః ఈ వీడియోలు యూట్యూబ్ ద్వారా లింక్ చేయడం వలన స్పీడ్ నెట్ కనెక్షన్ ఉన్నవారు మాత్రమే ఎలాంటి అంతరాయం లేకుండా వీడియోలను చూడవచ్చును. ఒకవేళ మీ నెట్ స్పీడ్ తక్కువగా ఉన్నా, లేక ఈ వీడియోలను మీ కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకుని మీ విద్యార్ధులకు చూపించాలని ఉన్నా, లేక ఎలాంటి ఇతర వివరాలకోసం అయినా సంప్రదించండి.
- మీ చైతన్య కుమార్ సత్యవాడ
భౌతిక & రసాయన శాస్ర్త ఉపాధ్యాయులు,
చింతలపూడి,
ఫోన్ - 9441687174
ఈమెయిల్ - menavachaitanyam@gmail.com
మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174